ఉగ్గుపాట

 ఉగ్గు పెట్టా పిలువా  నేలా , ఎంతటీ కన్నూలా వాడ్ని
జగదేకా శ్రీరామా చంద్రా లేవయ్యా  ఉగ్గూ పెట్టేను
నిగ నిగా నవ రత్నా నీలా వర్ణపూ చాయా
తళ తళ మనీ యేటీ ధాతూ మెరయగానూ // ఉగ్గు పెట్టా పిలువా  నేలా//
సండిటి దండలూ జవులూ భుజ కీర్తులు
కరమూనా ఉన్నట్టీ శంకూ చక్రమూలూ
పాలూ నెయ్యీ తెచ్చీ పాయసాన్నమూ చేసెను
 పైడీ గిన్నే లోనా ఆరాగించాగా రారా   // ఉగ్గు పెట్టా పిలువా  నేలా//
రామా రామా యన్నా ప్రేమా తీరదూ నాకూ
ముఖ మెత్తీ ముద్దీరా మోహానా కారా
మణులూ రావీ రేఖా , మద్దికాయలా జూకా
మకరా కుండలమూలు ,మణికిరీటము తో / /ఉగ్గు పెట్టా పిలువా  నేలా//

Comments

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్