Thursday, January 28, 2010

జోల పాట

.

జో అచ్యుతానంద జో జో ముకుందా
రారా పరమానంద రామ గోవిందా //జో/./

తొలుత బ్రహ్మాండంబు తొట్టె గావించీ
నాలుగూ వేదాల గొలుసులమరించీ
బలువైన ఫణి రాజు పానుపమరించీ
హృదయ డోలిక లోన చేర్చి లాలించీ //జో//


సాధారణం గా ఈ రోజుల్లో ఎవరూ జోల పాడట్లేదు
ఒకసారి దాని తాదాత్మ్యత అర్ధం అయితే ఇంకో చరణం కావాలని అడిగిన వాళ్లకి కంటిన్యూ చేస్తాను.

ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా
అద్దాలలో నేడు బిడ్డలైనారా
ఏ జన్మ మున ఏమి నోము నోచితినో
ఈ జన్మలో నాకు బిడ్డలైనారా


ఒంకారామనిఎటి ఉయ్యాల లొనూ
తత్వమసి మనియేటి చలవటు పరచి
నేర్పుతో పాపడ్నిఉయాలలో చెర్చీ
ఏడు భువనముల వా రేకమై పాడా
నిండుగా దీవించి రెల్ల లోకాలా

తొమ్మిదీ వాకిళ్ళు దొడ్డిలోపలను
ముర్ఖులారుగురూను సాధులైనారూ
అంతలోముగ్గురు ముర్తులున్నారూ
తెలివి తెలిపేటివాడు దెవుడున్నాదూ

పట్టవలె ఆర్గురిని పదిలమ్ము గానూ
కట్టవలె ముగ్గురిని కదలకుణ్దానూ
ఉంచవలె నొక్కనీ హ్రుత్కమలమన్దూ
చూదవలె వెన్నెలల భావ మన్దునననూ

జంట గూడిన వాని జాడ గనవలెనూ
యింట బ్రహ్మానంద ముంటుoడ వలెనూ








.






No comments: