అన్నలారా రండి మన
అమ్మ నుడి వినండి
ముందున్న పని గనండి
ఎమన్నా దడియకండి // అన్నలారా రండి //
పర ప్రభుతను ద్రోల ,
అల బాధ్యతల సురగ్రోలా
వరసిరులను ఏల
అనువైన అదను చాలా // అన్నలారా రండి //
ఆంగ్ల బిరుదు మాని
తల అంగ్లసేవ మానీ
ఆంగ్ల తొత్తు మానీ
అల అంగ్లేయత మానీ // అన్నలారా రండి //
కొట్ట తిట్టవద్దు మరి గోణగ సణగ వద్దూ
పట్టు దలను గూడు
డిల పంతమేల్ల మీరు // అన్నలారా రండి //
కత్తి భయము మానీ అల
సత్తెము చేబూని
ఆత్మబలము బూని
తరలి రండి మాతృ ముక్తీ
No comments:
Post a Comment