(1) ఆహాహా మన దేశమునందు జీవ చరిత్రములు లేని లోపమిప్పుడు కనబడుచున్నది.చరిత్ర రచనమునందు మన పూర్వికులకు శ్రద్ధయెంతమాత్రమూ లేకపోవుటచే నొక్క మహా పురుషుని చరిత్రమైన జదివెడు భాగ్యము మనకబ్బినది కాదు. రాజరాజనరేంద్ర ప్రముఖులగు మహారాజుల యొక్కయూ,నన్నయ భట్టారక తిక్కన్న సోమయాజి ప్రముఖ మహాకవులయొక్క చరిత్రములు చేకూరనందున మనమంత విచారించవలసిన పని లేదు. కానీ గణపతియొక్క చరిత్రను సంపూర్ణముగ లభింపనందుకు మనము కడుంగడు విచారింపవలయును. ఆ విచారములోనే గుడ్డిలో మెల్ల యన్నట్ట్లు కొంత చరిత్రము మనకసంపూర్థిగానైన లభించినందుకు సంతోషించవలయును. సంగ్రహముగ నైన నీ చరిత్రము నా కెట్లు లభించినదో చెప్పెద వినుండు ఒక నాడు నేనొక మిత్రునింటికి విందారగింప బోతిని. ఆ మిత్రుని ఇంట వివాహము జరుగుచుండెను. ఆ విందు నిమిత్తము మిత్రులు అనేకులు వచ్చియుండిరి. ఇప్పటివలెచీట్లుపంపిభోజనమునకుపిలిచెడుఆచారమప్పుడులేదు. పెందలకడనేభోజనముబెట్టునాచార మంతకంటే లేదు. విస్తళ్ళు వేయునప్పడికి రెండు ఝాముల రాత్రయ్యెను. వడ్డించునప్పటికి మరి రెండు ఝాముల రాత్రయ్యెను. వడ్డించునప్పటికి మరి నాలుగు గడియలు పొద్దు పోయెను. .భొజనము చేసి లేచునప్పటికి కొక్కొరోకో యని ...