Posts

శివ తాండవం

  శివుడూ తాండవమూ చేయూనమ్మా కైలాసగిరిలో శివుడూ తాండవమూ చేయూనమ్మా. శివుడుతాండవము చేయుచునిత్యము అభిదళముగజగదాంబముందల /శివుడు/ భారాతీ వీణా శృతి వాయింప లయతప్పకుండాబ్రహ్మ తాళములాగొల్పుచుండ సారసగతులనుసప్తతాళముల సారముతప్పక ప్రదోషవేళల//శివుడు/

శివశివా

శివపాదమునుంచనేను శిలనైనను కారాదా కైలాసపు స్వామిమరల కలనైనను రారాదా// శివపాదమునుంచనేను పూవునైన కాబోనా పూజకైన నేలేనా కలతకనులుకరిగిప్రభువు కభిషేకము కారాదా//శివపా...

శివశివా

శివశివశివ అనరాదా శివనామము చేదా2 శివపాదముమీద నీ శిరసునుంచరాదా2 భవసాగరమీద దుర్భర వేదన ఏలా//శివ// కరుణాళుడుకాదాప్రభు చరణధూళిపడరాదా హరహరహర అంటేమన కరువుతీరిపోదా 2 కరిపురుగూ పాముబోయ మొరలిడగా వినలేదా కైలాసముదిగివచ్చి కైవల్యము ఇడలేదా2 మదనాంతపుమీద నీమనసెన్నడుపోదా మమకారపుతెరస్వామిని మనసారాకననీదా2 శివశివశివ అనరాదా శివశివశివ అనరాదా శివనామము చేదా2

Siva siva yanarada

Image

భజ గోవిందం భజ గోవిందం

 భజ గోవిందం భజ గోవింద       గోవిందం భజ మూఢమతే        సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుక్రింకరణే     1,మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిమ్ మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం 2.నారీ స్తనభర నాభీదేశం దృష్త్వా మాగా మోహావేశం ఏతన్మాంస వసాదివికారం మనసి విచింతయా వారం వారం 3.నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమాన గ్రస్తం లోకం శోకహతం సమస్తం 4.యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్చతి గేహే 5.యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే 6.అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశః సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః 7.బాల స్తావత్ క్రీడాసక్తః తరుణ స్తావత్ తరుణీసక్తః వృద్ధ స్తావత్ చిన్తాసక్తః పరమే బ్రహ్మణి కోపి న సక్తః 8.కా తే కాన్తా కస్తే పుత్రః సంసారో అయమతీవ విచిత్రః కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చిన్తయ తదిహ భ్రాతః 9. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్...

అన్నమాచార్య కీర్తన

ప|| నగవులు నిజమని నమ్మేదా |      వొగినడియాసలు వొద్దనవే || చ|| తొల్లిటి కర్మము దొంతల నుండగ |       చెల్లబోయిక జేసేదా |       యెల్ల లోకములు యేలేటి దేవుడ |       వొల్ల నొల్లనిక నొద్దనవే || చ|| పోయిన జన్మము పొరుగులనుండగ |       చీయనక యిందు జెలగేదా |       వేయినామముల వెన్నుడమాయలు |       ఓ యయ్య యింక నొద్దనవే || చ|| నలి నీనామము నాలికనుండగ |       తలకొని యితరము దడవేదా |      బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి |       వొలుకు చంచలము లొద్దనవే ||        

గ ణ ప తి నవల రచన చిలకమర్తి లక్ష్మీనరసింహం

(1) ఆహాహా మన దేశమునందు జీవ చరిత్రములు లేని లోపమిప్పుడు కనబడుచున్నది.చరిత్ర రచనమునందు మన పూర్వికులకు శ్రద్ధయెంతమాత్రమూ లేకపోవుటచే నొక్క మహా పురుషుని చరిత్రమైన జదివెడు భాగ్యము మనకబ్బినది కాదు. రాజరాజనరేంద్ర ప్రముఖులగు మహారాజుల యొక్కయూ,నన్నయ భట్టారక తిక్కన్న సోమయాజి ప్రముఖ మహాకవులయొక్క చరిత్రములు చేకూరనందున మనమంత విచారించవలసిన పని లేదు. కానీ గణపతియొక్క చరిత్రను సంపూర్ణముగ లభింపనందుకు మనము కడుంగడు విచారింపవలయును. ఆ విచారములోనే గుడ్డిలో మెల్ల యన్నట్ట్లు కొంత చరిత్రము మనకసంపూర్థిగానైన లభించినందుకు సంతోషించవలయును. సంగ్రహముగ నైన నీ చరిత్రము నా కెట్లు లభించినదో చెప్పెద వినుండు ఒక నాడు నేనొక మిత్రునింటికి విందారగింప బోతిని. ఆ మిత్రుని ఇంట వివాహము జరుగుచుండెను. ఆ విందు నిమిత్తము మిత్రులు అనేకులు వచ్చియుండిరి. ఇప్పటివలెచీట్లుపంపిభోజనమునకుపిలిచెడుఆచారమప్పుడులేదు. పెందలకడనేభోజనముబెట్టునాచార మంతకంటే లేదు. విస్తళ్ళు వేయునప్పడికి రెండు ఝాముల రాత్రయ్యెను. వడ్డించునప్పటికి మరి రెండు ఝాముల రాత్రయ్యెను. వడ్డించునప్పటికి మరి నాలుగు గడియలు పొద్దు పోయెను. .భొజనము చేసి లేచునప్పటికి కొక్కొరోకో యని ...