Tuesday, October 25, 2011

Monday, October 17, 2011

గోత్ర ప్రవరలు :


   

          యీ  కాలం లొ కాస్మాపాలిటన్  సంస్చ్రుతి    పెచ్చు  పెరిగి తన  ఇంటి పేరేంటొ, గోత్రం ఏంటో    , అసలు తమ పూర్వుల ఋ షుల పరంపరలు ఏంటో  తెలుసుకునే    శ్రద్ధ ఎవ్వరికీ లేకుండా పొతొంది. కనీసం తెలుసుకొవాలన్న     ఉద్దెష్యం కూడా కొరవడి పోతోంది.  తెలుసుకోవాలనుకున్న వాళ్లు యే కొందరో ఉన్నా తెలిసిన వాళ్లు, తెలిసినా చెప్పేవాళ్లు , సమయానికి అందుబాటులో చెప్పడానికి ఉండక పొవడం వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అలా తెలుసుకోవాలనుకునే వాళ్లకోసం యీ కొద్ది సమాచారం       -----గోత్రాలు  - ప్రవరలు
గోత్రం                 ప్రవర
అంగాయన -------- -బార్హస్పత్య  -భారద్వాజ  (త్రయార్షేయం)
అంగీరస -------  -- ఆయాస్య --గౌతమ ----(త్రయార్షేయం)
అగస్త్య ---------    అగస్త్య --గార్గేయ---ఐద్యున్నుత -- (త్రయార్షేయం)
అగస్త్య------        అగస్త్య---దార్ఢచ్యుత   - ఇధ్మవాహ (త్రయార్షేయం)
అగస్త్యి -----        అగస్త్య--మాయోభువ--- మాహేంద్ర --- (త్రయార్షేయం)
అగ్నివేశ్య ---        అంగీరస-బార్హస్పత్య  -భారద్వాజ  (త్రయార్షేయం
అఘమర్షణ ---       వైశ్వామిత్ర --అఘమర్షణ---కౌశిక  --(త్రయార్షేయం)
అజ (అజులు) --      వైశ్వామిత్ర --మాధుచ్చందన -అజ( ఆపస్తంభ-బోధా, అశ్వలాయన
                    వైశ్వామిత్ర --మాధుచ్చందన -ఆజ్య( త్రయార్షేయం)
ఆత్రేయస ------     ఆత్రేయ--అర్చనానస --శ్యావాశ్య (అత్రి గణం)
                  ఆత్రేయ--అర్చనానస--- గావిష్టిర  (అత్రి గణం)
ఆశ్వలాయన       ------ ఏకార్షేయం
వాషిశ్ట -------    వాషిశ్ట -{ఏకార్షేయం   }


                                                         .........మరికొన్ని  మరో టపా లో 

Tuesday, October 11, 2011

డా .అందెశ్రీ - కొమ్మా కొమ్మా



YouTube
డా .అందెశ్రీ
One of the best poet and singer from Telangana. Andesri is also a gifted artrist. His poems and songs reflect the true sense of rural Telangana.
© 2011 YouTube, LLC
901 Cherry Ave, San Bruno, CA 94066

జయ జయహే తెలంగాణ


                                Dr.Andesri

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం..జై తెలంగాణ – జై జై తెలంగాణ


పోతన దీ  పురిటిగడ్డ, రుద్రమదీ  వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్...జై తెలంగాణ – జై జై తెలంగాణ


జానపద జన జీవన జావలీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం...జై తెలంగాణ – జై జై తెలంగాణ


సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున  ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద
సిరులు పండే సారమున్న మాగాణి కరములీయ...జై తెలంగాణ – జై జై తెలంగాణ


గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాలై  పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలీ
స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి..జై తెలంగాణ – జై జై తెలంగాణ


తెలంగాణ జర్నలిస్ట్ లకు సంస్కారం లేదు: పరకాల ప్రభాకర్

తెలంగాణ జర్నలిస్ట్ లకు సంస్కారం లేదు: పరకాల ప్రభాకర్

Dr. AndeSRI - Maayamaipothunnadamma

Dr. AndeSRI - Maayamaipothunnadamma

మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ ,
మచ్చుకైనా లేడు చూడూ, మానవత్వము ఉన్న వాడూ
,నూటికో, కొటికో ఒక్కడే ఒక్కడు ,
యాడ ఉన్నడొ గాని కంటికే కనరాడు //మాయమై పొతున్నడమ్మో//

నిలువెత్తుస్వా ర్థమూ నీడలా ఉన్నపుడు,
చెడిపోక యేమైతడమ్మో 
ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు,
తెగనాడుతున్నడొ యమ్మా ,
అవినీతి, పెను ఆశ , అంధకారము లో
చిక్కిపోయి లోన శిధిలమౌతున్నాడు       //మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ //

ఒక్క దెవున్ని రెండు రూపాలుగా గొలిసి
, పంది, నందిని జూసె పడిపొర్లుతుంతాడు
, సీమలకు సక్కెరా, పాములకు పాలోసి
, జీవకారుణ్యమె జీవితమ్మంటాడు ,
తొడ బుట్టిన వా ళ్ళ  ఉసురూ తగిలీపెట్టి ,
కులమంటు ఇల మీద కలహాలు రగిలేసి //మాయమై పొతున్నడమ్మో ,//
మయ్యర్పితమ్మన్న  అర్ధమేమో తెలియక ,
అంధుడై పోతున్నడమ్మో ,
హిందు ముస్లిము క్రీస్తు సిక్కు పార్సీ యంటు ,
తన్ను తా మరిచెనొ యమ్మా ,
మతము లొక హితముము అన్న మాట మరిచి ,
మత ఘర్షణల మధ్య మణిషి కనుమరుగౌతు //మాయమై పొతున్నడమ్మో//


  ఇరువయైదు  పైసలగరువత్తులు గాల్చి 
 అరవై ఇదు కొట్ల  వరమడుగుతాడు ,
దైవాల పేరుతో  చందాలకైదండ ,
భక్తి ముసుగూ దొడిగి  బలె పోజు పెడతాడు ,
ముక్తి పేరు గ  నోళ్ల రక్తి లో దాగి, ,
రాకాశి రూపాన రంజిల్లుతుంటాదు //మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ /

/అవసరాలకు మనిషి స్రుస్టించి రుపాయి
  సుట్టుదిరుగూతాడమ్మా
రూపాయి కొరకు యె పాపాన్నైయితె యేమి ,
ఒడిన గత్తే నదిగొ చూడమ్మా
, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
, కోట్లకూ పడగెత్త కోర్కెలూ చెలరెగ,//మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ

కళ్ళ పొరలూ గమ్మ ,  కామమ్ముతో రేగి
 వెకిలి చేశ్టలతొటి  వేధిస్తు ఉన్నాడు ,
కన్న వాళ్ళకు రోజు కన్నీళ్లె మిగిలించి
, కౌగిళ్ళె స్వర్గమని కలలు గంటుంటాడు
,,సీకటయితే సాలు చిత్తుగా తాగేసి
పాపి మరుకలు కాస్త మరిచిపొతు నరుడు //మాయమై పొతున్నడమ్మో//   

