Wednesday, March 17, 2010

విరోది /వికృతి

              అందరికి  వికృతినామ శుభాకాంక్షలు చెబుతున్న కూడా నా మనసే ఎందుకో నాకు విరోధి లాగ ఉంది ఈ రోజు. స్వగతంగానే అన్న పైకే వచ్చేసింది  ఆ మాట .ఎవరేనా వింటున్నారేమో,. గోకి తెచ్చుకుంది  గోడ్డుగేదే అన్నట్లు అసలే మనసు బాగోలేక అవస్థ పడుతూ  పనిచేసుకుంటున్నాను,  లేనిపోని గొడవలు కూడావస్తె  
    ........ఆలోచనల్ని కట్టిపెట్టి పనిలో పడ్డాను. 
             మేడంమీ లీవ్ మంజూరు    కాలేదు నా కొలిగు శుభాకాక్షాలు చేబుతూ నే  చావు కబురు చల్లగా చెప్పింది.. అవును,


            ఇంటి అద్దె ఈనెల ఆలస్యంగా ఇస్తానని ఇంటి యజమానికి ముందుగానే చెప్పి మంచిపని చేసాను.


      ఎరా ఏం చేస్తున్నావ్   ముందుగదిలో కూచుని ఇంటర్ నెట్ లో పని చేసుకుంటున్న మా వాడిని కెకేసా . తలెత్తకుండా ,సమాధానం చెప్పకుండా తన పనిలో మునిగిపోయాడు.
        ఒళ్ళు మండిపోతున్న అలాగే వచ్చి ముందు ద్వారానికి మామిడాకులు కట్టి, కింద పడిన విడి ఆకులు యెరెస్తూ ఇట్లాంటి కొడుకుని కన్నందుకు నన్ను నేనే శాపనార్ధాలు పెట్టుకున్టూఇంట్లోకి వచ్హాను.
        అప్పట్నుంచి పిలుస్తుంటే సమాధానం లేదేమంటూ వాడ్ని తిద్తూ, నా ఖర్మ, ఈ సంవస్తరం    నాకు అంతా విరోధమే  అనుకున్నా .
వంట చేయబుద్ధి కావట్లేదు. . ఎంత కాలం ఇలా ఒంటరి పొరాటమో , మనసు మూల్గింది.
         జాబు సెర్చ్ చేస్తున్నా . ఈ మధ్యనే ఉన్న ఉద్యోగం చాలదని, వదిలేసి, కొత్తగా జాబు మారడానికి కృషి చేస్తున్నాడు మా వాడు.
ఒళ్ళు మండిపోయింది. నిక్షేపం లాంటి ఉద్యోగం వదిలేసి .............మనసు లోంచి ఉక్రోషం తన్నుకువస్తోంది.
  వీళ్ళకు చెప్పె వాళ్ళెవరు ....అర్ధం చేసుకోరు   నా ఖర్మ ఈ ఏడాది నాకు నిజంగా విరోదే. మళ్ళి మనసు చెప్పింది.
ఏదో తినీ తినకా కూచున్టారని    ,మా చెల్లి పసిగట్టి భోజనం పంపింది.  .
    సాయంత్రం ఆరు గంటలకు కాబోలు మా అకౌంటెంట్ ఫోన్ చేసి పండగ శుభా  కాంక్షలు తెలుపుతూనె   మేడంమీ సాలరీ బిల్లు    కాలేదు. 
        ఇంకా  నా పండగ చూడాలి. .అనారోగ్యంతో దాదాపు ఆరు నెలలనుంచి సెలవలో ఉన్నానునేను. పని లేక,చేయలేక, బయటి ప్రపంచంలో ఏం జరుగుతోందో  అంటే నా డిపార్టుమెంటు లో సంగతులు( నా ప్రపంచం అంటే నా డిపార్టుమెంటు)తెలీక
నాకు పనిగట్టుకుని యోగ క్షేమాలు చెప్పే స్నేహితులు లేక ,కొట్టుమిట్టాదుతూ   
                నా ఖర్మ ఈ ఏడాది నాకు నిజంగా విరోదే. మళ్ళి మనసు చెప్పింది.
          తెల్లారింది.
              కళ్ళు తెరుస్తుండగానే ఫోన్. ఎవరా అని అనుకున్టూనె  తీసా. మా ఆఫీసు నుండి మేడంమీ జితం Incomtax    సమస్య లేకుండానే పాస్ అయింది 
               కొద్దిగా ప్రాణం హాయిగా అనిపించింది. లేచి కాఫీ తాగుదామని వంటింట్లోకి  వెళ్ళాను . అమ్మ, నిన్నంతా మీరు ఏదో ఆలోచనలో ఉన్నారని వంటిల్లు కూడా కదిగేసానమ్మ, పనిమనిషి లక్ష్మి ఎప్పుదూ చెప్పినా చేయనిది  అంటుంటే నన్ను నేను నమ్మలేకపోయాను.
          స్నానం  ముగించుకుని వంటకి ఉప్క్రమించుదామని అనుకుంటుంటే నా స్నేహితురాలి ఫోన్. ఏమీ చెప్పలేదేవిటే,
నీకు వైజాగ్ కి  బదిలీ అయిo దిటకదా ఈ రోజు పేపర్లో ఇచ్చారు చూడు అంది.


               ఈ ఏడాది నాకు నిజంగా పండగే మనసు చెప్పింది.
పేపెర్ పుచుకుని హాల్లోకి వచ్చానోలేదో మావాడు హడావుడిగా వచ్చాడు. అమ్మ నేను వెంటనే   వెళ్ళాలి ఐ  వాడి మాట పూర్తి కాకుండానే నేను అందుకున్నాను, ఉద్యోగానికేనా .....
            ఈ ఏడాది నాకు నిజంగా పండగే మనసు చెప్పింది.




























  

3 comments:

Anonymous said...

gud narration. mee lo subject undi. illage raastupote inka improve aoutundi

bloggerbharathi said...

Look at the blog relax, work worn out ...

bloggerbharathi said...

Look at the blog relax, work worn this is tha comment made by easyin chainees language