చిన్న పిల్లలకి హారతి



                                       మా చిన్న తనం లో చిన్న పిల్లకి పుట్టిన రోజు వచ్చిందీ అంటే , పెంద్రాళే                                           నిద్ర లేపి

  1. , తలంటి పోసి , కొత్త బట్టలు వేసి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోమనే   వాళ్లు. ఆ తర్వాత వీలుని బట్టి గుడికి తీసెకెళ్లె వాళ్లు
  2. సాయంత్రం కాగానే ఇరుగు, పొరుగు వాళ్లని పేరంటానికి పిలిచి ,పుట్టిన రోజు పెళ్లికొడుకు/పిల్ల లకి పీట వేసి, కూచొబెట్టి ,మంగళ హారతి ఇచ్చి, వచ్చిన పేరంటాళ్ళు దీవించి  చక్కగా మంగళ హారతులు పాడి దీర్ఘాయువు ,సకల సంపదలు కలిగి, సద్గుణాలతో వర్ధిల్లాలని దీవించే వాళ్లు తదనంతరం ఆ పైన వసంతం నీళ్లతో దిష్టి తీసే వాళ్లు.
  3. వచ్చిన వాళ్లకి పండు, తాబూలము ఇచ్చి సాదరం గా సాగనంపెవాళ్లు

 

  1. మచ్చు కి ఒక పాట ఇదిగో

పల్లవి ::కర్పూరా హారతిదే ,కమలజదళ నయన నీకు
సుందర సుకుమార గాత్ర  నందకుమారా

 

చరణం ::గోపీ కా హృదయ లోల గోపాల బాల నీదు
             ప్రాపూ కోరీనవాడ  రాపేల చేసెదవు
             శ్రీ లోలా వాదమేల  శ్రితజన పరిపాల నీదు
             జాలమటుల చేయనేల బాల గోపాలా ఓఓఓ ..
/:కర్పూరా//
     2      పచ్చాలా హారతులూ పణతూలం దరు  గూడి  
            పంకాజ నాభ నీకు పొంగూచు నిచ్చెదరూ
           పతితా పావాన గాత్ర ,పాలకడలి శయన గోకుల
           బృందావన సంచార, నంద కుమారా ఓఓఓ .
/:కర్పూరా//
   3      నవనీతా చోర నీదు అతులీతా ప్రేమ తోడ
           సతతామూ బ్రోవుమాని చాలాగ వేడెదమూ
            కమలాక్షా  నే నిచ్చు కర్పూరా హారతూలు
           కరుణించీ గైకొనూమా కనికారమ్ము తో 
:కర్పూరా

Comments

Unknown said…
Life is a way your tag line amazing.
మరిన్ని కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు కొసం చదవండి Spice Andhra News

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్