విష్ణు,యీశ్వర,బ్రహ్మ ముగ్గురూ
అన్న దమ్ములంట
ఈ భూదేవి ఆకాశవాణి కి
వీరే కర్త లంట
1) వారి మహిమ తో చేసిరీ ఒక
మట్టి బొమ్మ నంట
ఈ తొమ్మిది కిటుకుల దర్వాజాలూ
మాటలాడుకుంట
2) వస్తా వట్టిదే, పోతా వట్టిదే
ధర్మము తన వెంట,
సాంబ శివుడు నిను పిలువ నంపి నడు
జల్ది గ రమ్మంట
3) చేతిలొ బెల్లం ఉన్నంత సేపే
కాకి బలగ మంట
చేతిలొ బెల్లం సరి పోయినాక
ఎవరు రారు వెంట
4) ఇంటి ముంగిట పిల్ల మేకలు
ఇల్లు బలగ మంట
ఏడ్చే వారు, మరి ఆర్చే వారూ
ఎవరు రారు వెంట
5) తొలినాడు యములోడంపే కింకరుల
గుంజుకు రమ్మంట
యములోల్లంతా వెంట నడిచినరు
ఆరూళ్ళు తెమ్మంటా
౬) చిన్నలు, పాడడాలు కుచున్నారూ
చింతలు పడుకుంట
నీళ్లుబోసి కూర్చుండ బెట్టినరు
మాయ బొమ్మ నంట
౭) పువ్వుల దండలు వేసినారయా
మాయ బొమ్మకంట
దింపుడు కళ్లము కాడ దింపినరు
మాయ బొమ్మ నంట
8) సొమ్ము సమస్తము తీసుకొనీ
పోతరు వారంతా
గురువు పోస్తడు శంఖు తీర్థమూ
ముక్తి ఫలము కంటా
౯) మంట్లో మన్ను కలిపినారు, మాయబొమ్మ నంట
ధన ధాన్యంబులు ఎవరి పదార్ధము ధర్మమే తనవెంట
చేసిన పుణ్యము ,పాప కర్మములె
వచ్చును తన వెంట
౧౦) ఒంట్లో సత్తువ ఉన్నంత సేపే
ఉంది నీకు జంటా
ఆ ఒంట్లో సత్తువ సన్నగిల్లితే
ఎవరు రారు వెంట
౧౧) ప్రమిద లో నూనెలు ఉన్నంత సేపే
దివ్వె వెలుగు లంతా
ఆ ప్రమిద లో నునే అయిపోయినాకా
దీప మారునంట
౧౨) ధన ధాన్యాలు, భోగ భాగ్యములు
క్షణిక సుఖము లంట
సెర్లో సేపలు సేల్లిపోగనే
కొంగ లొల్ల వంట
2 comments:
chakkani tatvageetm amdimchaaru dhanyavaadamulu
Hello, I used to listen this in DD-8 at my younger age. I don't know why but even now sometimes I humm this song. Thanks for posting.
Post a Comment