అన్న మా చార్య కీర్తన అబ్బురంపు శిశువు ఆకుమీది శిశువు దొబ్బుడు రోల శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి పుట్టు శంఖు చక్రముల( బుట్టినయా శిశువు పుట్టక తోల్లే మారుపుట్టువైన శిశువు వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు తొట్టెలలోన శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి నిండిన బండి తన్నిన చిన్ని శిశువు అండవారి మదమెల్ల నణచిన శిశువు కొండలంతేశసురుల( గొట్టిన యా శిశువు దుండగంపు శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రువ్వి వే(గైన వేంకటగిరి వెలసిన శిశువు కౌగిటి యిందిర దొలగని శిశువు ఆగి పాలజలధిలో నందమైన పెను(బాము తూగుమంచము శిశువు త్ప్రువ్వి త్ప్రువ్వి త్ప్రు
Posts
మంగళ హరతి పాట
- Get link
- X
- Other Apps
మంగళ హరతి పాట పల్లవి: మంగాళ హరతీ.. మాధవ నీ కిదె.. మంగాళ హరతీ .. చరణం 1: ముదమూతొ యశొద ముద్దుల క్రిష్నా . . ముత్యాల హారతి.. ఇచ్చేద నీకిదె.. రారా గైకొర ధీర నీకిదె ... .....మంగళ హరతి చరణం 2: కాళింది మర్దనాకంసుం సంహరణా. . ద్రౌపది రక్షకా .. దయచేయు వేగమె.. రారా గైకొర ధీర నీకిదె .. ..మంగళ హరతీ. చరనం 3 : రాధా రమణా .రంజిత గుణాకరా... రమణులొసంగిన.. రత్నాల హరతీ.. ఇచ్చెద నీకిదే ...రారా గైకొర ధీర నీకిదే... ..మంగళ హరతీ. మంగాళ హరతీ.. మాధవ నీ కిదె.. మంగాళ హరతీ
మూడు దశాబ్దాల జీవనతరంగాలు
- Get link
- X
- Other Apps
చిన్నప్పటి నుంచి అడపా దడపా జరిగిన సంఘటనలు, నా ప్రతిస్పందనలు ఈ బ్లాగు లో వ్రాస్తూనె సాధ్యమైనంత వరకు కొందరికైనా గుర్తుకొచ్చేలాగా దీన్ని రూపు దిద్దాలని నా ప్రయత్నం . నిజంచెప్పాలంటేఆఫీసుకివెళ్తేమాతోబాటుచేరినచాలామంది సహోద్యోగులు పదవీ విరమణ చేసిఉండడం వలన , కొత్తగా రకరకాల విధానాల్లో నియామకాలు చేపట్టటం వల్లా కొంతవరకు మా సమయం లో చేరిన వాళ్ళుఎవరూ ప్రతిరొజూ కలవ లేక పోవటం వల్లా మేము కొంత వరకూ ఒంటరిగా,పని వత్తిడి తో ఫీల్ ఔతున్నా మన్నది నిజం . ఈ బ్లాగ్ ద్వారా అలాంటి వాళ్ళనందరినికలవడం,మాట్లాడ్డం, మంచి,మాటా కలబోసుకోడం కూడా ఒక ఉద్దేశ్యం. మరియు ప్రయత్నం . ఈ బ్లాగు ద్వారా అందరికి సంబంధించిన ఏ సంగతులు అయినా పంచుకో వచ్చు ఉద్యోగం లో చేరడం అనేది నెనెప్పుడూ ఆలోచించలేదు.అసలు విశ్లేషించుకుంటే నన్ను నేనుఏవిషయం లో కూడా ఒక గోలు పెట్టుకుని ,ఏదో కష్ట పడి దాన్ని సాధ...
ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్
- Get link
- X
- Other Apps
చాల రొజుల తర్వాత, ఏదైన ఒక మంచి పుస్తకం చదవాలని నారాయణగూడలో జరుగుతున్న విశాలాంధ్ర బూక్ ఫేర్ కి అదే పనిగా వెళ్ళాను. పుస్తకాలు వెతకడం మొదలెట్టగానే , నా కళ్ళు 'దర్గామిట్ట కథలు ' పుస్తకాన్ని చూసి మెరిసాయీ . ఎప్పట్నుంచో ఆ పుస్తకం చదవమని మా వాడు ప్రత్యీకంగా చెబుతున్నాడు. ఖరీదు చూశాను. 60 రూపాయలు అని ఉంది. అటు,ఇటు తిరగేసి ఒక పుస్తకాన్ని కొన్నాను, దాంతొ బాటె ఇల్లేరమ్మ కథలు వగైర కూడా కొని అర్జెంట్ గా ఇంటికి వచ్హి కాళ్ళైనా కడుక్కోకుండానే మంచం మీద అడ్డంగా పడి చదవటం మొదలెట్టాను. మొదట్లొనే ఈ కథలన్నీ మా నాయనకి అంటునే మనసులోనించి రాయటం మొదలెట్టాడు ఖదీర్ బాబు. మా నాయన మూట కట్టుకున్నది ఆస్తిని కాదు, స్నేహితులని అని అయన రాసిన మాటలు మా నాయన కి కూడ అక్షరాల వర్తిస్తాయి. అందుకే నాకు బాగా మనసుని తాకిందామాట. నాయినలు కేవలం ఆస్తులే కూర్చడం పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లోకూడా, మా నాయన సంపాదించిన తరగని అస్తిని ఎంతో అపురూపంగా భావిస్తాను నేను., దీంట్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితదర్పణం.మనసు పంచుకున్నాడు ఖదీర్ బాబు స్పటిక మంత స్వచమైన భావంతో,భాషతో ఒక్కటేంటి, ప్ర...