Friday, September 30, 2011

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
 బంగారు బతుకియ్యి ఉయ్యాలో 

నాగుల   పంచమి   ఉయ్యాలో
నేనోక్కపోద్దుంటి  ఉయ్యాలో

మా  ఇంట్లఅందరు  ఉయ్యాలో
 దశిమొక్కపోద్ద మ్మ  ఉయ్యాలో

పసుపు బెట్టి  నీలు   పోసి  ఉయ్యాలో
పట్టు  వొల్లె  గట్టి  ఉయ్యాలో

పట్టు  మొగ్గల  రవికె  ఉయ్యాలో
పేయి  నిండా  తొడిగి  ఉయ్యాలో

వొప్పిన  పేలాలు  ఉయ్యాలో
ఒడినిండ పోసుకొని  ఉయ్యాలో

చిలకల  జెలి  చెంబు  ఉయ్యాలో
చేత  పట్టుకొని  ఉయ్యాలో 

పోయిరే అమ్మల్లు   ఉయ్యాలో 
పుట్ట  న పాలుబొయ్య   ఉయ్యాలో

పుట్ట  నోమితినమ్మ  ఉయ్యాలో 
పుట్టింటి  సలువకు  ఉయ్యాలో  

అరుగు  నోమితినమ్మ  ఉయ్యాలో 
అన్నల ఆయుసుకు  ఉయ్యాలో

చవితి పండుగ జేస్తి ఉయ్యాలో 
కడుపు సలువ కొరకు  ఉయ్యాలో                          

ఉసిరి   చెట్టు  కింద  ఉయ్యాలో 
బుసకొట్టే ఒక పాము  ఉయ్యాలో

ఆ  పాము ననుజూసి   ఉయ్యాలో
పడగ లేపిందమ్మఉయ్యాలో

పడగ   ఎత్తకు  నాగ  ఉయ్యాలో 
పగవోల్లమే   కాము   ఉయ్యాలో

ఆ  పాము  నను   జూసి    ఉయ్యాలో  
గుడ్లు  తిప్పింది  ఉయ్యాలో 

గుడ్లు  తిప్పకు  నాగ  ఉయ్యాలో  
గోడ్డుదానిని కాను  ఉయ్యాలో

ఆ  పాము  నను  జూసి    ఉయ్యాలో 
నడుము  తిప్పింది  ఉయ్యాలో

నడుము  తిప్పకు  నాగ  ఉయ్యాలో
నడిపి  చెల్లెను నేను   ఉయ్యాలో

ఆ  పాము  నను  జూసి  ఉయ్యాలో 
తోక  తిప్పింది  ఉయ్యాలో

తోక  తిప్పకు  నాగ   ఉయ్యాలో  
తోటి సెల్లెను నేను     ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
 బంగారు బతుకియ్యి ఉయ్యాలో

1 comment:

వనజ తాతినేని/VanajaTatineni said...

బతుకమ్మ బతుకమ్మ సాహిత్యం చాలా బాగుంది. చైతన్యవంతంగా ఉంది. పరిచయం చేసినందులకు ధన్యవాదములు.