Sunday, February 19, 2012

ఆట గదరా శివా by తనికెళ్ళ భరణి

ఆట గదరా శివా !   ఆట గద కేశవా!!   
ఆట గదరా ! నీకు అమ్మ తోడు !!

ఆట గద గణపతిని తిరిగి బతికించేవు, 
కళ్ళు మూయుట మొదటి ఆట నీకు 


ఆట గద మాయకే మాంగల్యము ను గట్టి 
కామదహనమ్ము సయ్యాట నీకూ 


ఆట బ్రహ్మకు సృష్టి   అంతమే నీ ద్రుష్టి 
విష్ణుమాయలు గూడ  ఆట నీకూ 


ఆట చదువుల తల్లి ,ఆట బంగరువల్లి 
ఆటకద   శ్రీచక్ర సంచారిణీ , 


ఆట గద మార్కండునకు ఆయువొసగేవు
 మ్రుత్యు న్జ యత్వమ్ముఆట నీకూ 


ఆట గదభక్త సిరియా ళునేభుక్తిగొని 
ముక్తి ప్రసాదించు టాట  నీకు 


 ఆట గదరా నీకు ఆది శంకర బోధ 
ఆట గదఅద్వైత సిద్ధాంతము 


ఆట గదరా నీకు చతురంగ ఖేలనం
 జీవులే పావులై ఆట నీకు  


ఆట గదరా నీకు ధూర్జటి కవి పలుకు 
ఆట గద శ్రీకాళహస్తి మహిమ . 


గదరా నీకు కాళిదాసుని కవిత 
సుకుమారసంభవం  బాట నీకు  


 ఆట గదరా నీకు  శ్రీనాథు వైభవం
 ఆట గదరా నీకుహరవిలాసం 


ఆట గదరా నీకు  శన్ముఖునిశివపదం
 ఆట గద  నీకతని ఆర్తి రచన ,


 ఆట గదరా నీకుసాలీడు బూడిదై 
ఆటగద శ్రీకాళహస్తి నీకూ 


ఆట గదరా నీకు పడగ పగిలిన పాము  
ఆట గద శ్రీకాళహస్తి నీకూ 


 ఆట గదరానీకు  హతమైన గజరాజు
 ఆట గద శ్రీకాళహస్తి నీకూ  


ఆట గదరానీకుఅడవిలో లింగమా 
!ఆట గదరానీకు కోయ కన్ను 


ఆట గదరానీకు కీటకమ్ములుగూడ 
 పక్షులకు ఆహరమైనయపుడు  


ఆట గదరా నీకుపక్షి ఆండాలకై
సర్పాలు వృక్షాల బాకువేళ 


ఆట గదరానీకు పాముడగలపైన  
గురి చూసి విసిరేటి   గద్దగోరు . 


ఆట గదరానీకు ఆయువడిగిన పక్షి  
మేనిపై వేలాది కీటకాలు  


ఆట గదరానీకుఅమృతాభి షేకమ్ము 
ఆట గదరానీకు బూది పూత  ,


ఆట గదరానీకు పాషాణమున  జలము 
ఆట గద జలధిలో అగ్నికీల 


ఆట గదరా శివా !ఆట గద కేశవా 
రెండు రూపాలైన  ఒకటే నీవు 


 ఆట గదరా నీకు అన్నపూర్ణ ప్రియా 
ఆకలికి భిక్షాట నాట నీకు 



 ఆటగద జననాలు, ఆట గద మరణాలు 
 మధ్యలో ప్రణయాలు ఆట నీకు  


ఆట గద సొంతాలు ఆట గద పంతాలు 
ఆట గద అంతాలు ఆట నీకు 


ఆట గదరా నలుపు ఆట గదరాతెలుపు 
నలుపు తెలుపుల  గెలుపు ఆట నీకు 


ఆట గదరా మన్ను ఆట గదరామిన్ను 
మధ్యలో ఉంచి ఆడేవు నన్ను 



ఆట గదరానీకు  అర్చించు భక్తులను 
 అష్ట కష్టాల పాల్జేతువీవు, 


ఆట గదరా నీకు వేధించు దుష్టులకు  
వరమిచ్చి మురిసేవు ఆట నీకు



ఆట గదరానీకు వరద హస్తమునుండి
 కనకంబు కన్న్నీరు కలిసి జారు 



ఆట గదరానీకు అభయ హస్తములోన 
ఆత్మా ఆనంద లోకాల దేలు 


ఆట గదరానీకు నెత్తిపై నెలవంక 
ఆట గదరానీకు నిప్పుబొట్టు  


ఆట గదరానీకుకంఠాన  గరళమ్ము
ఆట గద పంచేవు అమృతమ్ము 



ఆట గదరానీకుఅవధూత వేషమ్ము 
ఆట గద అంబ తో కళ్యాణము  


ఆట గదరా నీకు అర్ధనారీశ్వరా 
ఆట గద దాంపత్య అద్వైతము , 


ఆట గదరా నీకు కన్ను చెదిరే కాంతి  
ఆటగద అంతలో కారుమబ్బు 


ఆట గదరా నీకు గాడాంధకార మ్ము
ఆట గదఅందులో బుల్లి వెలుగు .  


ఆట గదమన్మధుని మసిజేసి పూసేవు
కామినుల కన్నులను కాటుకలను 


ఆట గద సొగసైన ఆడ చూపులు గుచ్చ 
సర్వంబుగోల్పోవు సర్వజ్ఞుడు 


ఆట గద సంసార క్షీరసాగర మధన
మాట గద హాలాహలామ్రుతమ్ము


 ఆట గద దాంపత్య బంధాలు పేనేవు 
ఆట గద తుంచేవు అంతలోనే , 

ఆట గదరానీకు ఐశ్వర కారకా
 ఆట గద మా నిత్య దారిద్ర్యము 


ఆట గద ఆయుష్యు నుయ్యాల లూగించి 
పండబెట్టేవు గద పాడె మీద ,, 



ఆట గదరానీకుపంచాక్షరీ ప్రభో!
మౌనమే మంత్రమౌ టాట నీకు 


ఆట గదరానీకు  శృంగారమున దేల్చి
ముంచేవు సంసార సాగరమునా


 ఆట గద రౌద్రమ్ము  ఆట గద శాంతమ్ము 
ఆట గద అద్భుతం బాట నీకు 


ఆట గద  మమ్ములను తోలుబొమ్మలు చేసి 
హాస్యాలు పండించు టాటనీకు నీకు                

ఆట గద అందాని కజ్ఞాన మిచ్చేవు  
జ్ఞాని కోసగేవు  వికృత రుపమూ
 

ఆట గదరా విందు ఆట గదరా పొందు 
కడకు గరళమెమందు ఆటనీకు                   


ఆట గదరా శివా పరనింద జేసేటి 
గురివింద లన్నియునుఆట నీకు 


ఆట గదమనవాడు ఆటగద పైవాడు 
 అందరిని కలిపేది వల్లకాడు  

ఆట గద కరుణతోకారేటి కన్నీటి 
కోసగేవు పన్నీటి పరిమళoబు 


ఆట గదఆర్త రక్షణ కొరకు చిందేటి 
నెత్తురే అత్తరై గుబా ళించు


ఆటగద సర్వమతముల
చాటేటి  మానవత ఆటనీకు , 


ఆట గద మతము మారణ హోమ మైనపుడు  
అగ్నిలో ఆజ్జ్యాలు ఆట నీకు   


ఆట గదసజ్జనుల  తలపులు జలంబులై 
లోకాన జనుల దాహార్తి దీర్చు 


ఆట గదపుణ్యాత్ము లాత్మలె మబ్బులై 
వర్షాలు గురిసి అన్నార్తి దీర్చు


ఆట గదరా నీకు మూడు కన్నుల వాడ 
ఆట గద మాపైని  సీతకన్ను  


ఆటగద కోరికలకొలిమిలో కాల్చేసి
 ఇచ్చేవు వైరాగ్య వైభొగమూ  


ఆట గదరా నీకు రామప్ప కోవెల 
ఆట గదరా నీకు మొండి నంది  


ఆట గదరా నీకు అపురూప శిల్పాల 
అంగ వైకల్యాలు ఆటనీకు 


ఆట గదరానీకుబ్ర్బ్రహ్మాండ మండలం 
ఆట గద పుట్టలో చీమ గుడ్లు 


ఆట గదరా నీకుపసిబిడ్డ పుట్టుక 
ఆట గదరా నీకు అమ్మచావు 

ఆట గద వెండి కొండలపై నివాసంబు  
సాలగ్రమంబు నీ విలాసంబు 

ఆట గదనమకంబు ఆట గద చమకంబు 
ఆట గద ఆనందతాండవంబు  


ఆట గదరా శుద్ధఆత్మనైవేద్యంబు  
ఆట గద నెత్తురుల ఆత్మాహుతి  

ఆట గదరా బతుకుదీప మారిన వెనుక  
ప్రమిదలో చమురోసి ఆటనీకు 

ఆట గదరా నీకుఒక్కటే ఒక్కటని 
ఒక్కటయ్యేవరకు ఆటనీకు

ఆటగద ద్వైతంబు ఆట అద్వైతంబు 
ఒకటి రెండు ఆట నీకు .


ఆట గద మూడు మూర్తులు  గలసి ఒక్కటై 
దత్తత్రయంబైన ఆటనీకు


 ఆట గద మాట వరసకే నాల్గు దిక్కులు 
ఒక్కడివె దిక్కువై ఆటనీకు 

ఆటగద కన్నీటితోపంచ భూతాల
తడిపిజేసిన ఘటములాట నీకు


ఆట అరి షడ్వర్గములమధ్య భ ళ్ళుమను
ఓటి కుండల శబ్దమాట నీకు ,


ఆట గద ఏడేడుజన్మాల పాపాలు
పోగొట్టు అభిషేకమాట నీకు 


ఆట గదర నీకుఅష్టసిద్ధుల సమము
వీభూది  చిటికేడేఆట నీకు


ఆట గదరా నీకునవ నిధుల తుల్యమగు 
మారేడు దళమొకటిఆట నీకు

ఆట గద దశ దిశలసత్య సుందరమైన
శివ నామ మొక్కటేపిక్కటిల్లు ,

ఆట గదరా నీకు మొదలు చివరలు లేక
 మొలచినా లింగమాఆట నీకు

ఆట గద ఉరికేటినీటిని  జుట్టుతో
మూట గట్టిన వైనమాట నీకు ,

ఆట గదరా నీకుఅర్జునునితో పోరు
ఆటగద ఒసగేవుపాశుపతము.

ఆట గదరా హరినిమోహించి మురిసేవు
అయ్యప్ప జన్మంబుఆట నీకు

ఆట గద నిరుపేదఅశ్రు ధారల కరిగి
ఆశువుగ ఉప్పొంగెకనక ధారా ...

ఆటగద కవికిలక్షల అక్షరాలిచ్చి 
భిక్ష మెత్తిన్ చేవుకుక్షి కొరకు


ఆట గదరా శివాసీతమ్మ పై మోజు
ఉసురు దీసెనురావణాసురునకూ ,


 ఆట గదరా  శివాఅన్నదమ్ముల పోరు
అంతమ్ముకురువంశమింతలోనే ,

ఆట గదరా  శివాకృష్ణ లీలలు
పెరిగి పెద్దవైవిశ్వ రూపమ్ము నొందే.


ఆట గదరానీవు నారాయణుండవై 
నరునిమార్చేవుగదగీత చేత .


