Monday, February 28, 2011

Shiva Ashtottara Shatanamavali - 108 Names of Lord Shiva

How to Perform Rudrabhishekam(Audio) : Instructions in English Part 1

Saturday, February 12, 2011

కొమ్మలో కోయిలా

         ఈ  మధ్యన  చెవులు  మారు  మ్రోగి  పోయేలా  వింటున్న  పాటలు  తప్ప  భావ  గీతాలని   అస్సలు   పట్టించు  కోవట్లేదని  నా  వ్యక్తీ గత అభిప్రాయం. ఒక్క సారి  ఈ పాటని చూడండి    నండూరి వారు ఎంత బాగా వ్రాసారో 

      కొమ్మలో కోయిలా . కూ అంటదే ,2
     రాగతనమో ఏమో  బాగు ఒగేరుగదే..2
     కొమ్మలో కోయిలా . కూ అంటదే 

    ఎంకి దూరానుండి  ఏటి దరి నేనుంటే 
    సావాసా మింకెవరో  సంద దెవరో నంట.. 2 సంద దెవరో నంట
    కొమ్మలో కోయిలా . కూ అంటదే ,2  

    ఏటి ఒడ్డున దాగి  తోట నిదు రోయింది 
   ఏటి ఒడ్డున దాగి  తోట నిదు రోయింది 
   ఆడిందే ఆటగా పాడిందే పాటగా   , పాడిందే పాటగా... కొమ్మ 

   పూలెరుగు నా కూత  నీరెరుగు నా మ్రోత  ..౨ 
   మనుగడల కేవరితో మనసు కలిపే దంటే ..
   మనుగడల కేవరితో మనసు కలిపే దంటే ..
   మనసు కలిపే దంటే .... కొమ్మలో  కోయిలా.......కూ..ఉ                    ....అంటదే

Friday, February 11, 2011

విష్ణు,యీశ్వర,బ్రహ్మ

                      విష్ణు,యీశ్వర,బ్రహ్మ ముగ్గురూ 
                      అన్న దమ్ములంట
                      ఈ భూదేవి ఆకాశవాణి కి 
                       వీరే కర్త లంట
     1)              వారి మహిమ తో చేసిరీ ఒక 
                      మట్టి బొమ్మ నంట
                     ఈ తొమ్మిది కిటుకుల దర్వాజాలూ 
                      మాటలాడుకుంట
  2)                 వస్తా వట్టిదే, పోతా వట్టిదే
                       ధర్మము తన వెంట, 
                      సాంబ శివుడు నిను పిలువ నంపి నడు
                     జల్ది గ  రమ్మంట 
 3)                 చేతిలొ బెల్లం   ఉన్నంత సేపే 
                     కాకి బలగ మంట 
                     చేతిలొ బెల్లం సరి పోయినాక 
                     ఎవరు రారు వెంట 
4)                 ఇంటి  ముంగిట పిల్ల మేకలు 
                    ఇల్లు బలగ మంట
                    ఏడ్చే వారు, మరి ఆర్చే వారూ
                    ఎవరు రారు వెంట
 5)                తొలినాడు యములోడంపే  కింకరుల 
                    గుంజుకు రమ్మంట 
                    యములోల్లంతా వెంట నడిచినరు
                    ఆరూళ్ళు తెమ్మంటా 
౬)                చిన్నలు, పాడడాలు కుచున్నారూ 
                   చింతలు పడుకుంట
                  నీళ్లుబోసి కూర్చుండ బెట్టినరు
                  మాయ బొమ్మ నంట

౭)              పువ్వుల దండలు వేసినారయా 
                మాయ బొమ్మకంట 
                దింపుడు కళ్లము కాడ  దింపినరు
                మాయ బొమ్మ నంట

