శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ by M.S.Subbulakshmi
పల్లవి
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ని శ్రీ పాదమే శరణు
చరణం
కమలాసతీ ముఖ కమల కమల హితా ,కమల ప్రియా కమలేక్షణా
కమలాసన హిత గరుడగమన శ్రీ,కమల నాభ నీ పద కమలమే శరణు //శ్రీమన్నారాయణ //
పరమయోగి జన భాగధేయ శ్రీ పరమపురుషా పరాత్పరా
పరమాత్మా,పరమాణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు //శ్రీమన్నారాయణ//
Comments