శివశివా

శివపాదమునుంచనేను
శిలనైనను కారాదా
కైలాసపు స్వామిమరల
కలనైనను రారాదా// శివపాదమునుంచనేను
పూవునైన కాబోనా
పూజకైన నేలేనా
కలతకనులుకరిగిప్రభువు
కభిషేకము కారాదా//శివపాదమునుంచనేను
కంటిపాప గంటవినులు
మింటిదారి నందిదేమొ
ఎదనీచిరుగజ్జమ్రోత
చెవులేమో ఢమరుకమూ//శివపాదమునుంచనేను
వెలుగుదారివినువీధిని
కనులేగునునీకొరకై
మబ్బువెంటమలుపువెంట
మనసులోని పిలుపువెంట
నీవెనీవె మృత్యుంజయా
నిలిచిపోగరారాదా//శివపాదమునుంచనేను

Comments

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్

Life is a way: ఆది గురువు