చిన్న పిల్లలకి హారతి
మా చిన్న తనం లో చిన్న పిల్లకి పుట్టిన రోజు వచ్చిందీ అంటే , పెంద్రాళే నిద్ర లేపి
- , తలంటి పోసి , కొత్త బట్టలు వేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోమనే వాళ్లు. ఆ తర్వాత వీలుని బట్టి గుడికి తీసెకెళ్లె వాళ్లు
- సాయంత్రం కాగానే ఇరుగు, పొరుగు వాళ్లని పేరంటానికి పిలిచి ,పుట్టిన రోజు పెళ్లికొడుకు/పిల్ల లకి పీట వేసి, కూచొబెట్టి ,మంగళ హారతి ఇచ్చి, వచ్చిన పేరంటాళ్ళు దీవించి చక్కగా మంగళ హారతులు పాడి దీర్ఘాయువు ,సకల సంపదలు కలిగి, సద్గుణాలతో వర్ధిల్లాలని దీవించే వాళ్లు తదనంతరం ఆ పైన వసంతం నీళ్లతో దిష్టి తీసే వాళ్లు.
- వచ్చిన వాళ్లకి పండు, తాబూలము ఇచ్చి సాదరం గా సాగనంపెవాళ్లు
- మచ్చు కి ఒక పాట ఇదిగో
పల్లవి ::కర్పూరా హారతిదే ,కమలజదళ నయన నీకుసుందర సుకుమార గాత్ర నందకుమారా
చరణం ::గోపీ కా హృదయ లోల గోపాల బాల నీదుప్రాపూ కోరీనవాడ రాపేల చేసెదవుశ్రీ లోలా వాదమేల శ్రితజన పరిపాల నీదుజాలమటుల చేయనేల బాల గోపాలా ఓఓఓ ../:కర్పూరా//2 పచ్చాలా హారతులూ పణతూలం దరు గూడిపంకాజ నాభ నీకు పొంగూచు నిచ్చెదరూపతితా పావాన గాత్ర ,పాలకడలి శయన గోకులబృందావన సంచార, నంద కుమారా ఓఓఓ ./:కర్పూరా//3 నవనీతా చోర నీదు అతులీతా ప్రేమ తోడసతతామూ బ్రోవుమాని చాలాగ వేడెదమూకమలాక్షా నే నిచ్చు కర్పూరా హారతూలుకరుణించీ గైకొనూమా కనికారమ్ము తో:కర్పూరా
Comments
మరిన్ని కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు కొసం చదవండి Spice Andhra News