Saturday, July 30, 2011

అస్య శ్రీ బగ ళాముఖీ కవచస్య


                                        అస్య శ్రీ బగ ళాముఖీ కవచస్య
శ్రుత్వాచ   బగళా పూజాం స్తోత్రం ఛాపి మహేశ్వర !
ఇదానీ శ్రోతు  మిచ్చామీ కవచం  వదమే ప్రభో  
వైరి నాశ కరం దివ్యం సర్వాశుభ వినాశనం
శుభదంస్మరణాత్ పుణ్యం త్రాహిమాం దుఃఖ నాశనం
ఠిత్వాద్వార యిత్వాతు త్రైలోక్యే విజయీ  భవేత్ 
 ఓం అస్య శ్రీ బగ ళాముఖీ కవచస్య నారద రుషి :అనుష్టుప్ ఛంద:
 బగ ళాముఖీ దేవతా !లం బీజం
ఐం కీలకం పురుషార్ధ చష్నుయా సిద్ధయే జపే వినియోగః
ఓం శిరోమే బగళా పాతు, హ్రుదయెకాక్క్ష రీపరా !
ఓం హ్రీమ్ఓం మే లలాటే చ వైరి నాశినీ
శిరో  మే  బగ ళా  పాతు హ్రుదయెకాక్క్ష రీపరా !
ఓం  హ్రీం  ఓం  మే  లలాటే  చ  బగళ వైరి  నాశినీ  [1]

గదా హస్తా  సదా  పాతు  ముఖం  మే  మోక్ష   దాయినీ .
వైరిజిహ్వాధరా   పాతు  కంఠం మే   బగళాముఖి  [2]

ఉదరం నాభిదేశం చ  పాతునిత్యం  పరాత్పరా .
పరాత్  పరతరా  పాతు   మమ గృహం   సురేశ్వరీ  [3]


హస్తవ్ చైవ   తథా  పాదవ్  పార్వతీ  పరిపాతుమే  .
వివాది  విషమే  ఘోరే సంగ్రామే  రిపు  సంకటి  [4]
పీతంబరధరాపాతు   సర్వంగాయ    శివనర్తకీ  .
శ్రీవిద్య  సమయా  పాతు  మాతంగీ  పూరితాశివా  [5]

పాతు పుత్రం  సుతం  చైవ కత్రం  కాళికా  మమ .
పాతు  నిత్యం  భ్రాతరం  మే  పితరం  శూలినీ  సదా  [6]

రంద్రే  హిబగళా దేవ్యాః  కవచం  మన్ముఖోదితం .
నైవ   దేయం  ముఖ్యాయ  సర్వసిద్ది  ప్రదాయకం   [7]



  పథనాద్వారణాదస్య   పూజనద్వంచితః  లభేత్ .
ఇదం  కవచం  జ్ఞాత్వా యో   జపేత్  బగ ళాముఖీమ్  [8]

పిబంతి  శోణితం  తస్య  యోగి న్య   ప్రాప్యసాదరః .
వశ్యే  చాకర్శణే  చైవ  మారణే  మోహనే  తథా [9]

మహాభయే  విపత్త్తెచ   పఠేద్వాపఠేత్యతు 
తస్యసర్వార్థ సిద్ధి :స్యాదు భక్తీ యుక్త స్య  పార్వతి  [10]


          ఇతి  శ్రీ  రుద్రయామలే   బగ ళాముఖీ  కవచం  సంపూర్ణం 

Wednesday, July 27, 2011

Lord Ganesha Vishwa Vinayaka

     


      గణనాయకాయ గణదైవతాయ  గణాధ్యక్షాయ     ధీమహి
       గుణ శరీరాయ  గుణ వందితాయ గణేశానాయ  ధీమహి
      గుణాతీతాయ   గుణా ధీశాయ గుణ ప్రవిస్థాయ ధీమహి  
     ఏక దంతాయ వక్ర తుండాయ గౌరీ తనయాయ ధీమహి ,
     గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

   గాన చతురాయ గాన ప్రాణాయా గానంతరాత్మనే , 
    గానోత్శుకాయ గానమత్తాయగానోత్శుకమనసే
   గురు పూజితాయ గురు దైవతాయ గురుకుల స్తాయినే
   గురు విక్రమాయ గుహ్య  ప్రవరాయ , గురవే గుణ గురవే


