Friday, February 26, 2010

ఎగురవే ఝెండా


ఎగుఎగురవే ఎగురవే ఎగురవే ఝెండా
ఎగురవే ముచ్చటగ మువ్వన్నె ఝెండా
ఎరుపు నీలో నిలిచి కలిమి మాలో నిలిపె
కలిమి బలిమి తోటి కలిసిమెలిసుంటాము //ఎగురవే //

తెలుపు నీలో నిలిచి శాంతి మాకందించె
శాంతి కాముకులమై శాంతి నిలిపేము
శాంతితో కాంతి తో దివ్వెలై వెలిగేము//యెగురవే//

హరిత వర్ణము నీదు ఆత్మ విలసిల్ల
సస్య శ్యామలమైన నవజగతి మీదిగా
జగమెల్ల హరితమై జనమెల్ల నవత
నవ ప్రభంజనమై నవ మహోదయ మీయ /యెగురవే//

ధర్మ చక్రము నీదు హ్రదయమై ఒప్పార
జనత జాగ్రతి తోడ జగమంత విప్పార
ఎరుపు తో పసుపు తో హరితశ్యామలము తో
ఢర్మచక్రము దాల్చి ధరణి నెలగ ఎపుడు /యెగురవే//
( యీ పాట రచన సుసర్ల జయభారతి.)
 

No comments: