Tuesday, January 26, 2010

పార్కులోపల పని లేని బాలు డొకడు

పార్కులోపల పని లేని బాలు డొకడు
తిరుగుచుండెను రాగాలు తీసికొనుచు
కలదు ఒక చేతిలో వాని వద్ద రొట్టె ముక్క
కలదు మరియొక కరమున కర్రముక్క

వెర్రి వేషాలు వెయుచూ కుర్రవాడు
అటుగా దారిలో నుండి పోయెడికుక్కను
రొట్టె చూపించి ఆశగా పిలిచినాడు.

రొట్టేముక్కను చూసిన కుక్క తానూ
ఆశ గా తోకను ఊపుకొనుచు
కుర్రవానిచుట్టు తిరుగాసాగే

కొంటె చేష్టలు మాలిన ఆ పిల్లవాడు
రొట్టె ఆశను చూపి ఆ కుక్క
నెత్తిపై కర్రతో మొట్టినాడు

కుయ్ కుయ్ మనుచు ఆ కుక్క వెడలి
నంతలోనె వెనుదిరిగి చుచునంత
పిక్క బలముగా బట్టి ఆ కుక్క కరచే

ఇది సుమారు యాభై ఐదు ఏళ్ళ క్రితం పిల్లలకి పాఠం గా ఉండేది.
అక్కడక్క మర్చి పాయి సొంతం గా పదాలు చేర్చి వ్రాసాను ఇలాంటి పాఠాలు
ఇప్పుడు ఎక్కడా కనిపించవు

No comments: