Posts

Showing posts from February, 2014

సీతాకల్యాణ వైభోగమే

     సీతాకల్యాణ వైభోగమే      రామకల్యాణ వైభోగమే      పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర       రవి సోమ పవనేత్ర రమణీయ గాత్ర     భక్త జన పరిపాల భరిత షరజాల    భుక్తి ముక్తిద లీల భూదేవ పాల    పామరా సురభీమ పరిపూర్ణ కామ    శ్యామ  జగదభి రామ సాకేత ధామ      సర్వ లోకాధార సమరైక ధీర     గర్వ మనస దూర కనకాఘ ధీర     నిగమాగమ విహార నిరుపమ శరీర     నగధ విధార నత లోకాధార      పరమేశనుత గీత భవ జలధిపోత      తరుణి కుల సంజాత త్యాగరాజనుత       సీతాకల్యాణ వైభోగమే      రామకల్యాణ వైభోగమే