8)             సొమ్ము సమస్తము తీసుకొనీ 
                పోతరు వారంతా   
                గురువు పోస్తడు శంఖు తీర్థమూ 
               ముక్తి ఫలము కంటా
౯)           మంట్లో  మన్ను కలిపినారు,   మాయబొమ్మ నంట 
              ధన ధాన్యంబులు ఎవరి పదార్ధము   ధర్మమే తనవెంట
              చేసిన పుణ్యము ,పాప కర్మములె 
              వచ్చును తన వెంట 
౧౦)         ఒంట్లో సత్తువ ఉన్నంత సేపే 
              ఉంది నీకు జంటా
              ఆ ఒంట్లో సత్తువ సన్నగిల్లితే 
              ఎవరు రారు వెంట 
౧౧)        ప్రమిద లో నూనెలు ఉన్నంత సేపే 
            దివ్వె వెలుగు లంతా 
            ఆ ప్రమిద లో నునే అయిపోయినాకా 
           దీప మారునంట
          
౧౨)     ధన ధాన్యాలు, భోగ  భాగ్యములు
          క్షణిక సుఖము లంట
          సెర్లో సేపలు సేల్లిపోగనే
          కొంగ లొల్ల వంట  

Tuesday, February 8, 2011

నరస దాసు కీర్తన

               
                  కేశవ,గోవింద,మాధవా యని కీర్తన సేయుట ఎన్నటికో, 
                   నాశము లెనీ మోక్షము నొందుట నారాయణ ణయా కెన్నటికో 

                 భక్తి, మృదంగము, తాళాదులతో భజనలు చేసే దెన్నటికో,
                శక్తి మీరగా, నృత్యము సేయుట సారసాక్ష నా కెన్నటికో 

                 పూవులతొనీ  పాదంబులకూ  పూజలు చేసే దెన్నటికో 
                 నైవేద్యము నిడి పరమ భక్తి ని పాటించుట నా కెన్నటికో

                 పాహి,పాహియని పరమ పురుష నీ పాదంబుల బడు టెన్నటికో
                 దేహి,దేహి యని నీ కృప కోర కై  దేవురులాడే దెన్నటికో 

                   రామదాసులను బ్రోచునట్లు  సం రక్షణ చేసే దెన్నటికో, 
                   భామా మణి ఆ జానకి తో వచ్చి బాసలు చేసే దెన్నటికో,

                   దాస దాసు డగు నరస దాసుడను , దాసుగా నేలె దెన్నటికో,
                   భాస సమాను నివాస రామునా వందనము గొను టెన్నటికో 

                    కేశవ,గోవింద,మాధవా యని కీర్తన సేయుట ఎన్నటికో, 
                   నాశము లెనీ మోక్షము నొందుట నారాయణ ణయా కెన్నటికో

Monday, February 7, 2011

విరాట పర్వము

                                              
                                                          
                                                              శ్రీ.మహా గణాది   పతయే    నమః

                     వ. అప్పుడా గణపతి కి మొక్కి ,శ్రీ కృష్ణమూర్తి వారి పాదారవిందములకు మొక్కి ,వ్యసుదేవుడు 
              మొదలగు మహారుషుల   పాదములకు మొక్కి, , అప్పుడా జనమే జయులు , వైశంపాయనుల వారితో 
            , మరి యేమని పల్కిన వారైరి

                                                                     ఆట తాళం
                     పుడమి ఏలిన పాండు పుత్రులు,  అడవి యెలిరి అంతలో ,   మరి విరాటుని నగరు చేరిన 
                కథలు విందున్ ,  మణియ కీచకి  మరణ మొందినా, అంత  ద్రౌపతి  పాండు పుత్రులు ,  
                అవధి దాటిన కథలు తెల్పుడీ  అర్థి విందున్ ,
                            అనచు జనమేజుయులు    పలుకగా అపుడు వైశంపాయనులు ఇట్లు పలికెను.
               పరమపావన పాండు పుత్రులా పుణ్య కథలూ ,రాజకువలుడు   మొక్కి యడుగగా,,
               రాజు వైశంపాయును పలికెను    పరమ పావన పాండుపుత్రుల   పుణ్య కథలూ
     
                                                                     ద్విపద..

