పుట్టపర్తి సత్యసాయి బాబా---ఏ సేవ సేయగ
కొన్నేళ్ళ క్రితం సంక్రాంతి సందర్భం గా కాస్త ప్రశాంతత కావాలనిపించి, ఒక పది రోజుల పాటు ప్రశాంత నిలయానికి వెళ్ళాను. నాకు ఒక పధ్ధతి లో పూజలు చేయడం కాని, ఉపవాసాలు చేయడం కానీ రాదు. ఒంటరిగా కళ్ళు మూసుకుని ప్రార్ధించడం తప్ప. భయమేసినప్పుడు, మొండిగా నాతొ రమ్మని .మారాము చేస్తాను, నాకు ఇంతవరకు , కష్టమనిపించి, మనసారా వేడుకుంటే దేవుడు సహాయమే చేసాడు. మాములుగా ఒక మంచి సినిమా చూస్తేనే స్నేహితులతోటి, ఇంట్లో వాళ్ళతోటి మరి,మరి చర్చించు కుంటామే , అలాంటిది, ఈ సృష్టి కి మూలమైన ,సమాజాన్ని,తను ఉన్నానన్న ఒకే ఒక్క భావన తో అదుపులో ఉంచుతున్న (నమ్మకం ఉన్నవాళ్ళకి) ఆ దేవుడు, మనకి ఏ భావన కలిగించినా పంచుకోవడం లో అభ్యంతరం లేదనిపించింది. భక్తు లందరితో బాటే నేను కూడా సాయిబాబా దర్శనం కోసం హాలు లో కూర్చున్నాను. అర గంట అయినాక స్వామి మెల్లిగా హాలు లోకి రావటం . అందరితో బాటే నేను కూడా స్వామి ఆశీర్వాదం కోసం ఆత్ర్తగా చూస్తున్నాను. రెండు క్షణాలు ఐతే స్వామి నా తల మిద చేయి పెట్టి ఆశిర్వదిన్చేవారే,...