Sunday, October 14, 2012

ఈ బతుకమ్మ పాట పాడుకుందాం

  
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
 బంగారు గౌరమ్మ ఉయ్యాలో 
మా వూరి జనమెల్ల  ఉయ్యాలో
 నిన్ను గోలిచేమమ్మ ఉయ్యాలో 

సల్లంగా గాపాడు ఉయ్యాలో
తల్లి మా బతుకమ్మ ఉయ్యాలో 
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
 బంగారు గౌరమ్మ ఉయ్యాలో 

రంగు రంగుల పూలు ఉయ్యాలో
  సింగారము జేసి  ఉయ్యాలో
నీ సుట్టు దిరిగేము  ఉయ్యాలో,
నిన్ను మొక్కేమమ్మ  ఉయ్యాలో

గునుగు పూ వుల  తోడ   ఉయ్యాలో
గుమ్మాడి పూల తో  ఉయ్యాలో
నిన్ను కూర్చేమమ్మ  ఉయ్యాలో
నిన్ను గోలిచేమమ్మ  ఉయ్యాలో

బీర  పూలు దెచ్చి  ఉయ్యాలో
బాగనిను పెర్చేము  ఉయ్యాలో
తంగేడు పూలతో  ఉయ్యాలో
తాంబాలములోన  ఉయ్యాలో
నిన్ను కూర్చేమమ్మ  ఉయ్యాలో
నిన్ను గోలిచేమమ్మ  ఉయ్యాలో
గన్నేరు  పూల తో  ఉయ్యాలో
మిన్నంటే నీ సోకు ఉయ్యాలో 

మా బ్రతుకులను మార్చు ఉయ్యాలో
మా బతుకే నీవమ్మ  ఉయ్యాలో
తంగేడు పూల తో  ఉయ్యాలో
నీ తనువెల్ల మెరిసింది  ఉయ్యాలో

పచ్చన్ని నీ మేను  ఉయ్యాలో
 పసిడి లా మెరిసింది  ఉయ్యాలో
నీ సోకు జుసిమే  ముయ్యాలో
సుగ ఆట లాడి తిమి  ఉయ్యాలో

నీ అందమే మాకు ఉయ్యాలో
కోట్లు లక్షల బలము ఉయ్యాలో
నీ అండ ఏ మాకు ఉయ్యాలో
బ్రతుకెల్ల  బలిమమ్మ ఉయ్యాలో


No comments: