Posts

Showing posts from January, 2012

కృష్ణ శాస్త్రి - ఒక మధుర జ్ఞాపకం

దరిద్ర నారాయణ లోకేశా, దయాపరాయణ ప్రాణేశా  ! నిరంతరాశ్రయ మీవే కావా , నిరామయామృత మీవే కావా ! విశీర్ణ వసనధరా లోకేశా  వికీర్ణతిమిర హరా ప్రాణేశా ! ప్రశాంత జీవిక వీవేకావా ,నిశాంతదీపిక వీవేకావా! పరాగభరి తాంగాలోకేశా, విరాగ పద సంగా ప్రాణేశా! పురాణ మిత్రమ మీవేకావా  నిరంజనాత్మవు నీవేకావా!   విశాల నవభారతలోకేశా విశేష దీనాశ్రిత  ప్రాణేశా! అశేష భాగ్యమవీవేకావా అనంత శక్తివి నీవేకావా!