Posts

Showing posts with the label నా స్వ్యీయ కవితలు

ఎవరికీ ఎవ రున్నారయ్యా వెర్రి బాపనయ్యా..ఆ.ఆ.ఆ.......ఆ.ఆ.ఆ.

       ఇంట్లో  పని చేసుకుంటూ మా అమ్మ ఎప్పుడు ఎవరికీ ఎవ రున్నారయ్యా వెర్రి     బాపనయ్యా..ఆ.ఆ.ఆ.......ఆ.ఆ.ఆ. అంటూ పాడుకుంటూ ఉండేది.         ఆ వయసులో ఆ పాటలోని భావానికి అర్ధం తెలిసేది కాదు. ఒక్కొక్క సారి అయితే అబ్బ ఆపమ్మా, ఆ పాట ఏంటి, వేరే ఏమైనా పాడవచ్చు కదా అంటూ అడిగి వేరే పాటలు ఆవిడతో పాడించుకునే దాన్ని. ఆవిడ గొల్లకలాపం బాగా పాడేవారు.          నాకు యాభైయ్యేళ్ళుదాటాక కానీ మా అమ్మ పాడిన  పాటకి అర్ధం అనుభవంలోకి రాలేదు.         నాకు తెలిసి నా కుటుంబం గురించి కొద్ది, కొద్ది గా జ్ఞాపకాలు నాకు  నాలుగేళ్ళప్పుడు హోలీ పండగకి రంగులు చల్లుకున్నాక   స్నానాలు  కానిచ్చి మెడలో  పంచదార చిలకల దండలు వేసి అందరిని నిలబెట్టి తీయించిన ఫోటి బహుశ నాకు కొద్దిగా జ్ఞాపకం లీలగా మెదులుతున్నట్టుంటుంది. అప్పటికి మా ఇంట్లో బుచప్ప ,యాదగిరి నాన్నగారి దగ్గర వైద్యం నేర్చుకోడానికి వచ్చి ఇంట్లోనే ఉండేవారు.        ఆ తర...

స్వేఛ్ఛా జీవి

ఆకాశం లో యెగిరే           విహంగాన్ని నేను దేన్ని యెవరాపదలచినా నా పయనం ఆగదు. పారిపోతున్న సూరీణ్ణి వెంటాడే రాత్రినీ బంధించలేనినాడు గుండెగడియారపు చప్పుళ్ళు ఆగిపోయినా గోడ గడియారపు బాహువులు కాలాన్ని బంధిస్తాయి అప్పుడూ నేను ఎగురుతూనే ఉంటాను సూర్యునికి దగ్గరగా- వేడిలో చంద్రునికి దగ్గరగా- శిశిరపు వొడిలో గలగల పారే సెలయేటిని ఆనకట్టలు ఆపినా అంతెత్తునుంచి దుమికే జలపాతపు నాలుకల్ని గ్రీష్మం మింగేసినా పాత బానిసత్వాలు రాలిపోయి క్రొత్త నిరాశా నిస్పృహలు చేరువైనా నిరంతరం ఎగురుతూనే ఉంటాన్నేను దేనికీ క్రుంగిపోవద్దనీ దేనికిలొంగిపోవద్దనీ సందేశపు ఝండా పట్టుకుని చైతన్యాన్ని బోధిస్తూ స్వేఛ్ఛగా రెప రెప లాడుతుంటాన్నెను.