ఏడూ కొండలా సామీ ఎందూకు న్నావయ్యా
ఈ మధ్యన పండగో పబ్బమో , లేదా మనసు పుట్టి స్వామి దర్శనం చెసుకుo దా మనో అనుకునే సామన్య భక్తుల సంఖ్య క్రమెపీ పడిపోయే పరిణామాలు మనం చూస్తూనే న్నాం. చాల రోజుల క్రితం ఒక సారి శ్రీరామ నవమి కి అనుకుంటా వెంకటే శ్వర స్వామి దర్శనం చేసుకుందామని తిరుమలకి వెళ్ళాం. ప్రత్యెక దర్శనం కోసం నిర్దేశించిన మొత్తాన్నీ చెల్లించి రశీదు పుచ్చుకుని ఆలయ అధికార్లు నిర్దేశించిన వరుస లో వెళ్లి నిలుచున్నాం . వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు దర్శనం గంట లోగానే అవ్వాలి . కొద్ది సెపైతె మేము అస్సలు మండపం లోకి అడుగు పెడతామని అనుకున్తునామో లేదో , క్షణం లోగా నే మమ్మల్ని ఆపేసి, ఆవలకి నెట్టేసి, v.i.p దర్శనం అని చెబుతూ దాదాపు వంద, రెండు వందల మందిని గుళ్ళోకి పంపించారు వాళ్ళ వెనుకే మాకు కొద్ది జాగా దొరికి మేము కూడా లోపలి ప్రవేశించాం . వచ్చిన వాళ్ళలో ఒకావిడ నాకు కాస్త ముఖ పరిచయం . అదే చనువు తో ఎంత టికెట్ తీసుకున్నారు అని అడిగితె, అందు కావిడ అదేమీ లేదు, అక్కడ వాళ్ళ బంధువు ఒకాయన పని చేస్తున్నాడు . ఆ యనే తీసుకోచాడు, ఇప్పుడే వస్తున్నాం అని చెప్పిo ది డబ్బులు కట్టి, ఉదయం నించీ q లో అలిసిపోయిన మాకు చాల బ...