Saturday, October 1, 2011

దేవీ మీనాక్షి ముదం

దేవీ మీనాక్షి ముదం ,దేహిమే   సతతం
 అంబ దేవీ   మీనాక్షి ముదం ,దేహిమె సతతం  మ ప ధ ని //దెవీ//


 పావని మధురా నిలయే పాండ్యరాజ  తనయే 
భావరాగ తాళాధిప  పరిషొభిత నిలయే  
బాగుగ ఫలప్రదాయిని  భక్తలొక  సంధాయిని
సేవక పాపవిమొచని   శ్రికదంబ  వనవాసిని 


      
దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం
అంబ దేవీ మీనాక్షి ముదం ,దేహిమె సతతం


హిమకరణిభ వదనే  అంబా విమలకుంద రదనే ,
 కమనీయా మణిసదనే రాజిత వదనే
సుమశర  కనక సహొదరి, సుందరీశ  హ్రుదయెశ్వరి
 అమరవిదిత నిఖలామణి సాధువ శంకరి,శంకరి 


దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం
అంబ దేవీ మీనాక్షి ముదం ,దేహిమె సతతం  మ ప ధ ని


కమలపాలసుర పాలనరీ అంబా
ఘనతర శుభగుణ  జాలన ,కమలానేత్ర  విమొచని సంగీతవి స సా ని స
దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం
అంబ దేవీ  మీనాక్షి ముదం ,దేహిమె సతతం  మ ప ధ ని 




పెద్దవాళ్ళు పిల్లలకి డబ్బు ఇస్తే ఖర్చు అయిపోతుంది, ఆస్తి ఇస్తే వాళ్ళ మధ్యన కలతలు మొదలౌతాయి. ఆడంబరాలు నేర్పించితే సంస్కారం కుంటు  బడుతుంది. పెద్దవాళ్ళని ఎప్పుడు తలచుకున్నా తమకి ఏదో తక్కువ చేసారనే భావనే ఉంటుంది. కానీ ఇలాంటి విలువ కట్టలేని ఆస్తి కనక పిల్లలకి బాల్యం నిన్చీ ఇవ్వగలిగితే  వాళ్ళని ప్రతి క్షణం, ప్రతీ నిముషం ప్రతి నిత్యం తలుచుకుంటునే ఉంటారు. అలాంటి ఆస్తిని , తర తరాలకి తరగనంతగా మా అమ్మ, నాన్న మాకు ఇచ్చారు. అలాంటి  తలి తండ్రులకి  శతధా సహస్రధా
రుణ పడి ఉండాలని, మల్ళి  జన్మ అంటూ ఉంటే వాళ్ళని అక్కున జేర్చుకుని అమ్మపాడే పాటలతో, నాన్న నేర్పిన సంస్కారం తో లాలించాలని ఉంది. 

No comments: