Posts

Showing posts from May, 2020

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్

       చాల రొజుల తర్వాత, ఏదైన ఒక మంచి పుస్తకం చదవాలని నారాయణగూడలో జరుగుతున్న విశాలాంధ్ర బూక్ ఫేర్ కి అదే పనిగా వెళ్ళాను. పుస్తకాలు వెతకడం మొదలెట్టగానే , నా కళ్ళు 'దర్గామిట్ట కథలు ' పుస్తకాన్ని చూసి మెరిసాయీ . ఎప్పట్నుంచో ఆ పుస్తకం చదవమని మా వాడు ప్రత్యీకంగా చెబుతున్నాడు. ఖరీదు చూశాను. 60 రూపాయలు అని ఉంది. అటు,ఇటు తిరగేసి ఒక పుస్తకాన్ని కొన్నాను, దాంతొ బాటె ఇల్లేరమ్మ కథలు వగైర కూడా కొని అర్జెంట్ గా ఇంటికి వచ్హి కాళ్ళైనా కడుక్కోకుండానే మంచం మీద అడ్డంగా పడి చదవటం మొదలెట్టాను.     మొదట్లొనే ఈ కథలన్నీ మా నాయనకి అంటునే మనసులోనించి రాయటం మొదలెట్టాడు ఖదీర్ బాబు. మా నాయన మూట కట్టుకున్నది ఆస్తిని కాదు, స్నేహితులని అని అయన రాసిన మాటలు మా నాయన కి కూడ అక్షరాల వర్తిస్తాయి. అందుకే నాకు బాగా మనసుని తాకిందామాట. నాయినలు కేవలం ఆస్తులే కూర్చడం పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లోకూడా, మా నాయన సంపాదించిన తరగని అస్తిని ఎంతో అపురూపంగా భావిస్తాను నేను., దీంట్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితదర్పణం.మనసు పంచుకున్నాడు ఖదీర్ బాబు స్పటిక మంత స్వచమైన భావంతో,భాషతో ఒక్కటేంటి, ప్ర...