Thursday, April 8, 2010

ఈరోజు టీవీ లో వార్తలలో చెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.

kalividi@googlegroups.com         
   ఒకటికి ఆరు రెట్లు ఇస్తామనిఇరవైఏడు కోట్లు రూపాయలు వసులు చేసి ఆ సొమ్ముని షేర్లలో పెట్టి, నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న తల్లి, తండ్రులు, విస్తుపోయి, మైండుపాడైపోయి  వెర్రి చూపులు చూస్తున్నా వారి కొడుకు,  ఈరోజు టీవీ లో వార్తలలోచెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.


     కన్న పిల్లల్ని కస్టపడి ఎదగమని , శ్రమయే ఎదగటానికి   సూత్రమనీ చెప్పి,

నిజాయితీ తో  పిల్లలని పెంచటం మన పెద్దవాళ్ళు మనకి నేర్పిన నీతి.

      మరి ఆ పెద్దలే అత్యాసః కి పోయి ఇలా చేయడం భావ్యమేనా? 

ఒకసారి వళ్ళు జలదరించింది. 

      పొద్దున్న అనగా పోయి పోద్దుత్నించి సాయంత్రం దాకా జివిక 

నడవడానికి   బతుకుతెరువు కోసం బ్రతికే వాళ్ళమే ఎక్కువ. ఇలాంటి 

అత్యాషలు తలకి ఎక్కకుండా ముందు మన పిల్లలకి ఒక్కొక్క మెట్టూ  ఎక్కడం 

లో ఉన్న మానసిక ప్రశాంతతని  తెలియజేయాలి. . వాళ్ళు దారి తప్పి ,

అత్యాశకి పోయి తప్పు చేస్తున్నట్లనిపిస్తే హెచ్చరించాలి.

     అలాంటిది పెద్దలే పప్పులో కాలేస్తే కుటుంబమే పాడైపొలెదూ ? వాళ్లకి 

సంబంధించిన కుటుoబీకులు    బ్రతికినన్ని రోజులు వేలెత్తి  చూపించు కుంటూ

ఎలా బ్రతకాలి ,  ఎలా బ్రతకాలి

    మన ఆనందం, అత్యాశ మన తర,తరాల లనీ ఇలా వెలి చుపులకి 

బలి చేయడం సమంజసమేనా

     ఎందుకిలా జరుగుతోంది? 

    మనం తినేది ఒక్క ముద్దా కట్టేది ఒక్క బట్టా

మన కోసమే ఐతే ఇంత సంపాదన , ఇంతమంచి  చదువు చదివి , మంచి 

ఉద్యోగం చేస్తే  చాలదా /

మనిషి ఆయువు వంద సంవస్తరాలై తే దాన్లో  యాభై  ఏళ్ళు నిద్ర పోవడానికే 

సరిపోతుంది. దాదాపు పది ఏళ్ళ వయసు దాకా పెద్దల పెంపకం లోనే జరిగి 

పోతుంది.
       అంటే మొత్తం అరవై ఏళ్ళ బ్రతుకు ఉట్టిగానే వెళ్ళిపోతుంది. మిగిలిన నలభై

ఏళ్ళ బ్రతుకులో  మంచి చదువు,   కొంచం ప్రేమ, కొంచం డబ్బు చాలవా ?

     ప్రతి ఒక్కళ్ళు ఒక అంబానియో , బిర్లా నో, ఒక రతన్ టాటా నో కావాలని 

ఆశ. అంటే కాదు వాళ్ళలాగా హై క్లాసు బ్రతుకు గడపాలని ఆశ. వాళ్ళలాగా 

పది మందిని బ్రతించాలని కాకుండా ముంచాలని , తద్వారా తాము 

కార్లలో,తిరుగుతూ, ఖరీదైన జీవితం గడపాలనీ  వెంపర్లాట  ఎందుకిదంతా

తా దూరసందు లేదు, మెడకోడొలని    మన బ్రతుకు,మనం బ్రతకడానికి, 

ఇంతమంది జివితాలతో ఆడుకోవడం అవసరమా

ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఉంది.

రూపాయి కి ఆరు అనగానే  డబ్బుఇచ్చిన వాళ్లకి  బుద్ధి లేదు  .

ఇది నా వ్యక్తిగతమైన బాధ మాత్రమె. అందరు నాతొ ఎకిభావించాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది.

7 comments:

Anonymous said...

ఇందులో విషాదం ఏమిటంటే ఆ తల్లిదండ్రులు మమ్మల్ని చంపేయి అని ఆ కొడుకుని బలవంతంగా ఒప్పించారట. తండ్రి, కొడుకు కలసి తల్లిని ఉరి బిగించి చంపాక, తండ్రి ఉరి వేసుకుని కొడుకుని లాగమన్నాడట. ఈ రోజు తనే వాళ్ళ చితికి నిప్పు పెట్టాడు. తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఆ పిల్లవాడు ఎంత దారుణమైన అనుభవం చూశాడో కదా జీవితంలో. ఆ బాబు వయసు 17. అతనికి బతుకు మీద ఆశా పోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. (ఈ సంఘటన గురించి ఈనాడు తూర్పుగోదావరి లో వచ్చిన వివరాలివి).

jeevani said...

ఎక్కడో నూటికో కోటికో తప్పించి, కష్టపడనిదే ఒక్క రూపాయి కూడ సంపాదించలేరు.

Anonymous said...

ప్చ్.. మూర్ఖమైన అత్యాశకు వాళ్ళు బలయ్యారు, ఆ బ్రతికుండే అమాయకుడి గురించే నా భాధ.

మైత్రేయి said...

సానియా ఇంటి ముందు కాపలా కాస్తూ, ఆ రోడ్డు లో విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ, ఆమె చెయ్యి కాలు కెమారాల లొ చూపిస్తూ అక్కరలేని పబ్లిసిటి ఇస్తూ ఉండే కంటే ఇలాంటీ నిజాల్ని చూపటం వల్ల ప్రజల్లో కొంత అవగాహన వస్తుంది. ఎవరైనా స్వచ్చంద సంస్తలు కొంత సహాయం చేసే అవకాశంకూడా వస్తుంది.
ఆ విషయం లో ఈ టివి వార్తలు అప్పటికి ఇప్పటికి ఒక స్టాండర్డ్ లో ఉంటాయి. పోచుకోలు వార్తలు చూపరు.

శ్రీవాసుకి said...

బాగుంది. జీవితానికి డబ్బే పరమావధి అనుకుంటే ఇలానే ఉంటుంది. జీవితంలో అది ఒక భాగమనుకుంటే ఏ సమస్యా ఉండదు. డబ్బు కాకుండా ఆనందాన్నిచ్చేవి చాలా ఉన్నాయి.

వర్మ said...

well said .... Money is not everything ....

Anonymous said...

ఎకిభావించాలని-- పంటికింద రాయిలాగా ఉంది.