ఎత్తుకొందురా కృష్ణా,
నా యదుకుల నందన రారా
ఏ భక్తుల చే పట్టు బడితివో
యదుకుల నందన ఇపుడే రారా//ఎత్తు//
అందెలు ,మువ్వలు కదలా, నీ సందిటి గజ్జెలు మెరియా
అందమైన గోవిందా రారా,హరి నీవిపుడే ఆడుతూ రారా //ఎత్తు//
పండ్లు ఇచ్చెదను తండ్రీ నీకు, భక్ష్యము లిచ్చెద నయ్యా నీకు
పండ్లు,ఫలములు ఆరగించి మా పాపములను ఎడ బాపగ రారా /ఎత్తు//
నందుని భాగ్యం బేమో ,నిను ఎత్తుకు ముద్దాడే నయ్యా
గోకులమందున ఆడితివో, గోపాలా రారా కోర్కెలు తీర్చా //ఎత్తు//
No comments:
Post a Comment