Tuesday, October 11, 2011

జయ జయహే తెలంగాణ


                                Dr.Andesri

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
తరతరాల చరితగల తల్లీ నీరాజనం

పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం..జై తెలంగాణ – జై జై తెలంగాణ


పోతన దీ  పురిటిగడ్డ, రుద్రమదీ  వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గొలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్ మినార్...జై తెలంగాణ – జై జై తెలంగాణ


జానపద జన జీవన జావలీలు జాలువారే
కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం...జై తెలంగాణ – జై జై తెలంగాణ


సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున  ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వన సంపద సక్కనైన పూవుల పొద
సిరులు పండే సారమున్న మాగాణి కరములీయ...జై తెలంగాణ – జై జై తెలంగాణ


గొదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాలై  పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలీ
స్వరాష్ట్ర్రమై తెలంగాణ స్వర్ణ యుగం కావాలి..జై తెలంగాణ – జై జై తెలంగాణ


1 comment:

Kesari said...

చాలా బాగుంది.... ! అందించినందుకు థాంక్స్..!