ఆట గదరానీకుఆధార గ్రహ మాల
ఆటగద అరచేత రుద్రాక్షలు


ఆటగద సద్గుణముఆట గద దుర్గుణము 
నిర్గుణమె   అసలైన ఆటనీకు 

ఆటగద దైవంబు ఆట గద దెయ్యంబు 
రెంటికీ జడిపింతువాట  నీకు

ఆట గదబాల్యమ్ముఆట గదయవ్వనము 
ఓడిపోయిన క్రీడవార్ధక్యము

ఆట పై వేషమ్ములోన   కా వేషమ్ము
నటరాజనీ ముందే నాటకాలు ,


ఆటగద కల్లోలమానస సరోవరం
ఆటగదకన్నీట దేలు హంస


ఆట  డమరుకముతోఆరంభమును జేసి
శంఖ ముదేవుగద అంతమందు,


ఆట గద బ్రతుకంతకాల కూటముగ్రక్క
శుద్ధి జేతువుగదాతులసి నీళ్ళ

 ఆట గదరానీకు అవతారమెత్తేవు
రాయివై సాయివైఆట నీకు

ఆట గదభూమి పైమూడు వంతుల నీరు
మిగతాది కన్నీరుఆట నీకు ,

ఆట గద నా జన్మసార్ధక్య మొనరింప
అప్పగించిన రచనఆట నీకు 


ఆట గదరా వింత శివ తత్వమును కొంత
నా నోట పలికింతువాటనీకు


 ఆట గద నాలోనిఆత్మలింగేశ్వరా
నిత్య రుదిరాభిషేకమ్ము నీకు ,


ఆట గద నాలొనిఆత్మలింగేశ్వరా
కంఠాన వేతునా అస్థి  మాలా 




ఆట గద నాలొనిఆత్మలింగేశ్వరా  
నా శిరమెనారికేళమ్ము  నీకు

ఆట గదనాలొని ఆత్మలింగేశ్వరా
ఊపిరులె అగరుధూపములు నీకు 


 ఆట గద నాలొనిఆత్మ లింగేశ్వరా
నేత్రములెనేతి దీపాలు నీకు  


ఆట గద నాలొనిఆత్మ లింగేశ్వరా 
ఆరు చక్రాలె పుస్పాలు  నీకు


 ఆట గద నాలొని ఆత్మ లింగేశ్వరా
 కుండలిని    యగ్నొపవీత మీకు



 ఆట గద నాలొనిఆత్మ లింగేశ్వర
బూడిదై నెనువీబూదిపూతు



6 comments:

Yogeshwar Khandesh said...

నమస్తే

తనికెళ్ళ భరణి గారు రచించిన " శృంగార గంగావతరణం " ని అందిచగలరని పార్థన

ఎందుకో ? ఏమో ! said...

great job అండీ ఇప్పుడే "ఆట గదరా శివ ఆట గద కేశవా " song మిథునం మూవీ లో పెట్టారు వింటూ lyrics type చేస్తూ already ఎవరైనా పెట్టారేమో అని చూస్తుంటే మీ ఈ blog కనిపించినది
సంతోషం
సరే ఆ పాటని ఇక్కడ వినగలరు

http://downloads.ziddu.com/downloadfile/19429107/05-AataKadaJananalu.mp3.html

or

http://www.divshare.com/download/17812676-090

ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా

ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకు

ఆట గద సొంతాలు
ఆట గద పంతాలు -2
ఆట గద అంతాలు
ఆట నీకు

ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా

ఆట గదరా నలుపు
ఆట గదరా తెలుపు
నలుపు తెలుపుల గెలుపు
ఆట నీకు

ఆట గదరా మన్ను
ఆట గదరా మిన్ను - 2
మిత్యలో ఉంచి ఆడేవు నన్ను

ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా

ఎందుకో ? ఏమో ! said...

great job అండీ ఇప్పుడే "ఆట గదరా శివ ఆట గద కేశవా " song మిథునం మూవీ లో పెట్టారు వింటూ lyrics type చేస్తూ already ఎవరైనా పెట్టారేమో అని చూస్తుంటే మీ ఈ blog కనిపించినది
సంతోషం
సరే ఆ పాటని ఇక్కడ వినగలరు
http://www.divshare.com/download/17812676-090

ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా

ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకు

ఆట గద సొంతాలు
ఆట గద పంతాలు -2
ఆట గద అంతాలు
ఆట నీకు

ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా

ఆట గదరా నలుపు
ఆట గదరా తెలుపు
నలుపు తెలుపుల గెలుపు
ఆట నీకు

ఆట గదరా మన్ను
ఆట గదరా మిన్ను - 2
మిత్యలో ఉంచి ఆడేవు నన్ను

ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ ఆట గద కేశవా
ఆట గదరా శివ నీకు అమ్మ తోడు
ఆట గదరా శివ ఆట గద కేశవా

ఎందుకో ? ఏమో ! said...

http://youtu.be/_sgr2jIc3Ss

Srinivas Nandi said...

శ్రీ తనికెళ్ళ భరణి గారి శృంగార గంగావతరణం
https://plus.google.com/103111434571997124019/posts/TmHipvYv7Ny

trs said...

www.4job.in ***** www.indiaonlines.in