Monday, February 7, 2011

ఆడబడుచు

            
            సాధారణం గా మన కుటుంబాల్లో ఏ సందర్భాల్లో నైనా ఆడబడుచు కిచ్చే స్థానం చాలా గొప్పది. 
ఒకప్పటి రోజుల్లో ఆడ పిల్లల్లు చదువు లేక , సంపాదన లేక అటు అత్తింటి వారి మీద, భర్త మీద ఆధారపడే వాళ్ళు.
         కుటుంబం లోఏన్నిఅవసరాలు ఉన్నా ఎవరి మీదో ఒకరి దయ , దాక్షిణ్యాల మీద ఆదారపడ వలసి వచ్చే 
మాట. అలాంటప్పుడు, పెళ్లి సమయం లో ఆ అమ్మాయి పేరు మీద స్త్రీ ధనం  అంటూ కొంత ఆస్తి కానీ,
కొంత ధనం కానీ, ఇంకా ఉంటె నగలు, నాణ్యాలు ఆ అమ్మాయి  జీవిత కాలం ఒకరి మీద ఆధార పడకుండా
ఉండేలా తల్లి తండ్రులు ఏర్పాటు చేసే వారు. 
             
         అది ఈ  కాలం లో  అయితే రానురాను  డిమాండ్ చేసి కట్నం అడిగే స్తాయి కి చేరుకుంది. 
                   
        ఇక్కడ గ్రహించాల్సిన్దేంటంటే తీసుకోవడం తప్పు కాదు, ఇవ్వడం బాధ్యత, 
తల  తాకట్టు పెట్టి అయినా  ఆడపిల్ల పెళ్లి ఘనం గా జరిపించాలిఅనే  ఒక ఆచారం పుట్టుకు వచ్చింది.
అలాగే జరిగిపోతోంది కూడా.       
            కాలను గుణం గా ఆడ పిల్లలు కూడా మగ పిల్లతో సమానం గా చదువుకుంటున్నారు. 
ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగానే కూడా చదువుతున్నారు, సంపాదిస్తున్నారు కూడా .సమాజం లో 
అస్తమానం ఆడవాల్లమిదే సానుభూతి ఎక్కువగా ఉంటున్న పరిస్తితుల్లో మగ పిల్లల గురించి కూడా ఇక్కడ
ఆలోచించవలసి ఉంది.ఆస్తులు ఉంటె మగపిల్లవాడే మొత్తం ఆస్తి తిన్నాడు కనక బ్రతికున్నంత కాలం
ఆడపిల్లకి పసుపు, కుంకుమలు పెట్టాలి పుట్టింటి నించి వాళ్ళు ఆశించేది అంతే  కదా అంటూనే ప్రతి 
సారీ  వేలల్లో  పుట్టింటి వాళ్లకి ఖర్చు వస్తుంది.
        
          తల్లి ,తండ్రులు ఉంది వాళ్ళు కన్న పిల్లలకి వాళ్ళు పెట్టుకుంటే కొంత వరకు సబబేమో, 
కానీ, తండ్రి చనిపోయి, మగ పిల్లవాడి  కంటే వయసు లో లో పెద్దైన, చిన్నైన , ఆడ పిల్లల కి పెట్టుబడులు మాత్రం
పధ్ధతి పేరు చెప్పి జరిగిపోతూనే ఉన్నాయి.
          
         ఒకే కడుపున పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలైతే ఒకళ్ళకి ఒకళ్ళు ఏం పెట్టుబడులు ఉండవు. కానీ ఒక కడుపున
పుట్టినఒక ఆడ, ఒక మగ పిల్ల లైతే ఆ మగ పిల్ల వాడి పరిస్టితి మాత్రం బాధాకరమే. తనకి ఇల్లు, వాకిలి ఉన్నా,
లేకున్నా, తన భార్యకి మంచిచీర తేకున్న, లేకున్నా, ఆడపిల్ల పెట్టుబడులు మాత్రం తలి తండ్రుదులు లేకున్నా,
తోబుట్టువు సమప్దన పరులైనాకూడా, ఆ అబ్బాయి కి మాత్రం పెట్టు  పెట్టుబడు లు తప్పనిసరి ఔతాయి.
ప్రేమ తో పెట్టడం వేరు, ఈ డిమాండ్లని ఎదురు కోవడం వేరు. 
       
       సమానత్వ్వం అంటూ మాట్లాడే మహిళలు ఆడబడుచు పేరుతొ తోడబుట్టిన వాణ్ని దోచుకోవడం మానేసి, 
మన మిద్దరము ఒకే కడుపున పుట్టాం. వాడు నాకేంటి పెట్టేది? ప్రేమ గా కలిసినప్పుడు హృదయ పూర్వకం గా 
మాట్లాడమే ఆడపడుచులు ఆశిస్తే సమానత్వానికి కొంత  అర్ధం వస్తుందేమో? ఆలోచించండి.

             ( నన్ను  చాలామంది  తిట్టుకున్తారని  తెలిసీ  కూడా  నా  మనసు  లో  విషయాన్ని 

ఇక్కడవ్రాస్తున్నాను . అర్ధం  చేసుకున్న  వాళ్లకి  కృతఙ్ఞతలు , అర్ధం 

చేసు  కొని  వాళ్లకి  కూడా  ధన్యవాదాలు .)

1 comment:

Ennela said...

తిట్టుకోడానికి యేమీ లేదు...//ప్రేమ తో పెట్టడం వేరు, ఈ డిమాండ్లని ఎదురు కోవడం వేరు// ఇది నిజం..