Posts

Showing posts from April, 2010

స్వర్గం-నరకం

                         వామ్మో నేను జచ్చిపోత. సడన్గా బ్రేకు వేసిన ఉపుకి ఒక్కసారిగా                   నిద్రలోంచి లేచిన మా మిత్రుడు అన్న మాటలవి.అంతలో మా మరో మిత్రుడుఅందుకుని  నేను జచ్చిపోతే నరకంకే బోతా. నాకు స్వర్గం ఒద్దెఒద్దు. అన్నాడు.            ఎందుకట్ల   , అందరు  స్వర్గంకావాలి అంటారుకదా అన్నాన్నేను.         దానికి తనుకాదు మేడం, మనోల్లందరూ నరకం  లనే ఉంటరు. రంభ, ఊర్వశి అందరుఎప్పుడోముసలోళ్ళు అయిపోయిన్రు.        నరకంల ఐతే అందరు సినిమా యాక్టర్లుటి .వి వాళ్ళు, మస్తుల ఉంటారు. ఇంకబాధలన్టారా. అవ్విఇక్కడున్న ఉంటై,అక్కడున్న ఉంటై. అదే స్వర్గం అయితే కాలిగుంటది. పొద్దు బోదు అన్నాడు.         నాకు అతని మాటలకి కడుపుబ్బానవ్వు ...

ఏమంటారు ?

        మొన్న ఒక రోజు నేను కొంతమంది మిత్రులతో కలిసికారులో వెడుతుండగా మా మధ్యన ఒక విషయం గురించి చర్చ వచ్చింది           ప్రేమలు,   చావులు. ఆ రోజే లైఫ్ స్టైలే భవనం మీదనిన్చి దుంకి చనిపోయిన జంట గురించి మాట్లాడుకుంటుండగా మా లో ఉన్న ఒకమిత్రుడు పిల్లకి కౌన్సిల్లింగ్ ఇవ్వవలసిన అవసరం గురించి మాట్లాడాడు.       మరో మిత్రుడు తనదైన భాషలో చెంపకు బెట్టినాలుగుచాప్పరిజ్ఞ్చి చెవులు ముఉస్తే ఇదంతా ఉండనే ఉండదు .       మనమే పిల్లల్ల్ని నాజూక్  జేస్తున్నాం మనల్ని మన పెద్దోళ్ళు ఏంకౌన్సిల్ జేసినరు, మనమంతా అట్లనే జచ్చినమా అన్నాడు.       నాకెందుకో .నిజంగానే మనం పిల్లల్ల్ని అతి నాజూకు చెస్తూ, భయపదుతూమన సంపాదన అంతా వాళ్ళ చదువులకి వెక్చిస్తూ , మనదంటూ ఎమీ లేకుండ,అంతా వాళ్ళే అన్న భావన పెన్చుకున్తూ, వాళ్లని మనమే అల తయారుచేస్తున్నామేమో అనిపించింది .              పిల్లలకి మంచి, చెడు అవ...

My first speech......at my school...never forget...............

చాలా రోజుల క్రితం ఉద్యోగ రీత్యా నన్ను ఒక  వర్క్ షాప్ కి ఆహ్వానించారు. .  అక్కడ నేనే ముఖ్యఅతిధిని. నేనే మాట్లాడవలసి ఉంది. అన్దరూ నేనేమి మాట్లాదతానా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వేదిక  మీది కంటే నేను విడిగానే అందరితో కలివిడిగా కలిసిపోతాను. కొద్దిగా స్నేహ స్వభావం కూడా          నేను మాట్లాడాలి.  అప్పుడు సందర్భం కాకపోయినా ఒక్క క్షణం నా మనసు నా ఆరో తరగతి లో జరిగినా ఒక సంఘటనని జ్ఞాపకం చేసుకుంది.         ఆ రోజు మా స్కూల్ లో ఉపన్యాస పొటీజరుగుతోంది. మా క్లాసు టీచరు నన్ను తప్పనిసరిగా ఆ పొటీ లో పాల్గొనాలని ఆర్డరు వేసారు. బహుశ ప్రతీ సారీ నేను దాన్లో పాల్గొనడానికి ఎగ్గొట్టడం ఆయన గమనించి ఉంటారు. నాలో ఉన్న బెరుకు పోయి నేను కొంతైనా పబ్లిక్ లో మాటాడ్డం తెలుసుకుంటానని కావచ్చు         అప్పట్లో నేనెంతో నాకే తెలియుడు. నాకెలాంటి ఆశయాలు కానీ, క్రియేటివిటీ కానీ, ఉత్సాహం  గా  దెనికీ   ముందుకి   వెళ్ళడం కానీ లేవు.      ...i ...

ఒంటరి తనం .

              చిన్నప్పుడు బడికి వెళ్ళేప్పుడు చదువు, ఆటలు, హోమ్ వర్కు  దీనితొ బాటే నన్ను అస్తమానమూ ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని ఆదేశించే తోబుట్టువులు, వెరసి నాకెప్పుడు ఒంటరి తనం తెలీలెదు. అల్లా  ఆనే కంటే ఒంటరితనం అంటే ఏంటో తెలియదంటే కర్రేక్టేమో             కాస్త పెద్ద అయినాక పెద్ద క్లాసు, పెద్ద చదువు, బయటకేల్తే పెద్దవాళ్ళు చెప్పినట్లే తల వంచుకుని నా పనేదో నేను చేసుకుని రావడమే తప్ప ఎక్కువ, తక్కువ స్నేహాల్లేవు. అయినా ఒంటరి తనం అంటే ఏంటో అప్పట్లో నాకు తెలిదు  .           కాలేజి రోజులకి వచ్చాక మెల్లి, మెల్లిగా వాస్తవానికి దగ్గరగా జీవన ప్రయాణం మొదలయింది. . దాన్ని కాలేజి చదివించారు, నన్ను లేవెంత్ తోటే ఆపేశారు.  నిష్కల్మశమైన రక్తసంభందాల మధ్యన చిన్న వెలితి తో ఒంటరితనమంటే ఏంటో అర్ధమవ  సాగింద           ఎలేవెంత్,కి,ఇంటర్ కి కాలేజి అన్న ఒకే ఒక నేమ్ చేన్జి...

సాగే జీవన రాగం

చాలా రోజులతర్వాత నాబ్లాగు లో ఏదైనా రాద్దామని కూర్చున్నాను. ఎండలు మండి  పోతున్నై అంటే   అందరు నవ్వుతారు. ఇదెమీ చెప్పాల్సిన విషయం కాదె అనుకుంటారు కూడా          కర్ఫ్యూ  వల్ల జనాలు ఎంత బాధ పడుతున్నారో అంటే కర్ఫ్యూ పెట్టడమే (సామాన్యజనాన్ని)    బాధ పెట్టడానికే కదా దాన్లో ప్రత్యేకించి అనుకోడానికి ఏముంది అంటారేమో  కానీ నేనేదైనా చెప్పాలి.        అన్నట్టు గర్భిణీ స్త్రీలని కానుపుకు కూడా అనుమతి ఇవ్వనంత తప్పు వాళ్ళేమి చేసారో, ఈ మగాళ్ళకి నొప్పులోచ్చి ఆ నొప్పలతో  ఒక్కడంటే ఒక్కడు బాధ పడ్డా కర్ఫ్యూకాదు దానమ్మ ఉన్నాఆ ఆడమనిషిని ఆసుపత్రిలో జేర్చడానికి అ పోలిసోల్లె సహాయమందించే    వాల్లేమో  .          మళ్ళి సాయపడ్డ వాళల్లోకూడా మీడియా పొటీ . మాచానేల్ గొప్ప చూసారా, ప్రసవ వేదన పడుతుంటే ముందుండి  హాస్పిటల్ కి పంపించాం . మేమెంత ముందున్నామో  చూసారా ? తాము చేసామని   చెప్పుకున్టూనె  , అవతల వాళ్ళు ఏం చేయలేదో, తామెంత గొప్పో హయిగ...

ఈరోజు టీవీ లో వార్తలలో చెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.

kalividi@googlegroups.com              ఒకటికి ఆరు రెట్లు ఇస్తామనిఇరవైఏడు కోట్లు రూపాయలు వసులు చేసి ఆ సొమ్ముని షేర్లలో పెట్టి, నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న తల్లి, తండ్రులు, విస్తుపోయి, మైండుపాడైపోయి  వెర్రి చూపులు చూస్తున్నా వారి కొడుకు,  ఈరోజు టీవీ లో వార్తలలోచెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.      కన్న పిల్లల్ని కస్టపడి ఎదగమని , శ్రమయే ఎదగటానికి   సూత్రమనీ చెప్పి, నిజాయితీ తో  పిల్లలని పెంచటం మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన నీతి.       మరి ఆ పెద్దలే అత్యాసః కి పోయి ఇలా చేయడం భావ్యమేనా?  ఒకసారి వళ్ళు జలదరించింది.        పొద్దున్న అనగా పోయి పోద్దుత్నించి సాయంత్రం దాకా జివిక  నడవడానికి   బతుకుతెరువు కోసం బ్రతికే వాళ్ళమే ఎక్కువ. ఇలాంటి  అత్యాషలు తలకి ఎక్కకుండా ముందు మన పిల్లలకి ఒక్కొక్క మెట్టూ  ఎక్కడం  లో ఉన్న మానసిక ప్రశాంతతని  తెలియజేయాలి. . వాళ్ళు దారి తప్పి , అత్యాశకి పోయి తప్పు చేస...