Posts

Showing posts from August, 2010

సుమతి శతకం- నాన్నగారు.

Image
 ప్రొద్దుటే ఎందుకో నాన్నగారు జ్ఞాపం వచ్చారు.  భోజనాలు అవగానే అయన వెనకే వరండా లో అటు, ఇటు తిరుగుతూ,  ఆయన చెప్తున్న  సుమతీ శతకం లోని పద్యాల్ని వల్లిస్తూ నిద్ర రాగానే వెళ్లి  పడుకోడం ఇంక తడి ఆరని మధుర జ్ఞాపకం. ఈ కాలంలో పిల్లకి కూడా  కేవలం టీవీ  కాకుండా  ఇలాంటి మధురమైన జ్ఞాపకాల్ని పంచగలమా/   పద్యం:     అక్కరకురాని  చుట్టము , మ్రొక్కిన  వరమీనివేల్పు , మొహరమున  దా  నెక్కిన  బారని    గుఱ్ఱము , గ్రక్కున  విడువంగవలయు   గదరా  సుమతీ //   తన  కోపమే  తన  శత్రువు    తన   శాంతమే   తనకు  రక్ష , దయ  చుట్టంబౌ  తన  సంతోషమే  స్వర్గము  తన  దుక్ఖమే  నరకమండ్రు , తధ్యము  సుమతీ // తలనుండు   విషము  ఫణికిని  వెలయంగా  తోకనుండు  వృశ్చికమునకున్           తల  తోక  యనకనుండును  ఖలునకు  నిలువెల్ల  విషముగదరా  సుమతీ // కనకప...