  గురు దైత్యకరక్షేత్రే   గురుదైవ సదారాధ్యాయా   
  గురు పుత్ర పరిత్రాయే గురు పాఖండ ఖండకాయ
గీత సారాయ ,గీత తత్వాయ గీత స్తోత్రాయ ధీమహి
గూడ గుల్ఫ్హాయ గంధ మత్తాయ గోజయ వ్రతాయ ధీమహి
 గుణాతీతాయ   గుణా ధీశాయ గుణ ప్రవిస్తాయ ధీమహి  

  ఏక దంతాయ  వక్ర తుండాయగౌరీ తనాయాయ ధీమహి
  గజేశానాయ బాల చంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి

  గంధ గీతాయ గంధ గేయాయ గందాతరాత్మనే 
 గీత  లీలాయ  గీతాశ్రయాయ  గీతవాద్య  పతవే
 గేయ  చరి తాయ  గాయక వరాయ  గాంధర్వ    ప్రియక్రుతేయ్
 గాయగాథేన  విక్రహారాయ  గంగాజలప్రణయవతే
  
  గౌరీశనందనాయ  గౌరీ  హ్రిదయనందనాయ
  గౌరీ భానూ  సుతాయ  గౌరీ గణేశ్వరాయ

 గౌరీ  ప్రణయాయ  గౌరీ  ప్రణవాయ   గౌరభావాయ  ధీమహి
 మోక్ష హస్తాయ   గోవర్ధనాయ  గోప   గోపాయ  ధీమహి
గుణాతీతాయ  గుణాదీశాయ  గుణాప్రవిష్టాయ  ధీమహి

ఏక  దంతాయ  వక్రతుండాయగౌరీ  తనయాయ   ధీమహి
గజేశానాయ  బాల  చంద్రాయ  శ్రీ  గణేశాయ ధీమహి

Tuesday, July 26, 2011

Swagatham Krishna - Yesudas

                        
                               
                               పల్లవి ;  స్వాగతం  కృష్ణాఆ,ఆ, స్వాగతం  కృష్ణా కృష్ణా
                                       శరణాగతం  కృష్ణా 
                                        ఇక స్వాగతం  కృష్ణా కృష్ణా  స్వాగతం  కృష్ణా
                                        మధురాపురి  సదనా  మృదు    

                                        వదనా   మధుసూదన  ఇహ// స్వాగతం//౩ సార్లు
                        అనుపల్లవి ;భోగ   దప్త  సులభా  సుపుష్ప  గంధ  కలభా
                                        కస్తూరి తిలక మహిపా   మమ కాంత నంద గోపకంద
(స్వాగతం

                          చరణం  ;   ముష్టికాసూర  ఛాణూర    మల్ల  మల్ల  విశారద  మధుసూదనా  
                                         కువలయాపీడమర్దన  కాళింగ నర్తన
                                         గోకులరక్షణ సకల  సులక్షణ  దేవా  -
                                         శిష్ట  జన  పాల  సంకల్ప కల్ప 
             .                          కల్ప  శత కోటి  అసమపరాభవ 
                                        ధీర  ముని  జన   విహార   మదన  సుకుమార  దైత్య  సంహార  దేవా 
                                        ధీర  ముని  జన   విహార   మదన  సుకుమార  దైత్య  సంహార  దేవా
                                        మధుర  మధుర  రతి  సాహస  సాహస 
                                         ప్రతి యువతి  జన  మానస  పూజిత 
                                          స ,గప, గరి , ,ప గ రి స గ స ,
                                          స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా 
                                           స స రి రి గ గ ప ప   స స దపప, గ రి రి  స గరిస 

                                          స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
                                         తిటక  జనుతాం  తకజనుతాం  తతకి టకజనుతాం
                                          తకతరి  కుకుంతన  కితతకదీం
                                          తకతరి  కుకుంతన  కితతకదీం
                                           తకతరి   కుకుంతన  కితటక ధీం
 

Monday, July 25, 2011

ఏ సేవ సేయగ


      కొన్నేళ్ళ క్రితం సంక్రాంతి సందర్భం గా కాస్త ప్రశాంతత  కావాలనిపించి, ఒక పది రోజుల పాటు ప్రశాంత నిలయానికి వెళ్ళాను. నాకు ఒక పధ్ధతి లో పూజలు చేయడం కాని, ఉపవాసాలు చేయడం కానీ రాదు. ఒంటరిగా కళ్ళు మూసుకుని ప్రార్ధించడం  తప్ప. భయమేసినప్పుడు, మొండిగా నాతొ రమ్మని .మారాము చేస్తాను, నాకు ఇంతవరకు  , కష్టమనిపించి, మనసారా వేడుకుంటే దేవుడు సహాయమే చేసాడు.
 
    మాములుగా ఒక మంచి సినిమా చూస్తేనే స్నేహితులతోటి, ఇంట్లో వాళ్ళతోటి మరి,మరి  చర్చించు కుంటామే , అలాంటిది, ఈ  సృష్టి కి మూలమైన ,సమాజాన్ని,తను ఉన్నానన్న ఒకే ఒక్క భావన  తో అదుపులో ఉంచుతున్న (నమ్మకం ఉన్నవాళ్ళకి)  ఆ దేవుడు, మనకి ఏ భావన కలిగించినా పంచుకోవడం లో అభ్యంతరం లేదనిపించింది.    
 

      భక్తు లందరితో బాటే నేను కూడా సాయిబాబా దర్శనం కోసం హాలు లో కూర్చున్నాను. అర గంట అయినాక స్వామి హాల్   లోకి రావటం చూసాను. . అందరితో బాటే నేను కూడా స్వామి    ఆశీర్వాదం కోసం ఆత్ర్తగా చూస్తున్నాను. రెండు క్షణాలు ఐతే,  స్వామి నా  తల మిద చేయి పెట్టి ఆశిర్వదించే వారే  .        ప్రాప్తాన్ని నమ్ముతాన్నేను. లిప్త లో స్వామి నన్ను పట్టించుకోకుండా నే వేరే వాళ్ళకేసి చూస్తూ, ముందుకు వెళ్ళిపోయారు. ఆ క్షణం లో నా మనసులో కలిగిన బాదే,ఒక పాటగా ప్రవహించింది. నాలో నేనే ఎప్పుడు పాడుకుంటూ ఉండే దాన్ని.

   నిన్న మా ఇంటికి స్నేహితులు  వచ్చారు. సరదాగా   కాసేపు గడిచినాక అందరు ఆటలు,పాటలు అయినాక నన్ను కూడా పాడమన్నారు.  ఎందుకో స్వామి మీద పాడాలని అనిపించి ఈ పాట పాడాను  .అంతే , అందరు చాలా బాగుంది అన్నారు. మా సోనీ ఐతే  పబ్లికైజ్జ్ చేయాలిసినంత బాగుంది అంటూనే  పాట  రాసుకుంది . అందరికి అందుబాటులో ఉంటుందని ఇవ్వాళ బ్లాగ్ లో వ్రాస్తున్నాను.

 
ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ
ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ
ఏ  నామ స్మరణము  నీ దరికి జెర్చెనూ

సెల వీయ మని నిన్ను నిరతము వెడితే
చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //


అల్లంత దురాన  అగుపించి
మా ఉల్లము రంజిల్ల భాషించి
మనసులలో మరి,మరి-మరిమరి
మరిమరివేడినా
చిరు నవ్వుతో నీవు మరపించేదవు స్వామి //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //


ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే


ఉన్న వాడను కాను మనసున్న వాడనే
లేని వాడను, దరిగాలేని వాడనే


ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని
ఏ రీతి ఏ నీతి  నీ దరికి చేర్చునని

మరిమరివేడినాచిరు నవ్వుతో నీవు

మరపించేదవు స్వామి                //ఏ సేవ సేయగ   నీ కరుణ కలిగెనూ //

      
     స్వామి మన మధ్యన ఇక పైన ఒక అనుభూతిగా ,ఒక ఆత్మా జ్ఞానం గా, ఒక ప్రేమ గా ఒక భజనగా ఒక భావం గా మిగిలి పోతారు. దేహి గా ఆయన మనలోనే,మనతోనే సదా నిలిచి ఉంటారు. భగవాన్  కి  ఈ పాట అంజలిగా, అర్ఘ్యం గా, భజనగా , పూజ గా ఎల్లప్పుడూ మిగిలి పోవాలని నా ఆశ. స్వామీ నా పాట లో సదా కనిపించు, వినిపించు,  ఒక పువ్వుగా దీన్ని స్వీకరించు.