Sunday, October 9, 2011

నడుము నొప్పికి యోగా



               1.  వెల్లకిలా పడుకుని  శరీరాన్నిబాగా( stretch ) చెయ్యాలి 
               2. కాళ్ళు రెండు ఒక్కొక్కటి గా కిద్దిగా పైకి ఎత్తి  ఒకటి నుంచి పది లెక్క పెట్టుకుంటూ మెల్లగా కిందకి      దించాలి     అలా ఒక్కొక్క కాలూ ౫నిముశాలు చేయాలి 
               3..అలాగే వెల్లకిలా పడుకుని, ఎడమ మోకాలిమీద  కుడి పాదం ఉంచి , చేతులువెల్లకిలా చాచి, ఎడమ వేపు చేతి బొటాన వేలిని తదేకంగా చూడాలి. అలాగే కుడి మోకాలి మీద ఎడమ పాదం ఉంచి కుడి చేతి బొటనవేలిని తదేకంగా చూడాలి. 
              4..పాదం బొటనవేలి మధ్యన రెండో పాదం మడమని ఉంచి stretch  చేయాలి ,అలాగే రెండో వైపు పాదం కూడా
          5..వెల్లకిలా పడుకుని అయినంత వరకు నడుముని పైకి ఎత్తాలి 
          6..కుడి కాలిని ఎడమ మోకాలి మీద ఉంచి తల ఒక వేపు, పాదం దానికి వ్యతిరేకం గ twist చేయాలి  
         7. పాదాలని పిరుదులకి తగిలేలా చేసి రెండు చేతులని తల కిందుగా ఉంచిఅటూ ఇటూ అంటే మోకాళ్ళు ఎడమ వేపుకి తిప్పినపుడు మొహాన్ని కుడి వెపుకీ, అలాగే కుడి వేపుకి మొకాల్లని తిప్పినపుడు మొహాన్ని ఎడమ వెపుకీ తిప్పాలి
ఇoతే కాకుండా సేతుబందాసన్ , అర్ధ చక్రబందాసన్,  అలాగే పాద అంగుస్తాసన్ కుడా క్క్రమం తప్పకుండా చేస్తే లంబార్డ్ సమస్యలు, వెన్నెముక క్రింది భాగాన ఉండే సమస్యలు కొంత వరకు సమసిపోతాయి



కరుణించితే చాలు కనకాభి షేకాలు ;రచన ... డి.హరనాథ్

                          
                       కరుణించితే చాలు   కనకాభి షేకాలు   
                        కురిపించు దేవీ    నీ కిదే మంగ ళం
                       శరణూ   వేడితె చాలు  శతకోటి దీవెనల
                       వరమూలిచ్చెదేవి  కిదె  మంగళం  //    కరుణించి //

                      రహిపుట్టు రాగాల    రాతినే కరగించు
                     సంగీతరాణి నీకిదె మంగళం
                     నవనీత హ్రుదయాల    రసగీతి పలికించు
                     పదసంపదల దేవి  కిదె మంగళం  //కరుణించి// 
                    పలుకుతెనేల ఊట   కవులా కమ్మని నోట
                    ఒలికించు దేవీ నీకిదె మంగళం
                   కరవాలమునకైనశిరసూ వంచని మేటి
                  కవిలోక శక్తీ నీకిదే మంగ ళం    //కరుణించి//

                  రసనపై తా నిలిచి రచనగా తా వెలిసి
                  కుసుమించు దేవీ నీకిదె మంగళం
                  జయభారతీదేవి జయమంగళం
                  శ్రీ శారదా  దేవి శుభమంగళం   //కరుణించి//
                ఆ మధ్యనొక సారి ఒంట్లో బాగా లేక శివరాంపల్లి లో ఉన్న కస్తూరిబా ప్రక్రుతి వైద్యశాల లో మూడురోజులు ఉన్నాను . మేమున్న రూం ప్రక్క రూం లో హరనాథ్ గారి అమ్మగారు వైద్యం కోసం ఉన్నారు. ఆవిడ గొంతులో విన్న ఈ పాట ఇంకా నా చెవుల్లో మారుమోగుతోంది  .

మావాడి కవిత్వం


                 
ఓ కొత్త జంట ఉరేగుతూంది ,
కొంగొత్త ఆశల   పల్లకిలో ,
సహజీవనానికి పదం  కలుపుతూ  
పెదవి దాటని మందహాసం , 
నవ జీవితం పై కన్న కలలను , 
ఆ కళ్ళలొ మెరిసేటిమెరుపులు,
వర్ణనలకందని  హ్రుదయాల భావాలను
ప్రతిఫలిస్తుండగా  , 
ఆ అనందాన్ని పంచుకుంటున్న సాటివారి మధ్య 
,ఆ కొత్త జంట ఊరేగుతోంది. 

ఓ శవం తన తుది ప్రయాణం చేస్తూంది ,,
ఆ నిర్జీవపు కట్టె   కళ్ళలొ ,
అడియాసలైన ఆశలు  ,
యే భావం లేని  మోములో   తననే నమ్మిన తనవారిని 
మోసం చెసిన అపరాధ భావం ,
ఆగిపొయినా , ఆ గుండె లో జీవం పై మమకారం , 
నమ్మినవాడు నట్టెట ముంచాడనే  నమ్మలేని నిజానికి 
అంత్యక్రియకు జరిపేందుకు 
నా అనే వారంతా నడక మొదలు పెట్టారు 

ఓ ఇరుకు సందులొ ఎదురు పడ్డాయి ఆ రెండూ 


అప్పుడే మొదలైన జీవితానికి ,
ముగిసిపొయిన మరో జీవితం కాసింత దారి ఇచ్చి
తన గమ్యం చూపించింది 

ముగిసిపొయినా తన జీవితం పై 
ఆశ   చావని ఆ శవం కొత్త జంటను చూస్తూ 
కుమిలిపొయింది ,

 తమ ప్రయాణపు  తుది మజిలీ ఎదురుగానే కనిపిస్తున్నా ,
మనసును కమ్మిన మొహపు తెరలు 
ఆ కొత్త జంటను ముందుకు నడిపించాయి 

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ




ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే  ,
తంగేడు పూవొప్పునే గౌతమ్మ తంగేడు కాయొప్పునే  ,
తంగేడు పూవులో తంగేడు కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే  ,
                                                                                 //ఏమేమి పూవొప్పునే //
తెలుగింటి  పూవొప్పునేగౌరమ్మ తెలుగింటి  కాయొప్పునే
తెలుగింటి పూవులో, తెలుగుంటి కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే
                                                                                //,ఏమేమి పూవొప్పునే //
ఉమ్మెత్త పూవొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయొప్పునే ,
ఉమ్మెత్త పూవులో, ఉమ్మెత్త కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే ,
                                                                              //ఏమేమి పూవొప్పునే//
జిల్లెడు పువొప్పునే గౌరమ్మ
జిల్లేడు కాయొప్పునే
జిల్లేడు పూవులో  జిల్లేడుకాయలో
 ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ
 కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
                                                                           // ఏమేమి పూవొప్పునే //
దాశానం పువ్వుఒప్పునే గౌరమ్మ
 దాశానం కాయొప్పునే
దాశానం  పూవులో  దాశానం కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ
, కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
                                                                                   //ఏమేమి పూవొప్పునే  // ,
గుమ్మాడీ  పూవొప్పునే  గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే
గుమ్మాడీ పూవులో, గుమ్మాడీ కాయలో
  ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
                                                                           //ఏమేమి పూవొప్పునే  // ,
గన్నేరూ పూవొప్పునే
గన్నేరు కాయొప్పునే
గన్నేరూ పూవులొ  గన్నేరూ కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో   , //  ఏమేమి పూవొప్పునే//   ,

Sunday, October 2, 2011

అన్నలారా రండి మన

               
              
              అన్నలారా రండి  మన
              అమ్మ నుడి వినండి 
              ముందున్న పని గనండి 
              ఎమన్నా దడియకండి  //    అన్నలారా రండి //
              పర ప్రభుతను ద్రోల  , 
             అల బాధ్యతల సురగ్రోలా 
              వరసిరులను ఏల
             అనువైన అదను చాలా //    అన్నలారా రండి //
              ఆంగ్ల బిరుదు మాని 
             తల అంగ్లసేవ మానీ
             ఆంగ్ల తొత్తు మానీ 
             అల అంగ్లేయత మానీ  //    అన్నలారా రండి //
             కొట్ట తిట్టవద్దు మరి గోణగ సణగ వద్దూ 
             పట్టు దలను గూడు 
             డిల పంతమేల్ల మీరు //    అన్నలారా రండి //
              కత్తి భయము మానీ అల 
              సత్తెము చేబూని 
               ఆత్మబలము బూని 
              తరలి రండి మాతృ ముక్తీ
              




ఎగురవే ఝెండా

గుఎగురవే ఎగురవే ఎగురవే ఝెండా
ఎగురవే ముచ్చటగ మువ్వన్నె ఝెండా
ఎరుపు నీలో నిలిచి కలిమి మాలో నిలిపె
కలిమి బలిమి తోటి కలిసిమెలిసుంటాము //ఎగురవే //

తెలుపు నీలో నిలిచి శాంతి మాకందించె
శాంతి కాముకులమై శాంతి నిలిపేము
శాంతితో కాంతి తో దివ్వెలై వెలిగేము//యెగురవే//

హరిత వర్ణము నీదు ఆత్మ విలసిల్ల
సస్య శ్యామలమైన నవజగతి మీదిగా
జగమెల్ల హరితమై జనమెల్ల నవత
నవ ప్రభంజనమై నవ మహోదయ మీయ /యెగురవే//

ధర్మ చక్రము నీదు హ్రదయమై ఒప్పార
జనత జాగ్రతి తోడ జగమంత విప్పార
ఎరుపు తో పసుపు తో హరితశ్యామలము తో
ధర్మచక్రము దాల్చి ధరణి నెలగ ఎపుడు /యెగురవే//
( యీ పాట రచన సుసర్ల జయభారతి.)

వందనం,,వందనం గిరినందినీ ప్రియ నందనా


వందనం,,వందనం గిరినందినీ ప్రియ నందనా
వందనం కరివదనకరుణా
శరణు నీ పద కమలములకడ //వందనం//
వందనం ముని బృంద హ్రుదయ స్యందనా
వెన్నవలె, వెన్నెలలవలె,క్రొన్ననలవలె
మెత్తనిదినీమది
దాతవని శుభ దాతవని,
మా
బ్రతుకునేలే నేతవని విని//వందనం//
అయ్యా కడ ఐశ్య్వర్యమడిగీ
అమ్మకడ సౌభగ్యమడిగీ
నెయ్యమున నీ చరణ దాసుల
కీయవా
దేవాధి దేవా/వందనం//

వందనం,వందనం గిరినందినీ ప్రియ నందనా
వందనం కరివదనకరుణా
శరణు నీ పద కమలములకడ //వందనం//
వందనం ముని బృంద
హ్రుదయ
స్యందనా
వెన్నవలె, వెన్నెలలవలె,క్రొన్ననలవలె
మెత్తనిదినీమది
దాతవని శుభ దాతవని,
మా
బ్రతుకునేలే నేతవని విని//వందనం//
అయ్య కడ ఐశ్వర్యమడిగీ
అమ్మకడ సౌభగ్యమడిగీ
నెయ్యమున నీ చరణ దాసుల
కీయవా
దేవాది దేవా/వందనం//

జయ జయ జయ ప్రియ భారత


జయ జయ జయ ప్రియ భారత

జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి జయ జయ జయ
జయ జయ సశ్యామల సు
శ్యామ చల చ్చేలాంచల !
జయవసంత కుసుమలతా
చలిత లలిత చూర్ణ కుంతల
జయమదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా //జయ జయ జయ ప్రియ భారత//

జయదిశంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయగాయక వైతాళిక
గళవిశాల పద విహరణ
జయమదీయ మధురగేయ
చుంబిత సుందరచరణా //జయ జయ జయ ప్రియ భారత//

నారాయణ నారాయణ అల్లా ఆ అల్లా


నారాయణ నారాయణ

నారాయణ నారాయణ అల్లా అల్లా

మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా                        || నారాయణ ||


మతమన్నది నాకంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే

మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు || నారాయణ ||


ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే

కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే

మతం వద్దు గతం వద్దు

మారణ హొమం వద్దు                                            || నారాయణ||


మతమన్నది గాంధీజీ హితమైతే

మతమన్నది లోకానికి హితమైతే

హిందువులం ముస్లిములం

అందరము మానవులం,

అందరమూ సోదరులం                                   || నారాయణ ||

---దేవులపల్లి కృష్ణశాస్త్రి

జయము జయముతల్లీ


జయము జయముతల్లీ
జయము కల్పవల్లీ
పరిమళాల బ్రతుకుపూలుపచరించుము నీదుపూజ // జయము//
గంగాదినదీజలాలపొంగారెడు జీవనాలురంగారెడు నందనమ్ముబంగారము పండుఫలము//జయము//

వేళ యేండ్లు మనిన వెలుగు
బాలబాలికలకు తొడుగ
ఆశయాల కొసలు తాక
అందరకొక జయపతాక//జయము//

ఆటపాట బ్రతుకుపాట
అన్నింటికి మారుతోట
ఆరతిత్తు నీపదాల
అర్పింతుము వందనమ్ము//జయము//


వందనాలూవందనాలూ

వందనాలు వందనాలూ వందనాలూవందనాలూ
అందమైన భరతాంబకు
వందనాలూవందనాలూ

మహిమలతో వెలసినావు
మహిని పేరు బడసినావు
మా ప్రాణము మామానము
మాకు నీవె మా భారతి
వందనాలూవందనాలూ

జయ ధ్వజము నేగిరింతుము
జగతి యందు విహరింతుము
శత్రువు లెదురైన చీల్చి
చెందడగా పోరుతాము //
వందనాలూవందనాలూ//

నీ కోసము జీవింతుము
నీ కోసము మరణిన్తుము

నీ కోసము ఆజీవన మింపారగ
కష్టింతుము
//వందనాలూవందనాలూ//

దండాలు దండాలు రచన శ్రీ.గరిమెళ్ళ సత్యనారయణ గారు

దండాలుదండాలు భారతమాతా
నీ వందుకోని జీవించూ భారత మాతా 2సార్లు.
మూదు వందలేంద్ల కింద భారత మాతా
అల ముంచినోదు దిగినాదే భారత మాతా
ముంచినోదు దిగినాకా భారత మాతా
మా కొంపలన్ని కూలిన యే భారత మాతా // దండాలు దండాలు //
వర్తకాని కంటు వచ్చి భారత మాతా
ఆడు పెత్తనమూ చెసినడే భారత మాతా
సివరికి రాజ్యాలు సెసినడే భారత మాతా
ఆడి జూలె నింపుకున్నడె భారత మాతా// దండాలు దండాలు
ఈత చెట్ల నన్నిటినీ భారత మాతా
ఆడి తాత గాడు పాతినాడా భారత మాతా
మా రాజని మొరబెదితే భారత మాతా
మరి రెందు తన్నమన్నాడే భారత మాతా// దండాలు దండాలు //

గాంధీ మహాత్ము డూ భారతమాతా
నీ ముద్దు కొడుకు ఉండంగా భారతమాతా
కన్నిరూ నీకేలా భారతమాతా
మా కున్న కష్టములు  
తీరూ భారతమాతా

ఈ లోకం లొ



ఈలోకం లో, నా దేశం లో
నా ఇప్పటి దేహం తో
ఎన్నాళ్ళైనా బ్రతకట మిష్టం
ఎపుడు రాలినా  ఇష్టం //
ఈలోకం లొ//

సంసారం సాగరమైతే
జలక్రీడగాజీవనమిష్టం
తిరిగి పుట్టుటకే మరణం ఐతే
మరణం అంటే మరి మరి ఇష్టం //
ఈలోకం లొ//

పొరపాటున మోక్షం వస్తే
పుట్టుక లేకుండా పొతే
ఇలా తలానికి దూరంగా
ఎలాగాన్నదే నాకు భయం //
ఈలోకం లొ//

బాల్యం అంతా ఆటగా
వయసే పున్నమి
బాటగా
మనసే చల్లని మాటగా
బ్రతుకంతా శ్రుతిలో కలిసిన పాటగా నే పాడగా //
ఈలోకం లొ//

( పాట స్వరపరిచింది శ్రీ పాల గుమ్మి విశ్వనాథం గారు )

దత్తమాలా మహామంత్రము

                                           శ్రీ గ ణేశాయ నమ 
                               అధ: దత్తమాలా మహామంత్రము
            అస్యశ్రీ దత్తాత్రేయ మాలా మంత్రస్య: సదాశివ రుషి ;అనుశ్టుప్ చంద;, శ్రీ దత్తాత్త్త్రేయో దేవతా ;ద్రాం బీజం, నమ; ఇతి శక్తి ,దత్తాత్త్త్రేయాయేతి కీలకం  మమ అఙ్నాన   నివ్రుత్తి ద్వారా  ఙ్నాన వైరాగ్య చతుర్విధ పురుషార్ధ సహిత అభీష్ట       కామనా సిధ్యర్ధే  జపే వినియొగ; -

పార్వత్యువాచ 
  
మాలా మంత్రం మమ బ్రూహి ప్రియా యస్మాదహంతవ
శ్రీ  ఈశ్వర  ఉవా
 శ్రుణు   దేవి ప్రవక్షామి  మాలా మంత్ర మనుత్తమం
ఓం నమో  భగవతే దత్తాత్త్రేయాయ
స్మరణ మాత్ర సంతుష్తాయ
మహా భయ నివారణాయ
 మహా ఙ్నాన  ప్రదాయ
చిదానందాత్మనే
బాలోన్మత్త   పిశాచ వేశాయ
మహాయొగినే
 అవధూతాయ
అనసూయానంద వర్ధనాయ
అనఘాయ
ఆనంద వర్ధనాయ
అత్రిపుత్రాయ
సర్వకామ ప్రదాయ
ఓం- భవబంధ మోచనాయ
ఆం- అసాధ్య బంధనాయ
హ్రీం -సర్వ భూతిదాయ
క్రోం-  అసాధ్యాకర్షణాయ
ఐం- వాక్ప్రదాయ
క్లీం- జగత్రయ వశీకరణాయ
 సౌ-;సర్వమన:క్షోభణాయ
శ్రీం - మహా సంపత్ప్రదాయ
గ్లీం -భూమందలాధిపత్యాయ
ద్రాం- చిరంజీవినే
వషట్  వశీకురు వశీకురు
వౌషడాకర్షయా కర్షయ
హుం విద్వేషయ విద్వేషయ
ఫట్ ఉచ్చాటయొచ్చటయ
ఠ: ఠ: -స్తంభయ స్తంభయ
ఖేం  ఖేం -మారయ మారయ
నమస్సంపన్న్నాయ యసంపన్న్నాయ
స్వాహా  పోషయ పోషయ
పరయంత్ర ప్రమంత్రపర తంత్రాణి ఛింది  ఛింది
గ్రహన్న్నివారయ  నివారయ
వ్యాధీన్  వినాశయ వినాశయ
దుఖం హరహర
దారిద్ర్యం విద్రావయ విద్రావయ
దేహం పోషయ పోషయ
చిత్తం తోషయ తోషయ
సర్వ మంత్ర స్వరూపాయ
సర్వ యంత్ర స్వరూపాయ
సర్వ తంత్ర  స్వరూపాయ
సర్వ పల్లవ   స్వరూపాయ
ఒం నమో  మహా సిద్ధాయ  స్వాహా ,
ఓం నమో భగవతే  దత్తత్రేయాయ


మాలా మంత్రము
ఈ మాలా మంత్రం మహ మహిమొపేతమైనది. నలుగువందల పర్యాములు నిష్ట   తో  జపించినత్లైతె సిద్ధి కలుగునని ఉవాచ ; సాధన చేయ దలచిన వారు ప్రతి దినము పదకొండు పర్యాయముల చొప్పున నలభై దినములు పారాయణ చేయనగును  ఇది భక్తుల స్వానుభవములొ తెలిసినది.
                                           
                                                      దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా 
                                                           జై గురు దత్తా సద్గురు దత్తా 