                     శ్రిమంతులై ఉన్ద్రు, ధీరులై ఉన్ద్రూ , తాపసు లై ఉన్ద్రు ,సకల జేవులాకూ, సత్యమ్ము తప్పరే,
           
        ధర్మ నందనులు, తనపాలి    ధర్మంబు  తన్ను పోనియాడు. , దుర్యోధనుండు వాడు, పాప ఖర్ముండు.
 
       పన్నిన్చేనే వాడు మాయ పన్నాగంము   కల్పించేనే వాడు, కపట జూదమ్ము,    దుర్యోధనుని తోటి

       జుదమ్ములాడీ  కొలువు వార్నీ వోడే,    గుర్రాల  నోడే  ,  అతి  రదుల  నోడంగ మహా రధులు వోడే 

,     దొడ్డ వస్తువులు వోడే దొర తనము వోడీ , తన వార్ని వోడంగ, తన భూము లోడే,  తాను 
  
      తమ్ముల న నోడె , ద్రౌపదిని వోడే,  ఏనుగులు వోడంగ మాన్యములు వోడే   అడవి పన్నెండేండ్లు 

        ఆ వెషమునానూ , గజ పురము విడీచియో, కానలు గడిచి ,  అడవి పన్నెండేండ్లు అడవి గడచి 
             
        రపుడు ,  అజ్ఞాత వాసమ్ము  అది ఒక్క యెడూ ,  ఎటు వలె గడతు మని ధర్మ నంద నులూ ,  

       మాయ వేషమ్ము నా మరి ఒక్క యెడూ  ఇటువలె ఉండవలె నని పల్కి రపుడు , విరాట్రాజు ని 
    
       కోలుతామనివీర శెఖరూలూ   

                           //వ//అప్పుడా  సఖి, అనుజులు సహితంబు గా , దీన వేష ధారులై  

                                 శమీ వ్రుక్షమ్ము దగ్గరికి వచ్చి  తమ, తమ ఆయుధమ్ములు 

                               శమీ వృక్షానికి కట్టి ఉంచి, విరాట్రాజు కొలువుకు వచ్చి , విరాట్రాజు 
                              మీరెటు వలె ఉంటారని  అడిగినప్పటికి, విరాట్రాజు తో ధర్మ రాజు 

                             మర్నేమని పలికిన వారైరీ. 
         
                                                                   జంపె తాళం

ఆడబడుచు

            
            సాధారణం గా మన కుటుంబాల్లో ఏ సందర్భాల్లో నైనా ఆడబడుచు కిచ్చే స్థానం చాలా గొప్పది. 
ఒకప్పటి రోజుల్లో ఆడ పిల్లల్లు చదువు లేక , సంపాదన లేక అటు అత్తింటి వారి మీద, భర్త మీద ఆధారపడే వాళ్ళు.
         కుటుంబం లోఏన్నిఅవసరాలు ఉన్నా ఎవరి మీదో ఒకరి దయ , దాక్షిణ్యాల మీద ఆదారపడ వలసి వచ్చే 
మాట. అలాంటప్పుడు, పెళ్లి సమయం లో ఆ అమ్మాయి పేరు మీద స్త్రీ ధనం  అంటూ కొంత ఆస్తి కానీ,
కొంత ధనం కానీ, ఇంకా ఉంటె నగలు, నాణ్యాలు ఆ అమ్మాయి  జీవిత కాలం ఒకరి మీద ఆధార పడకుండా
ఉండేలా తల్లి తండ్రులు ఏర్పాటు చేసే వారు. 
             
         అది ఈ  కాలం లో  అయితే రానురాను  డిమాండ్ చేసి కట్నం అడిగే స్తాయి కి చేరుకుంది. 
                   
        ఇక్కడ గ్రహించాల్సిన్దేంటంటే తీసుకోవడం తప్పు కాదు, ఇవ్వడం బాధ్యత, 
తల  తాకట్టు పెట్టి అయినా  ఆడపిల్ల పెళ్లి ఘనం గా జరిపించాలిఅనే  ఒక ఆచారం పుట్టుకు వచ్చింది.
అలాగే జరిగిపోతోంది కూడా.       
            కాలను గుణం గా ఆడ పిల్లలు కూడా మగ పిల్లతో సమానం గా చదువుకుంటున్నారు. 
ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగానే కూడా చదువుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా .సమాజం లో 
అస్తమానం ఆడవాల్లమిదే సానుభూతి ఎక్కువగా ఉంటున్న పరిస్తితుల్లో మగ పిల్లల గురించి కూడా ఇక్కడ
ఆలోచించవలసి ఉంది.ఆస్తులు ఉంటె మగపిల్లవాడే మొత్తం ఆస్తి తిన్నాడు కనక బ్రతికున్నంత కాలం
ఆడపిల్లకి పసుపు, కుంకుమలు పెట్టాలి పుట్టింటి నించి వాళ్ళు ఆశించేది అంతే  కదా అంటూనే ప్రతి 
సారీ  వేలల్లో  పుట్టింటి వాళ్లకి ఖర్చు వస్తుంది.
        
          తల్లి ,తండ్రులు ఉంది వాళ్ళు కన్న పిల్లలకి వాళ్ళు పెట్టుకుంటే కొంత వరకు సబబేమో, 
కానీ, తండ్రి చనిపోయి, మగ పిల్లవాడి  కంటే వయసు లో లో పెద్దైన, చిన్నైన , ఆడ పిల్లల కి పెట్టుబడులు మాత్రం
పధ్ధతి పేరు చెప్పి జరిగిపోతూనే ఉన్నాయి.
          
         ఒకే కడుపున పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలైతే ఒకళ్ళకి ఒకళ్ళు ఏం పెట్టుబడులు ఉండవు. కానీ ఒక కడుపున
పుట్టినఒక ఆడ, ఒక మగ పిల్ల లైతే ఆ మగ పిల్ల వాడి పరిస్టితి మాత్రం బాధాకరమే. తనకి ఇల్లు, వాకిలి ఉన్నా,
లేకున్నా, తన భార్యకి మంచిచీర తేకున్న, లేకున్నా, ఆడపిల్ల పెట్టుబడులు మాత్రం తలి తండ్రుదులు లేకున్నా,
తోబుట్టువు సమప్దన పరులైనాకూడా, ఆ అబ్బాయి కి మాత్రం పెట్టు  పెట్టుబడు లు తప్పనిసరి ఔతాయి.
ప్రేమ తో పెట్టడం వేరు, ఈ డిమాండ్లని ఎదురు కోవడం వేరు. 
       
       సమానత్వ్వం అంటూ మాట్లాడే మహిళలు ఆడబడుచు పేరుతొ తోడబుట్టిన వాణ్ని దోచుకోవడం మానేసి, 
మన మిద్దరము ఒకే కడుపున పుట్టాం. వాడు నాకేంటి పెట్టేది? ప్రేమ గా కలిసినప్పుడు హృదయ పూర్వకం గా 
మాట్లాడమే ఆడపడుచులు ఆశిస్తే సమానత్వానికి కొంత  అర్ధం వస్తుందేమో? ఆలోచించండి.

             ( నన్ను  చాలామంది  తిట్టుకున్తారని  తెలిసీ  కూడా  నా  మనసు  లో  విషయాన్ని 

ఇక్కడవ్రాస్తున్నాను . అర్ధం  చేసుకున్న  వాళ్లకి  కృతఙ్ఞతలు , అర్ధం 

చేసు  కొని  వాళ్లకి  కూడా  ధన్యవాదాలు .)

గీతార్ధ సారము.

గీతార్ధ సారమూ వినుమూ నవా నీతామూ    చేకోను విధము
జ్ఞాతి వధ చే పాతకము సంజ్ఞాత మగునే ఏ విధంబున
సేతునని యుద్ధ మొల్ల కిపుడు సూత 
సుతు డీ రీతి పలికెను// గీతార్ధ సారమూ//
ఎవ్వరికైనా నచ్చితే అపుడు కంటిన్యు చేస్తాను. 

Thursday, February 3, 2011

ఎందరో మహానుభావులు


పల్లవి..       ఎందరో మహానుభావులు
                 అందరికి వందనములు
                ఎందరో మహానుభావులు
నుపల్ల  . చంద్ర వదనునియంద చందమును
                 హృదయారవిందమున జూచి
                 బ్రహ్మానందమనుభవించు వా(రెందరో)మహానుభావులు
చరణం       సామ గాన లోల మనసిజ లావణ్య
                 ధన్య మూర్ధన్యు(లెందరో)మహానుభావులు
చరణం .     మానస వన చర వర సంచారము సలిపి
                 మూర్తి బాగుగ పొడగనే వా(రెందరో)మహానుభావులు
.చరణం       సరగున పాదములకు స్వాంతమను
                 సరోజమును సమర్పణము సేయు వా(రెందరో)మహానుభావులు
చరణం.      పతిత పావనుడనే పరాత్పరుని గురించి
                పరమార్థమగు నిజ మార్గముతోను
                పాడుచును సల్లాపముతో
                స్వరలయాదిరాగములుతెలియువా(రెందరో)మహానుభావులు
చరణం      హరి గుణ మణి-మయ సరములు గళమున
               శోభిల్లు భక్త కోటులిలలో
               చెలిమితో కరుణ కల్గి
               జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా(రెందరో)
చరణం      హొయలు మీర నడలు కల్గు సరసుని
                సదా కనుల జూచుచును పులక శరీరులై
                ఆనంద పయోధి నిమగ్నులై
                ముదంబునను యశము కల వా(రెందరో)
చరణం      పరమ భాగవత మౌని వర శశి
               విభా-కర సనక సనందన
               దిగీశ సుర కింపురుష కనక కశిపు
               సుత నారద తుంబురు
               పవన సూను బాల చంద్ర ధర శుక
               సరోజ భవ భూ-సుర వరులు
               పరమ పావనులు ఘనులు శాశ్వతులు
               కమల భవ సుఖము సదానుభవులు గాక(యెందరో)
చరణం.    నీ మేను నామ వైభవంబులను
              నీ పరాక్రమ ధైర్యముల
              శాంత మానసము నీవులను
              వచన సత్యమును రఘువర నీయెడ
              సద్భక్తియు జనించకను దుర్మతములను
              కల్ల జేసినట్టి నీ మది-
              నెరింగి సంతసంబునను గుణ
              భజనానంద కీర్తనము సేయు వా(రెందరో)
చరణం.    భాగవత రామాయణ గీతాది
              శ్రుతి శాస్త్ర పురాణపు
              మర్మములను శివాది షణ్మతముల
              గూఢములను ముప్పది ముక్కోటి
              సురాంతరంగముల భావంబుల-
              నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
             చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
             త్యాగరాజాప్తులైన వా(రెందరో)
 చరణం  ప్రేమ ముప్పిరికొను వేళ
            నామము తలచే వారు
            రామ భక్తుడైన త్యాగ-
            రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)

త్యాగరాజ కృతి



ప. సుజన జీవన రామ సుగుణ భూషణ రామ

అ. భుజగ భూషణార్చిత బుధ జనావనాత్మజ
వందిత శ్రిత చందన దశ తురంగ మామవ (సుజన)

చ. చారు నేత్ర శ్రీ కళత్ర శ్రీ రమ్య గాత్ర
తారక నామ సు-చరిత్ర దశరథ పుత్ర
తారకాధిపానన ధర్మ పాలక 

తారయ రఘువర నిర్మల త్యాగరాజ సన్నుత (సుజన)

Life is a way: కేశవ నామాల మేలుకొలుపు.

Tuesday, February 1, 2011

త్యాగరాజ కృతి





 సుజన జీవనా
రామ సుగుణ భూషణా,రామా సుజన జీవనా.


భుజగ భూషణా, ఆశ్రిత భుధ జనావనా
ఆత్మజ  వందిత, శ్రిత చందన
దశ తురంగమామవ ...  సుజన జీవనా


చారునేత్ర, శ్రీ కళాత్ర శ్రీ రమ్య గాత్రా,
తారకనామ సుచరీత్ర , దశరథా  పుత్రా.
 తారాకాధిపా  , వన ,ధర్మ పాలకా. 
తారాకాధిపా    వన ,ధర్మ పాలకా.


తారాకాధిపా  , వన ,ధర్మ పాలకా.
తారయ  రఘు   వర నిర్మల
త్యాగరాజ సన్నుత సుజన జీవనా //రామా//

(ఖమాస్ రాగం.)ఈ పాటలన్నీ నేను  చిన్నప్పుడు మా అమ్మగారు పాడుతుంటే విన్నవి మాత్రమే.
యధా తధంగా జ్ఞాపకం ఉన్నట్టు వ్రాసాను. సరిదిద్దిన వారికి  ధన్య వాదాలు.  

మగపిల్లలకి హారతి పాట-2

మంగళ మో హరి, మంగళ మో హరి,
మంగళమీదే గొనుమా, రామా నీకూ మంగళమీదే గొనుమా

సుందర మహాలక్ష్మి, సొగసుగా దరి జేరి,
అందమలరగాను, రామా నికూ అందమలరాగాను //మంగళ మో హరి,//

పతివ్రతా సతి అయినా, పరమా పతివ్రతా
లాసేర్వదిన్చాగానూ, రామా నీకు //మంగళ మో హరి,//

విశ్వ  విద్యాధరా, కిన్నెరా,కింపురుషా,
నుతులొనరిమ్పాగానూ ,రామా నీకూ, //మంగళ మో హరి,//

ధరణిలో వేల గొల్లదుల కృష్ణముర్తి శాస్త్రి,
హారతి  పట్టగాను   రామా నీకూ హారతి  పట్టగాను //మంగళ మో హరి,//

గౌరీ హారతి పాట

    గైకోనావే   హారతి  గౌరీపాహీ
దీనా జనుల బ్రోవా  మానీ నీవదే

శామ్భావీ  దయ చూడా , జాలామేల నమ్మా // గైకొనవే//
అమ్మా నాదు మనవీ అలాకించ వే
కర్పూరా హారతులు  గైకోనావే తల్లీ  // గైకొనవే

పసిడీ  పళ్ళెరము  లో   పచ్చల హారతులు, 
కనకపు పళ్ళెము లో  కర్పూరా  హారతూలు // గైకొనవే//

 పూజాలూ   గైకోనావే పువు బోణిరో
భక్తురాలీ నేలా భారామౌన టమ్మ // గైకొనవే//

మేలుకొలుపు

శ్రీ సూర్య నారాయణా   మేలుకో 
రవి సూర్య నారాయణా

పుట్టేటి భానుడా  పుష్య రాగపు చాయ 
పుష్య రాగము మీద పొందు బంగారు చాయ   // శ్రీ//

జామెక్కి భానుడా జాజిపూవూచాయ  
జాజి పువ్వు మీద  సంపేగా పువు చాయ  // శ్రీ//

 మధ్యాన్న భానుడా మల్లె పూవూ చాయ
మల్లె పూవూ మీద మంకేనా పువు  చాయ // శ్రీ/

క్రుంకేటి భానుడా  గుమ్మిడి  పువు చాయ
గుమ్మిడి  పువు మీద కుంకుమాపువు  చాయ // శ్రీ/

 ఆయురారోగ్య ముల నిమ్ము ఐశ్వరముల నిమ్ము 
  శ్రీ సూర్య నారాయణా   మేలుకో