Sunday, October 9, 2011

కరుణించితే చాలు కనకాభి షేకాలు ;రచన ... డి.హరనాథ్

                          
                       కరుణించితే చాలు   కనకాభి షేకాలు   
                        కురిపించు దేవీ    నీ కిదే మంగ ళం
                       శరణూ   వేడితె చాలు  శతకోటి దీవెనల
                       వరమూలిచ్చెదేవి  కిదె  మంగళం  //    కరుణించి //

                      రహిపుట్టు రాగాల    రాతినే కరగించు
                     సంగీతరాణి నీకిదె మంగళం
                     నవనీత హ్రుదయాల    రసగీతి పలికించు
                     పదసంపదల దేవి  కిదె మంగళం  //కరుణించి// 
                    పలుకుతెనేల ఊట   కవులా కమ్మని నోట
                    ఒలికించు దేవీ నీకిదె మంగళం
                   కరవాలమునకైనశిరసూ వంచని మేటి
                  కవిలోక శక్తీ నీకిదే మంగ ళం    //కరుణించి//

                  రసనపై తా నిలిచి రచనగా తా వెలిసి
                  కుసుమించు దేవీ నీకిదె మంగళం
                  జయభారతీదేవి జయమంగళం
                  శ్రీ శారదా  దేవి శుభమంగళం   //కరుణించి//
                ఆ మధ్యనొక సారి ఒంట్లో బాగా లేక శివరాంపల్లి లో ఉన్న కస్తూరిబా ప్రక్రుతి వైద్యశాల లో మూడురోజులు ఉన్నాను . మేమున్న రూం ప్రక్క రూం లో హరనాథ్ గారి అమ్మగారు వైద్యం కోసం ఉన్నారు. ఆవిడ గొంతులో విన్న ఈ పాట ఇంకా నా చెవుల్లో మారుమోగుతోంది  .

No comments: