విరోది /వికృతి
అందరికి వికృతినామ శుభాకాంక్షలు చెబుతున్న కూడా నా మనసే ఎందుకో నాకు విరోధి లాగ ఉంది ఈ రోజు. స్వగతంగానే అన్న పైకే వచ్చేసింది ఆ మాట .ఎవరేనా వింటున్నారేమో,. గోకి తెచ్చుకుంది గోడ్డుగేదే అన్నట్లు అసలే మనసు బాగోలేక అవస్థ పడుతూ పనిచేసుకుంటున్నాను, లేనిపోని గొడవలు కూడావస్తె ........ఆలోచనల్ని కట్టిపెట్టి పనిలో పడ్డాను. మేడంమీ లీవ్ మంజూరు కాలేదు నా కొలిగు శుభాకాక్షాలు చేబుతూ నే చావు కబురు చల్లగా చెప్పింది.. అవును, ఇంటి అద్దె ఈనెల ఆలస్యంగా ఇస్తానని ఇంటి యజమానికి ముందుగానే చెప్పి మంచిపని చేసాను. ఎరా ఏం చేస్తున్నావ్ ముందుగదిలో కూచుని ఇంటర్ నెట్ లో పని చేసుకుంటున్న మా వాడిని కెకేసా . తలెత్తకుండా ,సమాధానం చెప్పకుండా తన పనిలో మునిగిపోయాడు. ఒళ్ళు మండిపోతున్న అలాగే...