సరస్వతీ వ్రతకథ
సూతమహాముని శౌనకాది మహామనులను చూచి యిట్లనియె, ఓ మహర్షులారా! మీకొక ఉత్తమమైన వ్రతరాజమును వినిపించేdaను వినుడు అని చెప్పసాగెను. ఆశ్వీయుజ శుక్ల పక్ష పాడ్యమి మొదలుకొని తోమ్మిదిరాత్రులు దుర్గా, లక్ష్మి, సరస్వతిలను పూజించావలేయును. లేదా మూలా నక్షత్రము మొదలుకొని పూజా చేయవలెయును. అనిన ఋషివర్యులు సూతమహామునితో ఓ మహాత్మా! పూర్వము ఈ వ్రతమును ఎవరైనా ఆచరిన్చినార? అలా ఆచరించిన వారికి ఎలాంటి ఫలితము కలిగినది? అని అడుగగా ఓ మునులారా! కృతయుగంబునందు మహా ధర్మాదికుండు, ప్రజాపాలన సమర్దుండు సుకేతువు అనే రాజు గలదు. అతనికి సౌందర్య, గాంభీర్య, యౌవన సంపన్నురాలగు సువేది అను భార్య గలదు. ఇట్లుండగా రాజునకు, అతని జ్ఞాతులకు విరోధము సంభవించి యుద్ద సంనద్దుడై కదన రంగమునకు పోయి భీకరముగా యుద్దము చేయుచుండెను. ఆ యుద్దమునండు సుకేతుడు శత్రువుల దాడికి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచున్న...