Tuesday, October 11, 2011

Dr. AndeSRI - Maayamaipothunnadamma

Dr. AndeSRI - Maayamaipothunnadamma

మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ ,
మచ్చుకైనా లేడు చూడూ, మానవత్వము ఉన్న వాడూ
,నూటికో, కొటికో ఒక్కడే ఒక్కడు ,
యాడ ఉన్నడొ గాని కంటికే కనరాడు //మాయమై పొతున్నడమ్మో//

నిలువెత్తుస్వా ర్థమూ నీడలా ఉన్నపుడు,
చెడిపోక యేమైతడమ్మో 
ఆత్మీయ బంధాలు, ప్రేమ సంబంధాలు,
తెగనాడుతున్నడొ యమ్మా ,
అవినీతి, పెను ఆశ , అంధకారము లో
చిక్కిపోయి లోన శిధిలమౌతున్నాడు       //మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ //

ఒక్క దెవున్ని రెండు రూపాలుగా గొలిసి
, పంది, నందిని జూసె పడిపొర్లుతుంతాడు
, సీమలకు సక్కెరా, పాములకు పాలోసి
, జీవకారుణ్యమె జీవితమ్మంటాడు ,
తొడ బుట్టిన వా ళ్ళ  ఉసురూ తగిలీపెట్టి ,
కులమంటు ఇల మీద కలహాలు రగిలేసి //మాయమై పొతున్నడమ్మో ,//
మయ్యర్పితమ్మన్న  అర్ధమేమో తెలియక ,
అంధుడై పోతున్నడమ్మో ,
హిందు ముస్లిము క్రీస్తు సిక్కు పార్సీ యంటు ,
తన్ను తా మరిచెనొ యమ్మా ,
మతము లొక హితముము అన్న మాట మరిచి ,
మత ఘర్షణల మధ్య మణిషి కనుమరుగౌతు //మాయమై పొతున్నడమ్మో//


  ఇరువయైదు  పైసలగరువత్తులు గాల్చి 
 అరవై ఇదు కొట్ల  వరమడుగుతాడు ,
దైవాల పేరుతో  చందాలకైదండ ,
భక్తి ముసుగూ దొడిగి  బలె పోజు పెడతాడు ,
ముక్తి పేరు గ  నోళ్ల రక్తి లో దాగి, ,
రాకాశి రూపాన రంజిల్లుతుంటాదు //మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ /

/అవసరాలకు మనిషి స్రుస్టించి రుపాయి
  సుట్టుదిరుగూతాడమ్మా
రూపాయి కొరకు యె పాపాన్నైయితె యేమి ,
ఒడిన గత్తే నదిగొ చూడమ్మా
, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి
, కోట్లకూ పడగెత్త కోర్కెలూ చెలరెగ,//మాయమై పొతున్నడమ్మో , మనిషిన్నవాడూ

కళ్ళ పొరలూ గమ్మ ,  కామమ్ముతో రేగి
 వెకిలి చేశ్టలతొటి  వేధిస్తు ఉన్నాడు ,
కన్న వాళ్ళకు రోజు కన్నీళ్లె మిగిలించి
, కౌగిళ్ళె స్వర్గమని కలలు గంటుంటాడు
,,సీకటయితే సాలు చిత్తుగా తాగేసి
పాపి మరుకలు కాస్త మరిచిపొతు నరుడు //మాయమై పొతున్నడమ్మో//   

No comments: