Sunday, October 9, 2011

మావాడి కవిత్వం


                 
ఓ కొత్త జంట ఉరేగుతూంది ,
కొంగొత్త ఆశల   పల్లకిలో ,
సహజీవనానికి పదం  కలుపుతూ  
పెదవి దాటని మందహాసం , 
నవ జీవితం పై కన్న కలలను , 
ఆ కళ్ళలొ మెరిసేటిమెరుపులు,
వర్ణనలకందని  హ్రుదయాల భావాలను
ప్రతిఫలిస్తుండగా  , 
ఆ అనందాన్ని పంచుకుంటున్న సాటివారి మధ్య 
,ఆ కొత్త జంట ఊరేగుతోంది. 

ఓ శవం తన తుది ప్రయాణం చేస్తూంది ,,
ఆ నిర్జీవపు కట్టె   కళ్ళలొ ,
అడియాసలైన ఆశలు  ,
యే భావం లేని  మోములో   తననే నమ్మిన తనవారిని 
మోసం చెసిన అపరాధ భావం ,
ఆగిపొయినా , ఆ గుండె లో జీవం పై మమకారం , 
నమ్మినవాడు నట్టెట ముంచాడనే  నమ్మలేని నిజానికి 
అంత్యక్రియకు జరిపేందుకు 
నా అనే వారంతా నడక మొదలు పెట్టారు 

ఓ ఇరుకు సందులొ ఎదురు పడ్డాయి ఆ రెండూ 


అప్పుడే మొదలైన జీవితానికి ,
ముగిసిపొయిన మరో జీవితం కాసింత దారి ఇచ్చి
తన గమ్యం చూపించింది 

ముగిసిపొయినా తన జీవితం పై 
ఆశ   చావని ఆ శవం కొత్త జంటను చూస్తూ 
కుమిలిపొయింది ,

 తమ ప్రయాణపు  తుది మజిలీ ఎదురుగానే కనిపిస్తున్నా ,
మనసును కమ్మిన మొహపు తెరలు 
ఆ కొత్త జంటను ముందుకు నడిపించాయి 

No comments: