Posts

Showing posts with the label dandaalu dandaalu bharatamaataa

నారాయణ నారాయణ అల్లా ఆ అల్లా

నారాయణ నారాయణ నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా                        || నారాయణ || మతమన్నది నాకంటికి మసకైతే మతమన్నది నా మనసుకు మబ్బైతే మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ || ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే మతం వద్దు గతం వద్దు మారణ హొమం వద్దు                                            || నారాయణ|| మతమన్నది గాంధీజీ హితమైతే మతమన్నది లోకానికి హితమైతే హిందువులం ముస్లిములం అందరము మానవులం, అందరమూ సోదరులం                                   || నారాయణ || ---దేవులపల్లి కృష్ణశాస్త్రి