బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకియ్యి ఉయ్యాలో నాగుల పంచమి ఉయ్యాలో నేనోక్కపోద్దుంటి ఉయ్యాలో మా ఇంట్లఅందరు ఉయ్యాలో దశిమొక్కపోద్ద మ్మ ఉయ్యాలో పసుపు బెట్టి నీలు పోసి ఉయ్యాలో పట్టు వొల్లె గట్టి ఉయ్యాలో పట్టు మొగ్గల రవికె ఉయ్యాలో పేయి నిండా తొడిగి ఉయ్యాలో వొప్పిన పేలాలు ఉయ్యాలో ఒడినిండ పోసుకొని ఉయ్యాలో చిలకల జెలి చెంబు ఉయ్యాలో చేత పట్టుకొని ఉయ్యాలో పోయిరే అమ్మల్లు ఉయ్యాలో పుట్ట న పాలుబొయ్య ఉయ్యాలో పుట్ట నోమితినమ్మ ఉయ్యాలో పుట్టింటి సలువకు ఉయ్యాలో అరుగు నోమితినమ్మ ఉయ్యాలో అన్నల ఆయుసుకు ఉయ్యాలో చవితి పండుగ జేస్తి ఉయ్యాలో కడుపు సలువ కొరకు ఉయ్యాలో ఉసిరి చెట...