జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నర నారీ హృదయ నేత్రి జయ జయ జయ
జయ జయ సశ్యామల సు
శ్యామ చల చ్చేలాంచల !
జయవసంత కుసుమలతా
చలిత లలిత చూర్ణ కుంతల
జయమదీయ హృదయాశయ
లాక్షారుణ పదయుగళా //జయ జయ జయ ప్రియ భారత//
జయదిశంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయగాయక వైతాళిక
గళవిశాల పద విహరణ
జయమదీయ మధురగేయ
చుంబిత సుందరచరణా //జయ జయ జయ ప్రియ భారత//
No comments:
Post a Comment