Life has so many flavors. some times we search for a life that is far away. But forget to live the life in our way. for those people this .... "life is a way"
ఆట గదరా శివా ! ఆట గద కేశవా!! ఆట గదరా ! నీకు అమ్మ తోడు !! ఆట గద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు ఆట గద మాయకే మాంగల్యము ను గట్టి కామదహనమ్ము సయ్యాట నీకూ ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ ద్రుష్టి విష్ణుమాయలు గూడ ఆట నీకూ ఆట చదువుల తల్లి ,ఆట బంగరువల్లి ఆటకద శ్రీచక్ర సంచారిణీ , ఆట గద మార్కండునకు ఆయువొసగేవు మ్రుత్యు న్జ యత్వమ్ముఆట నీకూ ఆట గదభక్త సిరియా ళునేభుక్తిగొని ముక్తి ప్రసాదించు టాట నీకు ఆట గదరా నీకు ఆది శంకర బోధ ఆట గదఅద్వైత సిద్ధాంతము ఆట గదరా నీకు చతురంగ ఖేలనం జీవులే పావులై ఆట నీకు ఆట గదరా నీకు ధూర్జటి కవి పలుకు ఆట గద శ్రీకాళహస్తి మహిమ . గదరా నీకు కాళిదాసుని కవిత సుకుమారసంభవం బాట నీకు ఆట గదరా నీకు శ్రీనాథు వైభవం ఆట గదరా నీకుహరవిలాసం ఆట గదరా నీకు శన్ముఖునిశివపదం ఆట గద నీకతని ఆర్తి రచన , ఆట గదరా నీకుస...
యీమధ్యనె కాదు, ఎన్నాళ్ళనుంచో నేను త్రుటిలో తప్పించుకున్న ప్రమాదాల్లో ఉమ్మించుకోవడం అన్నది ఒకటి.(చిన్నప్పుడు నాకు ఆ అనుభవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. వాళ్ళింట్లోనే కూచుని మా పక్కింటి బువ్వమ్మ పాను వేసుకుని నన్ను పవిత్రం చేసి, మాఫ్కరో బే టా అని బాధ పడటం నాకింకా గుర్తే. కాని నా బాధ ఆవిడ బాధ కంటే మించి పోయింది,) వినడానికి సాధారణంగా అనిపించినా దీని బారిన పడ్డవాళ్ళ అవస్థ అంత ఇంతా కాదు మరి. ఎలాగంటారా చూడండి. అతి పెద్ద ప్రమాద కనిపించేది C.B.S బస్స్టాండ్ లో .(దూర దూరాలకి వెళ్ళడానికి ఎంతొ శ్రమపడి శుభ్రం గా తయారు అయి బస్ స్టాండు కి చేరుకుంటాం. బస్సు కి, బస్సు కి మధ్యన కొద్దిగా జాగా ఉంటుంది కదా అక్కడికి చేరేప్పడికి ప్రతి రోజు ప్రయాణించే వాళ్ళకైతేనేఁ , ఆఫీసు పనుల మీద వెళ్ళే వాళ్ళ కైతే నేఁ పరిగెత్తికెళ్ళి బస్సు చివరి నిముషం లో ఎక్కే వాళ్ళ కైతేనేం, )సరిగ్గా అ...
చాల రొజుల తర్వాత, ఏదైన ఒక మంచి పుస్తకం చదవాలని నారాయణగూడలో జరుగుతున్న విశాలాంధ్ర బూక్ ఫేర్ కి అదే పనిగా వెళ్ళాను. పుస్తకాలు వెతకడం మొదలెట్టగానే , నా కళ్ళు 'దర్గామిట్ట కథలు ' పుస్తకాన్ని చూసి మెరిసాయీ . ఎప్పట్నుంచో ఆ పుస్తకం చదవమని మా వాడు ప్రత్యీకంగా చెబుతున్నాడు. ఖరీదు చూశాను. 60 రూపాయలు అని ఉంది. అటు,ఇటు తిరగేసి ఒక పుస్తకాన్ని కొన్నాను, దాంతొ బాటె ఇల్లేరమ్మ కథలు వగైర కూడా కొని అర్జెంట్ గా ఇంటికి వచ్హి కాళ్ళైనా కడుక్కోకుండానే మంచం మీద అడ్డంగా పడి చదవటం మొదలెట్టాను. మొదట్లొనే ఈ కథలన్నీ మా నాయనకి అంటునే మనసులోనించి రాయటం మొదలెట్టాడు ఖదీర్ బాబు. మా నాయన మూట కట్టుకున్నది ఆస్తిని కాదు, స్నేహితులని అని అయన రాసిన మాటలు మా నాయన కి కూడ అక్షరాల వర్తిస్తాయి. అందుకే నాకు బాగా మనసుని తాకిందామాట. నాయినలు కేవలం ఆస్తులే కూర్చడం పనిగా పెట్టుకున్న ఈ రోజుల్లోకూడా, మా నాయన సంపాదించిన తరగని అస్తిని ఎంతో అపురూపంగా భావిస్తాను నేను., దీంట్లో ఒక్కొక్క కథ ఒక్కొక్క జీవితదర్పణం.మనసు పంచుకున్నాడు ఖదీర్ బాబు స్పటిక మంత స్వచమైన భావంతో,భాషతో ఒక్కటేంటి, ప్ర...
Comments