Saturday, October 1, 2011

దేవీ మీనాక్షి ముదం

దేవీ మీనాక్షి ముదం ,దేహిమే   సతతం
 అంబ దేవీ   మీనాక్షి ముదం ,దేహిమె సతతం  మ ప ధ ని //దెవీ//


 పావని మధురా నిలయే పాండ్యరాజ  తనయే 
భావరాగ తాళాధిప  పరిషొభిత నిలయే  
బాగుగ ఫలప్రదాయిని  భక్తలొక  సంధాయిని
సేవక పాపవిమొచని   శ్రికదంబ  వనవాసిని 


      
దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం
అంబ దేవీ మీనాక్షి ముదం ,దేహిమె సతతం


హిమకరణిభ వదనే  అంబా విమలకుంద రదనే ,
 కమనీయా మణిసదనే రాజిత వదనే
సుమశర  కనక సహొదరి, సుందరీశ  హ్రుదయెశ్వరి
 అమరవిదిత నిఖలామణి సాధువ శంకరి,శంకరి 


దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం
అంబ దేవీ మీనాక్షి ముదం ,దేహిమె సతతం  మ ప ధ ని


కమలపాలసుర పాలనరీ అంబా
ఘనతర శుభగుణ  జాలన ,కమలానేత్ర  విమొచని సంగీతవి స సా ని స
దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం
అంబ దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం  మ ప ధ ని 




పెద్దవాళ్ళు పిల్లలకి డబ్బు ఇస్తే ఖర్చు అయిపోతుంది, ఆస్తి ఇస్తే వాళ్ళ మధ్యన కలతలు మొదలౌతాయి. ఆడంబరాలు నేర్పించితే సంస్కారం కుంటు  బడుతుంది. పెద్దవాళ్ళని ఎప్పుడు తలచుకున్నా తమకి ఏదో తక్కువ చేసారనే భావనే ఉంటుంది. కానీ ఇలాంటి విలువ కట్టలేని ఆస్తి కనక పిల్లలకి బాల్యం నిన్చీ ఇవ్వగలిగితే  వాళ్ళని ప్రతి క్షణం, ప్రతీ నిముషం ప్రతి నిత్యం తలుచుకుంటునే ఉంటారు. అలాంటి ఆస్తిని , తర తరాలకి తరగనంతగా మా అమ్మ, నాన్న మాకు ఇచ్చారు. అలాంటి  తలి తండ్రులకి  శతధా సహస్రధా
రుణ పడి ఉండాలని, మల్ళి  జన్మ అంటూ ఉంటే వాళ్ళని అక్కున జేర్చుకుని అమ్మపాడే పాటలతో, నాన్న నేర్పిన సంస్కారం తో లాలించాలని ఉంది. 

సిద్ధ మంగళ స్తోత్రం

 దిగంబరా దిగంబరాశ్రీపాదవల్లభ దిగంబరా

సిద్ధ మంగళ స్తోత్రం 
శ్శ్రీ మదనంత శ్రీవిభూషిత  అప్పల లక్శ్మీనరసింహరాజా 
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ,
,
శ్రీవిద్యాదరి రాధాసురేఖా శ్రీ రాఖీ ధర శ్రీపాదా 
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ

మాతా సుమతీ వాత్సల్యా మృత  పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ

సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యసుత శ్రీచరణా 
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ

సవిత్రు కాఠక చయన  పుణ్యఫల భరద్వాజరుషి గోత్ర సంభవా   ,
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ
,
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోదిత శ్రీచరణా
,జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ

పుణ్య రూపిణీ రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాతా 
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ
,
సుమతీనందన,నరహరి నందన దత్తదేవప్రభు శ్రీపాదా
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండశ్రీ విజయీ భవ

పీఠికాపుర నిత్య  విహారా మధుమతి దత్తా మంగళ రూపా  
జయ విజయీ భవ  దిగ్విజయీభవ శ్రీ మదఖండశ్రీ విజయీ భవ