కృష్ణా



కరమునా మురళీని చేకొని ,,గానమూ చేయార కృష్ణా 
కన్నులారా నిన్ను గాచీ ,,ధన్య నయ్యే దాను కృష్ణా //కరమునా//

దివ్య కస్తూరీయు తిలకము,,తీర్చి దిద్దేదాను కృష్ణా 
తిన్నగా నీ మోము చూపితే ,,వెన్న పెట్టేదాను కృష్ణా   //కరమునా//

మంచి మంచీ  హారములనూ,,ఎంచి నీ మెడ నుంచే  దానూ 
మల్లెలు,మొల్లాలూ  మంచీ,,మాలలూనీ సిగకు కూర్చెద //కరమునా//

 గొల్లవారీ పిల్లలతో ,రే పల్లె కేగగా ఎల్ల వేళల 
అల్లరీ చేయంగ నేలా  పిల్లనా గ్రోవితో దేవా //కరమునా//

వేమారు నిన్నూ వేడుచుంటిని ,ఎచట నుంటివో  మాధవా
రాధతో ముచ్చాట  లాడుతూ, రారా ఇటు ఓ శ్రీ ధరా//కరమునా//



 




ఎత్తుకొందురా కృష్ణా,

              
                         ఎత్తుకొందురా  కృష్ణా,  
                        నా యదుకుల నందన రారా
                         ఏ భక్తుల చే పట్టు బడితివో 
                         యదుకుల నందన ఇపుడే రారా//ఎత్తు//

                         అందెలు ,మువ్వలు కదలా, నీ సందిటి గజ్జెలు మెరియా
                         అందమైన గోవిందా రారా,హరి నీవిపుడే ఆడుతూ రారా //ఎత్తు//


                        పండ్లు ఇచ్చెదను  తండ్రీ నీకు,  భక్ష్యము లిచ్చెద నయ్యా నీకు 
                        పండ్లు,ఫలములు ఆరగించి మా పాపములను ఎడ బాపగ రారా /ఎత్తు//

                       నందుని భాగ్యం బేమో ,నిను ఎత్తుకు ముద్దాడే నయ్యా  
                       గోకులమందున ఆడితివో, గోపాలా రారా కోర్కెలు తీర్చా //ఎత్తు//

Sunday, July 24, 2011

కృష్ణా నీబేగా నే బారో;జేసుదాస్

       

                           
                                 కృష్ణా  నీబేగా నే బారో,  కృష్ణా  నీబేగా నే బారో
                                 బేగానే బారో ,ముఖ వన్నె తోరో
                                 బేగానే బారో ,ముఖ వన్నె తోరో //  కృష్ణా //

                                 కా ళ్ళాలందిగే గజ్జే , నీలాదాబాహువులి.
                                నీలా వర్ణనే  నాట్యావ ,నాడూత బారో  //  కృష్ణా //

                                కుడియల్లి నుడి గజ్జే , బెళ్ళల్లి మున్దూళ్ళా
                               పోరలల్లోలు హాకీదా ,వైజయంతి మాల //  కృష్ణా //ే

                                కాశీ పీతంబరా,కై యల్లి పొఅలూ
                                కూశీద శ్రిగంద మయ్యేల్ల గిర లూ //  కృష్ణా //

                                  తాయీగే బాయల్లి, జగవంతు,తీహారిద్దా  ఆ ఆ ఆ ఆ
                                 జగదోద్ధారణ, ఉడుపి శ్రీ కృష్ణన //  కృష్ణా //
  








పుట్టు శంఖు చక్రి


                                                పుట్టు శంఖు చక్రములతో పుట్టేనమ్మా కృష్ణమూర్తి
                                               విపునా వింజామరము లూ కాంతి చంద్రుని పోలేనూ 

                                              బాలు నెత్తీ తొడల నుంచీ అతివ ఎంతో దుఃఖ పొందే 
                                              కళ్ళు తెరిచీ కృష్ణమూర్తి ఘల్లు ఘల్లున నవ్వెనూ 

                                              అమ్మానన్నేక్కడైనను దాచవే ,,                            
                                              బాలు నెక్కడ దాతునే  

                                               వ్రేపల్లె వాడ లోను గోపిక  యను పేరు గలా 
                                               ఆడబాలిక కన్నతండ్రి మేనమా కందియ్యవే 

                                               అమ్మా నన్నేక్కడైనను  దాచవే ,,            
                                               బాలు నెక్కడ దాతునే   

                                              మూడు  ఘడియలు దాచవమ్మా, 
                                               ముజ్జగంబులు ఏ లెదానూ,

                                             నాలుగుడియలు దాచవమ్మా 
                                             నరుల నే రక్శిస్తునూ,

                                             అమ్మానన్నేక్కడైనను  దాచవే
                                            బాలు నెక్కడ దాతునే 

                                            ఐదుఘడియలుదాచవమ్మా
                                           అయిహికంములుమీకుతెల్పెద 
                                            ఆరుఘడియలు దాచవమ్మా
                                           అందరిని రక్శిస్తునూ 

                                            ఏడు ఘడియలు దాచవమ్మా
                                             ఏక చక్రం మెలెదానూ
                                             అష్టమ ఘడియలు దాచవమ్మా,
                                             కష్టములు నే దీర్చెదన్
,             
                                            అమ్మానన్నేక్కడైనను  దాచవే


చిన్ని కృష్ణా

                
                              వెన్నె ముద్ద మాధవా, చిన్ని చేత తిన్దువా
                             ఉన్న మాయ బల్కవా, గున్న వలె కూచుందువా

                            ముద్దుకృష్ణ బల్కవా ,వద్దనేప్పుడు నిల్వవా,
                           గానమురళి ఊదవా  ,గర్వమణచి బ్రోవవా

                                                   
                            జున్ను పాలు పోసేదన్,వెన్న నోట పెట్టెదన్
                            ఆపదాలు అణచవా,రూపునాకు చూపవా
  
                           నంద పుత్ర గావవా ,బంధమడచి ఏలవా 
                           యజ్ఞ మహా లక్శ్మినీ హృదయమందు నిల్పవా






   

కృష్ణుడి జననం పాట

 కృష్ణాష్టమి త్వరలో వస్తోంది.  నంద గోప బాలుడి జననాన్ని  గురించిన ఈ పాట ఆ రోజు పూజ చేసుకున్నాక కృష్ణుడ్ని ఉయ్యాలలో వేసి ఉయ్యాలా పాట ఇది పాడుకుంటే  , ఎంతో  బాగుంటుంది. ప్రయత్నించి చుడండి. లాలిపాట వరసే. 


                               

                     రామ రఘురామ లాలీ ,మాపాలి సీతా సమేత లాలీ 
                     హరిరామ రామలాలీ ,అని ఇట్లు జనులు పాడేరు లాలీ//రామ//

                     కంసుణ్ణి సంహరింపా , సద్గురుడు అవతారమెత్తెనపుడూ
                     దేవకీ గర్భంబునా క్రిష్నావతారమై జన్మించెనూ//రామ//

                      యేడు రాత్రులు పగలునూ ,తానొక్క రాత్రిగా జేసెనపుడూ 
                     ఆదివారముపూటనూ శ్రావణా మాసమున జన్మించెనూ// రామ //

                      తలతొను జననమైతే ,తనకు బహు మోసంబు వచ్చుననుచూ ,
                      యెదురుకాళ్ళనుబుట్టెనూ, యెడుగురుదాదులనుతాజంపెనూ//రామ//

                      నెత్తురై ఉండి చాలా  , తానపుదు క్యావు,క్యవున యెడ్చెనూ 
                      నన్నేల యెత్తుకొవే నా తల్లి యెల మాట్లడవమ్మా// ,రామ //

                      వేణీళ్ళు లెక నేనూ ,,యీ రీతి యున్నాను కన్నతండ్రి
                      నిన్నెట్లు యెత్తుకొందూ  ,,నీవొక్క నిముషమ్మ్ము తాళ్మన్నా//రామ//

                       గంగ ను ప్రార్ధించెనూ ,,జలనిధులు గంగ ఉప్పొంగెనపుడూ ,
                       గంగానదీ యందునా దేవకీ జలకంబులాడె తానూ //,రామ//

                       తడి వస్త్రములు విడిచియూ ,తానపుడు పొడి వస్త్రములు గట్టెనూ
                      పొత్తిళ్ళమీద నపుడూ బాలుడిని పవళ్ళింప జెసిరపుడూ//రామ //

                     కామధేనువప్పుడూ మాధవుడు మదిలొన దలచగానూ,
                     పాలవర్షము కురిసెనూ ఆ తల్లి బాలునీ పై చల్లెనూ //రామ//

                     ఇక నైన  ఎత్తుకొవే ,,ఓతల్లి దేవకీ వందనంబూ
                     కానిబాలుని రీతినా ఉన్నాను ,కన్నతల్లీ ఎత్తుకో //రామ //

                    తనరెండు హస్తములచే, బాలుణ్ణి చక్కగా ఎత్తుకొనీ /
                    అడ్ద్దాల లపై వేసుకు , ఆ బాలు చక్కదనమును చూచెనూ// రామ//

                   వసుదేవు పుత్రుడమ్మా యీ బిడ్డ వైకుంథ వాసుడమ్మా 
                   పరమా పవిత్రుడమ్మా ,యీ బిడ్డ భక్తజన లొలుడమ్మా

                   నవనీత చోరుడమ్మా యీ బిడ్డ నందగొపాలుడమ్మా //
                   శత కమల నేత్రుడమ్మా యీ బిడ్డ లక్ష్మీ నివాసుడమ్మా// రామ //

                  నీ పుణ్య మాయె కొడుకా,,ఇంకొక్క నిముషమ్ము పవళించరా
                  అదుగదుగొ జొగివాడూ ,వస్తాడు నా తండ్రి  పవళించరా//రామ//

                  జొగే  ల వచ్చునమ్మా, నళినాక్షి జొగి నన్నెరుగునమ్మా
                  జొగి మందుల సంచులూ యీ వేళ నా చంక నుండగానూ//  రామ//

                  నా పుణ్య మాయె కొడుకా//ఇంకొక్క నిముషమ్ము పవళించరా
                 అల్లదిగొ పాము వచ్చే నా తండ్రి గొపాల పవళించరా //రామ//

                 పాము నా కిందనమ్మా,శేషు డు పానుపై ఉండగానూ
                 పామెమి చెయునమ్మా,నళినాక్షి పాము నన్నెరుగునమ్మా /రామ//


                 నా పుణ్య మాయె కొడుకా, ఇంకొక్క నిముషమ్ము పవళించరా
                 నీ మామ కంసుండునిన్  ,తెమ్మనీ అడుగ వస్తాడు తండ్రీ/రామ//

                 మామ కంసుండును, తెమ్మనీ అడుగ వస్తెను తల్లీ
                 కరుణతొ అందివ్వవే , దూరమున నిలుచుండి చూడవమ్మా//రామ//

                 నా పేరు కృష్ణుడైతే,నా కాళ్ళ శంఖు, చక్రములు  గలవూ,
                 మా మమ కంసుణ్ని నే,  నిముషములొ వధియింతు చూడవమ్మా//రామ//

                 శిరసునా చింతామణీ,  ఓ తల్లి నాలుకన నక్షత్రమూ, 
                 పండ్లను పరుషవెదీ ,చెదొయి శంఖచక్రములు గలవూ/రామ //

                 వీపునా వింజామరం //ఓ తల్లి బొడ్డునా పారిజాతం/
                 అరికాళ్ళ దామెరలును ,ఓ తల్లి అన్ని కలిగున్నవమ్మా//రామ //

                గిర్మజి పురమందునానెలకొన్న గొవింద రాజు  నపుడూ
                కరుణించి రక్షించునూ ,తా ఇష్ట  కామ్యార్ధముల నిచ్చునూ //రామ //