Monday, July 23, 2012

 

 

శ్రావణ మంగళ వారం పాట.

ఈశ్వరా పుత్రునకు , గజావ తారునకుపార్వతీ తనయునకు భక్తి తోనూ
వాక్కు శుద్ధీ నిచ్చు వైభోగ రాయునకు శారదాంబనునేను సన్నుతింతూ
మంగళా గౌరి తా మహిమీద వెలసినా పాట గావించెదా భక్తి తోనూ
జయమంగళం నిత్య షుభమంగళం


మహిమీద ఒకరాజు సంతానము లేక , సౌభగ్య పదవి తానేలుచుండే
పరమెశ్వరుడు తన ఆత్మలో హర్షించి , ఇహపరాదులు వారికిత్తమనుచూ
లింగంబు తానొక్క జంగమవతారమై, గురుధర్మ ఘోరాండమనుచు వచ్చే
మేడమీదానుంచి దిగివచ్చి ఆ సతీ బంగారుపళ్లెముతో నాణెములనూ
వారి భక్తికి మెచ్చి పరమెశ్వరుడు తాను , ప్రత్యక్షమాయెనూ రాజుకపుడూ
ఇచ్చితిని ఒక వరము మెచ్చితిని పొమ్మనగ , స్త్రీజన్మమా పురుష జన్మమనగా
ధర్మవతియైనట్టి పుణ్యవతి నిత్తునా పదహారు వస్సరముల సుతునిత్తునా అని వారి నడిగెనూ ఈశ్వరుండూ
సతిపతు లిద్దరూ సమకూర్చుకుని తాము పరమేష్టి తో వారు భాషించిరీ
ఢర్మవతినీ చూసి తాళలేము మేము , పుణ్యమేమో గానీ పుత్రుడనెనూ


ఊరికీ ముందరా కాళికా గుడి వెనక చూతవ్రుక్షమునందు ఫలమున్నదీ
ఆ ఫలము తెచ్చుకుని భుజియింపుమని పలికి అంతర్ఢానుడాయెనూ ఆదేvuduu




పణతి రాగా చూచి పరమెశ్వరుడు తాను నిముషంబు నిలువకా పొయెనపుడూ


ఇది యేమి చొద్యమో యెరుగంగ వలెననీ , మరుదినమునాటికీ ముందుగానూ
మరుగుచాటున ఆమె కాచుకొని ఉండగా , గంటలూమ్రోగుచూ వచ్చెశివుడూ .
వచ్చినా జంగాన్ని పోనీక పట్టుకొని ఇది యెమి కారణమ్మని అడిగెనూ


పుత్రపౌత్రులు లేరు మే చెతి బిక్షమ్ము , హరహరా అంటరాదని పలికెనూ
మాకేది గతి యనచు సతిపతులిద్దరూ సాస్టాంగమొసగిరీ శివునికపుడూ
పరమెశ్వరుని గూర్చి తపస్సు చెయమని ఆనతిచ్చి పొయెనూ ఆ జంగమూ
//జయమంగళం నిత్య షుభమంగళం//
సతిపతులిద్దరూ రాజ్యభొగమ్ము విడచి , పరమెశ్వరునిగూర్చి తపస్సు చెయా
 //జయమంగళం నిత్య షుభమంగళం//

No comments: