Posts

Showing posts from January, 2010
జోల పాట . జో అచ్యుతానంద జో జో ముకుందా రారా పరమానంద రామ గోవిందా //జో/./ తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించీ నాలుగూ వేదాల గొలుసులమరించీ బలువైన ఫణి రాజు పానుపమరించీ హృదయ డోలిక లోన చేర్చి లాలించీ //జో// సాధారణం గా ఈ రోజుల్లో ఎవరూ జోల పాడట్లేదు ఒకసారి దాని తాదాత్మ్యత అర్ధం అయితే ఇంకో చరణం కావాలని అడిగిన వాళ్లకి కంటిన్యూ చేస్తాను. ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా అద్దాలలో నేడు బిడ్డలైనారా ఏ జన్మ మున ఏమి నోము నోచితినో ఈ జన్మలో నాకు బిడ్డలైనారా ఒంకారామనిఎటి ఉయ్యాల లొనూ తత్వమసి మనియేటి చలవటు పరచి నేర్పుతో పాపడ్నిఉయాలలో చెర్చీ ఏడు భువనముల వా రేకమై పాడా నిండుగా దీవించి రెల్ల లోకాలా తొమ్మిదీ వాకిళ్ళు దొడ్డిలోపలను ముర్ఖులారుగురూను సాధులైనారూ అంతలోముగ్గురు ముర్తులున్నారూ తెలివి తెలిపేటివాడు దెవుడున్నాదూ పట్టవలె ఆర్గురిని పదిలమ్ము గానూ కట్టవలె ముగ్గురిని కదలకుణ్దానూ ఉంచవలె నొక్కనీ హ్రుత్కమలమన్దూ చూదవలె వెన్నెలల భావ మన్దునననూ జంట గూడిన వాని జాడ గనవలెనూ యింట బ్రహ్మానంద ముంటుoడ వలెనూ .

కోసికొమ్ము ఈ కుసుమము lalitha geyam.

కోసికొమ్ము ఈ కుసుమము వేచి ఉంది నీ కోసము చేసితివా ఆలస్స్యమూ ఎపుడు రాలునో యీ సుమము ప్రభూ వేవేగ రమ్ము నిను చేరనిమ్ము కడు అల్పమైన దీ జీవితమూ //కోసికొమ్ము ఈ కుసుమము // నిన్నలంకరించిన మాలలో నా కి చోటేక్కడిదోయీ ఆ రంగురంగులా పూవులతో నే పోటే పడలేనోయీప్రభూ వేవేగ రమ్ము నిను చేరనిమ్ము కడు అల్పమైన దీ జీవితమూ //కోసికొమ్ము ఈ కుసుమము // ఏ గాలి ఎపుడు వీచునో నన్నేవైపు విసరి వైచునో నా బ్రదుకు నేలపాలగునో ప్రభూ వేవేగ రమ్ము నిను చేరనిమ్ము కడు అల్పమైన దీ జీవితమూ //కోసికొమ్ము ఈ కుసుమము // ఈ పాత ఇంకా ఉంది. గుర్తు రావట్లేదు. మళ్ళి వ్రాస్తాను.

కలవారి కోడలు కలికి కామాక్షి

కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుతున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచెనూ ఆమె పెద్దన్న కాళ్ళుకూ నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపే ఎన్దుకూ కన్నీళ్ళు ఏమి కస్తాలూ తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులూ ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము చేరి మీ వారితో చెప్పి రావమ్మ. కుర్చీ పీట మీద కూర్చున్న అత్తా మా అన్నలోచ్చారు నన్నంపుతారా నేనెరుగ నేనెరుగ మీ మామ నడుగు పట్టే మంచము మీద పడుకున్నమామా మా అన్నలోచ్చారు నన్నంపుతారా నేనెరుగ నేరుగా నీ భర్త నడుగు రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి మా అన్నలోచ్చారు నన్నంపుతార భారతము చదివేటి బావ పెద బావా మా అన్నలోచ్చారు నన్నంపుతారా నేనెరుగ నేనెరుగ మీ అక్కనడుగు. ఇంకా తోటికోడలిని , మరిదిగారిని కూడా అనుమతి అడగడం ఈ గేయంలో ఉంది. గుర్తుకి రావట్లేదు. నేను చిన్నప్పుడు మూడో తరగతిలో అనుకుంటా ఈ గేయము బోధనంశంగా ఉండేది.మారుతున్న ఈ రోజుల్లో ఆ నాడు ఆడ పిల్ల పరిస్టితి ఎంత కట్టడిలో ఉండేదో చూస్తే మనం ఎంత స్వేచ్చ ఎంత హాయి అనుభవిస్తున్నామో తెలుస్తుంది.

పార్కులోపల పని లేని బాలు డొకడు

పార్కులోపల పని లేని బాలు డొకడు తిరుగుచుండెను రాగాలు తీసికొనుచు కలదు ఒక చేతిలో వాని వద్ద రొట్టె ముక్క కలదు మరియొక కరమున కర్రముక్క వెర్రి వేషాలు వెయుచూ కుర్రవాడు అటుగా దారిలో నుండి పోయెడికుక్కను రొట్టె చూపించి ఆశగా పిలిచినాడు. రొట్టేముక్కను చూసిన కుక్క తానూ ఆశ గా తోకను ఊపుకొనుచు కుర్రవానిచుట్టు తిరుగాసాగే కొంటె చేష్టలు మాలిన ఆ పిల్లవాడు రొట్టె ఆశను చూపి ఆ కుక్క నెత్తిపై కర్రతో మొట్టినాడు కుయ్ కుయ్ మనుచు ఆ కుక్క వెడలి నంతలోనె వెనుదిరిగి చుచునంత పిక్క బలముగా బట్టి ఆ కుక్క కరచే ఇది సుమారు యాభై ఐదు ఏళ్ళ క్రితం పిల్లలకి పాఠం గా ఉండేది. అక్కడక్క మర్చి పాయి సొంతం గా పదాలు చేర్చి వ్రాసాను ఇలాంటి పాఠాలు ఇప్పుడు ఎక్కడా కనిపించవు

naaku istamaina pata

మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్ మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్ ఉరుములురిమి నను తరిమి కొట్టితే మెరుపు తీగె కొరడా ఝలిపిస్తే మంద విడిన తూవాయికిమల్లె మనసుఉరక బెంబెలయి పోతది //మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్// కొండలోయ లో నల్లని మబ్బులు గుంపులు గుంపులు నడస్త ఉంటె గుండెలోతులో మెల్లని సవ్వడి గుట్టుచప్పుడు గ దాచేదెవరో మబ్బులు మబ్బులు మబ్బు లోచ్చినయ్//

బస్సులోంచి బయటకి ఉమ్మేసారు

నిన్న మధ్యాన్నం అనుకుంటాను ఒక అతను బాగా తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు వేసుకుని టక్ చేసుకుని బైకే మీద వేగంగా వెళ్తున్నాడు. నేను సిటీ బస్సు లోంచి బయటకి చుస్తూ అనుకున్నాను ఎంత హడావుడి గా వెళ్తున్నడా అని మధ్య మధ్య లో ఫోన్ మట్లాడుతూ పది నిముషాల్లో చేరుకుంటానని చెబుతున్నాడు. చూస్తుండగానే మా బస్సులోంచి శుభ్రంగా నమిలిన గుట్కా పాన్ ఎవరో తుపుక్కున బయటకి ఉమ్మేసారు. ఫోన్ ముగించి చూసుకున్న అతని తెల్ల చొక్కా కాస్తా రంగు మారిపోయి ఆఫీసు కే కాకుండా రోడ్ మీద నడవడానికి రాని పరిస్టితి. అతన్ని చూస్తుంటే చాలా బాదః గా అనిపించింది. కానీ ఏమి చేవ్యలేని అసహాయ పరిస్టితి తర్వాత రెండు మూడు రోజులకు మళ్ళి అతడు నేను ఎక్కిన బస్సు లోనే కనిపించాడు. నేనే ఎం జరిగిందని పలకరించాను . అతను చెప్పిన మాట విని చాలా బాధ వేసింది, ఆ రోజు అతను ఇంటర్వ్యూ కి ఫైనల్ గా వెళ్తున్నాడు. ఆ రోజు క్లియర్ ఐతే అతడి లైఫ్సెటిల్ అయినట్లే      కానీఆ రోజు జరిగినదానివల్లా ఇంటర్వ్యూ కి వెళ్ళలేక పోయాడు . నన్నేం చెప్పమంటారు? అజాగ్రత్త, నిర్లక్ష్యం ఖరీదు ఒక జీవితం అని తెలుసుకోవాలి

నల్లనివాడా

నల్లనివాడా నే గొల్ల కన్నెనోయి పిల్లనగ్రొవూదుమొ నా ఆ ఆ ఆ ఉల్లము రంజిల్లగా//నల్లనివాడా// నీ తీయని పాటలకై వేసిరి ఒంటిగా వచ్చితినొయీ నా తనువూ మనసు నా మనికే నీది కదా పిల్లనగ్రొవూదుమొ//నల్లనివాడా// ఆకసానా మబ్బులని చీకటులె మూగెననీ నేనేరుంగ నైతిని నీ తలపే వెలు0గాయే పిల్లనగ్రొవూదుమొ //నల్లనివాడా// నల్లనివాడా నే గొల్ల కన్నెనోయి పిల్లనగ్రొవూదుమొ నా ఆ ఆ ఆ ఉల్లము రంజిల్లగా//నల్లనివాడా//

తూరుపు దిక్కున అదిగో చూడు

తూరుపు దిక్కున అదిగో చూడు పొడిచే వేగు చుక్కా పొడిచే వేగు చుక్కా సత్యాహింసల సూర్యోదయమై నిత్యముశాంతి నిత్యమూ కాంతి దేశ దేశ ప్రజ సంతోషించగా శాంతిని చూపెడి చుక్కా పొడిచే వేగు చుక్కా

చలిగాలి వీచింది

చలిగాలి వీచింది తెలవార బోతోంది ఇకనైన ఇలు చేరేవా ప్రియా ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ యెదురూ తెన్నూలు చూసి ఎద బెదిరి పోయింది నిదురలో పడు తనువూ నిలబెట్టుకున్నాను ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ బరువాయె నా మేను చెరువాయె కన్నీరు విరహావేదన నేను మరి ఓపలేను ఇకనైన ఇలు చేరవా ఓ ఓ ఓ ప్రియ

బంగారు పాపాయి బహుమతులు

బంగారు పాపాయి బహుమతులు పొందాలి పాపాయి చదవాలి మా మంచి చదువు పాపాయి చదవాలి మా మంచి చదువు మా paapa పలికితే మధువులే కురవాలి మా paapa పాడితే పాములే ఆడాలి పలుదేషములు పోయి తెలివిగల పాపాయి ఘనకీర్తి తేవాలి ఘనకీర్తి తేవాలి/ / బంగారు పాపాయి బహుమతులు పొందాలి // ఏ దేశ మే జాతి ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి అని ఎల్లరడగాలి తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంత చాటి మురిపించాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి బంగారు పాపాయి బహుమతులు పొందాలి // పాపాయి చదవాలి మా మంచి చదువు//
బావా! బావా! పన్నీరు "బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు మూడు గుద్దులు గుద్దేరు మూలన మంచం వేసేరు ముంతెడు గంజి యిచ్చేరు బావా! బావా! పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీశెడు గంధం పూసేరు చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు." పల్లేరు తెప్పించి పక్క వేయండీ నల్లేరు తెప్పించి నలిచి విడువండీ నల్లేరు చేతాను నయము కాకుండీ దూలగొండి తెచ్చి దులుపి పంపండి."

అమ్మ దొంగా నిన్ను

అమ్మ దొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగా //అమ్మ దొంగా నిన్ను // కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్న లడుగుతూ కిలకిల మని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగా //అమ్మ దొంగా నిన్ను కథ చెప్పేదాకా కంట నిదుర రాకా కథ చెప్పేదాకా నన్ను కదలనీకా మాట తోచ నీకా మూతిముడిచి చుసెవూ //అమ్మ దొంగా నిన్ను// ఎపుడో ఒక అయ్యా నిన్ను ఎగరేసుకుపోతే నిలవలేక నా మనసూ నీ వైపే లాగితే గువ్వ ఎగిరిపోఇనా గూడు నిదుర పోవునా //అమ్మ దొంగా నిన్ను// నవ్వితేనీ కనులా ముత్యలూ రాలూ ఆ నవ్వే నిను వీడక ఉంటె అది చాలూ కలతలూ కష్టాలు నీ దరికీ రాకా కలకాలం నీ బ్రతుకూ కలల దారి నడవాలీ వూ //అమ్మ దొంగా నిన్ను//