శరణు శరణు సురేంద్ర సన్నుత annamayya keertana


శరణు శరణు సురేంద్ర సన్నుత,శరణు శ్రీసతి వల్లభ
శరణు రాక్షస గర్వ సంహర ,శరణు వేంకట నాయక//శరణు శరణు సురేంద్ర సన్నుత//

కమల ధరుడును, కమల మిత్రుడు 
కమల శత్రుడు, పుత్రుడు
క్రమముతో మీకొలువు కిప్పుడు 
కాచినారెచ్చరికయా//శరణు శరణు సురేంద్ర సన్నుత//


అనిమిషేంద్రులు మునులు దిక్పతులు 
అమర కిన్నెర సిధ్ధులు 
ఘనతతో రంభాది కాంతలు 
కాచినారెచ్చరికయా//శరణు శరణు సురేంద్ర సన్నుత//

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు
నిన్ను కొలువగా వచ్చిరి
విన్నపము వినవయ్య 
తిరుపతివేంకటాచల నాయకా//శరణు శరణు సురేంద్ర సన్నుత//


Comments

Popular posts from this blog

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

అలా ఉమ్మేయటం మానేయండి.....ప్లిజ్

ఖదీర్ బాబు దర్గమిట్ట కథలు_ఒక క్రిస్టల్ క్లీయర్ ఫీలింగ్