Sunday, October 9, 2011

ఏమేమి పూవొప్పునే గౌరమ్మ




ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే  ,
తంగేడు పూవొప్పునే గౌతమ్మ తంగేడు కాయొప్పునే  ,
తంగేడు పూవులో తంగేడు కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే  ,
                                                                                 //ఏమేమి పూవొప్పునే //
తెలుగింటి  పూవొప్పునేగౌరమ్మ తెలుగింటి  కాయొప్పునే
తెలుగింటి పూవులో, తెలుగుంటి కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే
                                                                                //,ఏమేమి పూవొప్పునే //
ఉమ్మెత్త పూవొప్పునే గౌరమ్మ ఉమ్మెత్త కాయొప్పునే ,
ఉమ్మెత్త పూవులో, ఉమ్మెత్త కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
ఏమేమి పూవొప్పునే  గౌరమ్మ ఏమెమి కాయొప్పునే ,
                                                                              //ఏమేమి పూవొప్పునే//
జిల్లెడు పువొప్పునే గౌరమ్మ
జిల్లేడు కాయొప్పునే
జిల్లేడు పూవులో  జిల్లేడుకాయలో
 ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ
 కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
                                                                           // ఏమేమి పూవొప్పునే //
దాశానం పువ్వుఒప్పునే గౌరమ్మ
 దాశానం కాయొప్పునే
దాశానం  పూవులో  దాశానం కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ
, కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
                                                                                   //ఏమేమి పూవొప్పునే  // ,
గుమ్మాడీ  పూవొప్పునే  గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే
గుమ్మాడీ పూవులో, గుమ్మాడీ కాయలో
  ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో,
                                                                           //ఏమేమి పూవొప్పునే  // ,
గన్నేరూ పూవొప్పునే
గన్నేరు కాయొప్పునే
గన్నేరూ పూవులొ  గన్నేరూ కాయలో
ఆటచిలుకలూ రెండు పాట చిలుకలూ రెండూ ,
కలికి చిలుకలూ రెండూ కందువా మేడలో   , //  ఏమేమి పూవొప్పునే//   ,

No comments: