Friday, February 26, 2010

స్వేఛ్ఛా జీవి

ఆకాశం లో యెగిరే       
 
విహంగాన్ని నేను
దేన్ని యెవరాపదలచినా
నా పయనం ఆగదు.

పారిపోతున్న సూరీణ్ణి
వెంటాడే రాత్రినీ
బంధించలేనినాడు

గుండెగడియారపు చప్పుళ్ళు
ఆగిపోయినా
గోడ గడియారపు బాహువులు
కాలాన్ని బంధిస్తాయి

అప్పుడూ నేను ఎగురుతూనే ఉంటాను
సూర్యునికి దగ్గరగా- వేడిలో
చంద్రునికి దగ్గరగా- శిశిరపు వొడిలో

గలగల పారే సెలయేటిని
ఆనకట్టలు ఆపినా
అంతెత్తునుంచి దుమికే
జలపాతపు నాలుకల్ని
గ్రీష్మం మింగేసినా

పాత బానిసత్వాలు రాలిపోయి
క్రొత్త నిరాశా నిస్పృహలు చేరువైనా
నిరంతరం ఎగురుతూనే ఉంటాన్నేను

దేనికీ క్రుంగిపోవద్దనీ
దేనికిలొంగిపోవద్దనీ

సందేశపు ఝండా పట్టుకుని
చైతన్యాన్ని బోధిస్తూ
స్వేఛ్ఛగా రెప రెప లాడుతుంటాన్నెను.

No comments: