కేశవ,గోవింద,మాధవా యని కీర్తన సేయుట ఎన్నటికో,
నాశము లెనీ మోక్షము నొందుట నారాయణ ణయా కెన్నటికో
భక్తి, మృదంగము, తాళాదులతో భజనలు చేసే దెన్నటికో,
శక్తి మీరగా, నృత్యము సేయుట సారసాక్ష నా కెన్నటికో
పూవులతొనీ పాదంబులకూ పూజలు చేసే దెన్నటికో
నైవేద్యము నిడి పరమ భక్తి ని పాటించుట నా కెన్నటికో
పాహి,పాహియని పరమ పురుష నీ పాదంబుల బడు టెన్నటికో
దేహి,దేహి యని నీ కృప కోర కై దేవురులాడే దెన్నటికో
రామదాసులను బ్రోచునట్లు సం రక్షణ చేసే దెన్నటికో,
భామా మణి ఆ జానకి తో వచ్చి బాసలు చేసే దెన్నటికో,
దాస దాసు డగు నరస దాసుడను , దాసుగా నేలె దెన్నటికో,
భాస సమాను నివాస రామునా వందనము గొను టెన్నటికో
కేశవ,గోవింద,మాధవా యని కీర్తన సేయుట ఎన్నటికో,
నాశము లెనీ మోక్షము నొందుట నారాయణ ణయా కెన్నటికో
1 comment:
భలే గుర్తు చేసారండీ...చిన్నప్పుడు పొద్దున్నే దుప్పటి ముసుగు తీయకుండా భక్తి రంజనిలో వింటుంటే భలే ఉండేది...
Post a Comment