Thursday, February 3, 2011

ఎందరో మహానుభావులు


పల్లవి..       ఎందరో మహానుభావులు
                 అందరికి వందనములు
                ఎందరో మహానుభావులు
నుపల్ల  . చంద్ర వదనునియంద చందమును
                 హృదయారవిందమున జూచి
                 బ్రహ్మానందమనుభవించు వా(రెందరో)మహానుభావులు
చరణం       సామ గాన లోల మనసిజ లావణ్య
                 ధన్య మూర్ధన్యు(లెందరో)మహానుభావులు
చరణం .     మానస వన చర వర సంచారము సలిపి
                 మూర్తి బాగుగ పొడగనే వా(రెందరో)మహానుభావులు
.చరణం       సరగున పాదములకు స్వాంతమను
                 సరోజమును సమర్పణము సేయు వా(రెందరో)మహానుభావులు
చరణం.      పతిత పావనుడనే పరాత్పరుని గురించి
                పరమార్థమగు నిజ మార్గముతోను
                పాడుచును సల్లాపముతో
                స్వరలయాదిరాగములుతెలియువా(రెందరో)మహానుభావులు
చరణం      హరి గుణ మణి-మయ సరములు గళమున
               శోభిల్లు భక్త కోటులిలలో
               చెలిమితో కరుణ కల్గి
               జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు వా(రెందరో)
చరణం      హొయలు మీర నడలు కల్గు సరసుని
                సదా కనుల జూచుచును పులక శరీరులై
                ఆనంద పయోధి నిమగ్నులై
                ముదంబునను యశము కల వా(రెందరో)
చరణం      పరమ భాగవత మౌని వర శశి
               విభా-కర సనక సనందన
               దిగీశ సుర కింపురుష కనక కశిపు
               సుత నారద తుంబురు
               పవన సూను బాల చంద్ర ధర శుక
               సరోజ భవ భూ-సుర వరులు
               పరమ పావనులు ఘనులు శాశ్వతులు
               కమల భవ సుఖము సదానుభవులు గాక(యెందరో)
చరణం.    నీ మేను నామ వైభవంబులను
              నీ పరాక్రమ ధైర్యముల
              శాంత మానసము నీవులను
              వచన సత్యమును రఘువర నీయెడ
              సద్భక్తియు జనించకను దుర్మతములను
              కల్ల జేసినట్టి నీ మది-
              నెరింగి సంతసంబునను గుణ
              భజనానంద కీర్తనము సేయు వా(రెందరో)
చరణం.    భాగవత రామాయణ గీతాది
              శ్రుతి శాస్త్ర పురాణపు
              మర్మములను శివాది షణ్మతముల
              గూఢములను ముప్పది ముక్కోటి
              సురాంతరంగముల భావంబుల-
              నెరింగి భావ రాగ లయాది సౌఖ్యముచే
             చిరాయువుల్ కల్గి నిరవధి సుఖాత్ములై
             త్యాగరాజాప్తులైన వా(రెందరో)
 చరణం  ప్రేమ ముప్పిరికొను వేళ
            నామము తలచే వారు
            రామ భక్తుడైన త్యాగ-
            రాజ నుతుని నిజ దాసులైన వా(రెందరో)

No comments: