Posts

Showing posts from July, 2015

చిన్న పిల్లలకి హారతి

                                        మా చిన్న తనం లో చిన్న పిల్లకి పుట్టిన రోజు వచ్చిందీ అంటే , పెంద్రాళే                                           నిద్ర లేపి , తలంటి పోసి , కొత్త బట్టలు వేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోమనే   వాళ్లు. ఆ తర్వాత వీలుని బట్టి గుడికి తీసెకెళ్లె వాళ్లు సాయంత్రం కాగానే ఇరుగు, పొరుగు వాళ్లని పేరంటానికి పిలిచి ,పుట్టిన రోజు పెళ్లికొడుకు/పిల్ల లకి పీట వేసి, కూచొబెట్టి ,మంగళ హారతి ఇచ్చి, వచ్చిన పేరంటాళ్ళు దీవించి  చక్కగా మంగళ హారతులు పాడి దీర్ఘాయువు ,సకల సంపదలు కలిగి, సద్గుణాలతో వర్ధిల్లాలని దీవించే వాళ్లు తదనంతరం ఆ పైన వసంతం నీళ్లతో దిష్టి తీసే వాళ్లు. వచ్చిన వాళ్లకి పండు, తాబూలము ఇచ్చి సాదరం గా సాగనంపెవాళ్లు   మచ్చు కి ఒక పాట ఇదిగో పల్లవి ::కర్పూరా హారతిదే ,కమలజదళ నయన నీకు సుందర సుకుమార గాత్ర  నందక...

ఉగ్గుపాట

 ఉగ్గు పెట్టా పిలువా  నేలా , ఎంతటీ కన్నూలా వాడ్ని జగదేకా శ్రీరామా చంద్రా లేవయ్యా  ఉగ్గూ పెట్టేను నిగ నిగా నవ రత్నా నీలా వర్ణపూ చాయా తళ తళ మనీ యేటీ ధాతూ మెరయగానూ // ఉగ్గు పెట్టా పిలువా  నేలా// సండిటి దండలూ జవులూ భుజ కీర్తులు కరమూనా ఉన్నట్టీ శంకూ చక్రమూలూ పాలూ నెయ్యీ తెచ్చీ పాయసాన్నమూ చేసెను  పైడీ గిన్నే లోనా ఆరాగించాగా రారా   // ఉగ్గు పెట్టా పిలువా  నేలా// రామా రామా యన్నా ప్రేమా తీరదూ నాకూ ముఖ మెత్తీ ముద్దీరా మోహానా కారా మణులూ రావీ రేఖా , మద్దికాయలా జూకా మకరా కుండలమూలు ,మణికిరీటము తో / /ఉగ్గు పెట్టా పిలువా  నేలా//